
సాక్షి, కోలారు (కర్ణాటక): పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి తీరును ఖండిస్తూ రైతు సంఘం పదాధికారులు సోమవారం నగరంలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించి హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ మాట్లాడుతూ... నిత్యం ప్రజాసేవలో ఉంటున్న పోలీసులను నోటి కొచ్చినట్లుగా మాట్లాడడం పరిపాటిగా మారిందని, హోం మంత్రి బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతరం నగర పోలీస్ స్టేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు ఐతాండహళ్లి మంజునాథ్, మహిళా అధ్యక్షురాలు నళినిగౌడ, తాలూకా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment