
పులి బొమ్మతో కోతులు పరార్!
చిలమత్తూరు : మండల కేంద్రం చిలమత్తూరులో కోతులు పగటిపూట ఇళ్లల్లోకి చొరబడి రభస చేస్తున్నాయి. చిన్నారులు, పెద్దలపై దాడులకు కూడా దిగుతున్నాయి. చింత, బొప్పాయి, జామæ తదితర పండ్ల తోటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. దీంతో కోతుల బెడదను అరికట్టడంతో పాటు పంటలను కాపాడుకోవడం కోసం చిలమత్తూరుకు చెందిన ఖాదర్‌బాషా వినూత్నంగా ఆలోచించి పులి బొమ్మను తెచ్చాడు. పండ్ల తోటల యజమానుల వద్ద దినసరి కూలీకి పని చేస్తూ బొమ్మను చూపిస్తూ కోతులను బెదిరించి పారదోలుతుంటాడు.