
అర్చన, రాకేశ్ (ఫైల్)
సాక్షి, మైసూరు: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువజంట ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషాద ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా సింగర మారనహళ్లిలో జరిగింది. హుణసూరు తాలూకా బిళికెరె హోబళి సింగరమారనహళ్లి గ్రామానికి చెందిన అర్చన (18), రాకేశ్ (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను కాదని ఐదు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయి వేరోచోట పెళ్లి చేసుకున్నారు. మైసూరులో కాపురం పెట్టారు.
మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదనివారి తల్లిదండ్రులు సెప్టెంబర్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అర్చన, రాకేశ్‌లు మంగళవారం రాత్రి సింగరమారనహళ్లి గ్రామానికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో బుధవారం ఉదయానికి ఊరు శివార్లలోని పొలంలో చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. బిళికెరె ఎస్‌ఐ రవికుమార్ సిబ్బందితో వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?)
Comments
Please login to add a commentAdd a comment