Junior Artist Jyothi Reddy Death News: రైలు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ స్టేషన్‌లో మంగళవారం తెల్లవారుజామున రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి చెందిన బట్టినపాత జ్యోతి (26) హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగానూ ఆమె విధులు నిర్వర్తిస్తోంది.
సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన జ్యోతిరెడ్డి.. సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూరు నుంచి కాచిగూడ వస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆమె రైల్వేకోడూరులో ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరింది. రైలు మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకొని షాద్‌నగర్ స్టేషన్‌లో దిగింది.
చదవండి: (వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్)
వెంటనే తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. అప్పటికే రైలు కదులుతుండటంతో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంపై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జ్యోతిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆస్పత్రి వద్ద ఆందోళన..
చాదర్‌ఘాట్: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతితో మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. షాద్‌నగర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో జ్యోతిరెడ్డి తీవ్ర గాయాల పాలైంది. చికిత్స నిమిత్తం ఆమెను మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు.
చదవండి: (Dhanush and Aishwaryaa Separation: ఫలించని తలైవా ప్రయత్నం)
Comments
Please login to add a commentAdd a comment