వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం నెల్లూరు నగరంలోని జైలులో ఉన్న ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీకాళహస్తి ఇంచార్జ్ బి.మధుసూధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట వైఎస్ జగన్మోహన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ అవినీతిని అడ్డుకున్నందుకే మిథున్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు.