tiger doll
-
45 నిమిషాల పాటు వణికిన పోలీసులు..
అబెర్డీన్‌షైర్, స్కాట్లాండ్ : రాత్రి పూట కావలి కాస్తున్న ఓ పోలీసు టీం 45 నిమిషాల పాటు భయంతో వణికిపోయింది. శనివారం అర్థరాత్రి సమయంలో అబెర్డీన్‌షైర్ పట్టణంలోని ఈశాన్య పోలీసు డివిజన్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ప్రమాదంలో ఉన్నానని, తన పొలంలోకి పెద్దపులి వచ్చిందని వెంటనే వచ్చి రక్షించాలని బాధితుడి ఫోన్లో గగ్గోలుపెట్టాడు. దీంతో హుటాహుటిన వ్యక్తి పొలం వద్దకు చేరుకున్న పోలీసులు రోడ్డుపై పడుకున్న పులిని చూశారు. హఠాత్తుగా పులిని దగ్గరగా చూసిన అధికారులు భయంతో వణికిపోయారు. దాదాపు 45 నిమిషాల పాటు పులి వైపు వెళ్లకుండా నిల్చుండిపోయారు. ఎంతకీ పులి కదలకపోతుండటంతో వారికి అనుమానం కలిగింది. భయంభయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు వెళ్లగా నిజమైన పులి కాదని తేలింది. పులి బొమ్మను ఎవరో కావాలని ఇలా రోడ్డుపై పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని తెలిసి నాలుక కరచుకోవడం అధికారుల వంతైంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొలంలో ఉన్న బొమ్మను చూసి నిజమైన పులి అనుకుని రైతు చాలా భయపడిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. -
పులి బొమ్మతో కోతులు పరార్!
చిలమత్తూరు : మండల కేంద్రం చిలమత్తూరులో కోతులు పగటిపూట ఇళ్లల్లోకి చొరబడి రభస చేస్తున్నాయి. చిన్నారులు, పెద్దలపై దాడులకు కూడా దిగుతున్నాయి. చింత, బొప్పాయి, జామæ తదితర పండ్ల తోటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. దీంతో కోతుల బెడదను అరికట్టడంతో పాటు పంటలను కాపాడుకోవడం కోసం చిలమత్తూరుకు చెందిన ఖాదర్‌బాషా వినూత్నంగా ఆలోచించి పులి బొమ్మను తెచ్చాడు. పండ్ల తోటల యజమానుల వద్ద దినసరి కూలీకి పని చేస్తూ బొమ్మను చూపిస్తూ కోతులను బెదిరించి పారదోలుతుంటాడు.