
ప్రొద్దుటూరు టౌన్ : మూడున్నరేళ్లు అధికారంలో ఉండి ప్రజా సొమ్మును దొంగతనం చేసిన దొంగల పార్టీ టీడీపీ నాయకుల భరతం పట్టడానికి ప్రజా పోలీసు వస్తున్నాడని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మా ప్రియతమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి తలపట్టిన పాదయాత్రను ఉద్దేశించి టీడీపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు, మాజీ శాసనసభ సభ్యులు దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని విమర్శలు చేయడం ఏమేరకు సబబని ప్రశ్నించారు. మేము మిమ్ములను దొరలు వస్తున్నారు జాగ్రత్త అని అన్నా బూతుమాటగా వక్రీకరిస్తారని పేర్కొన్నారు.
దొంగలపార్టీ టీడీపీ నాయకుల వద్ద నుంచి ప్రజల సొమ్మును కక్కించేందుకు, ప్రజా సం క్షేమం కోసం పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. మంత్రుల వద్ద నుంచి అందరికీ ఉలికిపాటు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. పేద వారికి ఇళ్లు ఇచ్చారా, రుణాలు మాఫీ చేశారా, ఇంటికో ఉద్యోగం ఇలా చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు.
175 సీట్లు వస్తాయని ప్రగల్బాలు పలుకుతున్న సీఎం రమేష్ 88 సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, నీవు రాజకీయ సన్యాసం చేస్తావా అని ఎమ్మెల్యే సవాలు విసిరారు. ప్రజలకు జగన్‌పై ఓ విశ్వసనీయత నాయకుడన్న నమ్మకం ఉంది కాబట్టే వేలాది మందిగా వచ్చి స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. గృహాలు, ఎర్రచందనం, నీరు–చెట్టు, నానాక గడ్డి తిన్న మీరు గ్రామాల్లోకి వస్తే గుడ్డలు విప్పదీసి చెట్టుకు కట్టేసి కొడతారన్న విషయం సీఎం రమేస్ తెలుసుకోవాలన్నారు.
ఆది రాకతో సీఎం రమేష్ మతి భ్రమించింది: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాకతో సీఎం రమేష్ దుకాణం ఖాళీ అయిందని ఎమ్మెల్యే రాచమల్లు అన్నా రు. బాబు వద్ద పరపతి తగ్గి రెండు నెలలుగా అపాయింట్‌మెంట్ రాక పిచ్చి పిచ్చిగా మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలిపారు. జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇంతకన్నా దారుణంగా మేము మాట్లాడుతామని హెచ్చరిం చారు. వైఎస్సార్‌సీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment