రోడ్డు నిర్మాణంలో అక్రమాలు: రాచమల్లు | irregularities in the construction of the road : racamallu | Sakshi
Sakshi News home page

రోడ్డు నిర్మాణంలో అక్రమాలు: రాచమల్లు

Published Sat, Nov 14 2015 3:33 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

irregularities in the construction of the road : racamallu

వైఎస్సార్ జిల్లా ప్రొద్దూటూరు పట్టణంలో రూ.8 కోట్ల వ్యయంతో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తి నాసిరకంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానికంగా రిలయన్స్ పెట్రోల్ పంప్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో తారు వేయాల్సినంతగా లేదని.. మెటల్ సైజు నిర్ణీత మేర లేదని అన్నారు. 

మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోడ్డు నిర్మాణ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే శనివారం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం జరుగుతోందని అన్నారు. కాలువ నిర్మాణం చేయకుండా.. రోడ్డు పనులు పూర్తి చేశారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement