ఇందిరా గాంధీకి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజ్ గోవాలోని చెఫ్ సతీష్ అరోరా తన పుస్తకంలో పేర్కొన్న ఘటన ఇది. తాను ఇందిరా గాంధీకి బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయి పండ్లు ఇచ్చేందుకు ఎంతలా కష్టపడాడో గుర్తు చేసుకున్నారు. ఓ యుద్ధమే చేసినట్టు తాను రాసిన స్వీట్స్ అండ్ బిట్టర్స్: టేల్స్ ఫ్రమ్ ఏ చెఫ్స్ లైఫ్ అనే పుస్తకంలో వివరించారు. ఇంతకీ ఆ చెఫ్ గెలచాడా? లేదా?
అసలేం జరిగిందంటే..అది 1983లో ఇందిరాగాంధీ చోగం (CHOGM) సమావేశం సందర్భంగా జరిగిన ఘట్టం. చెఫ్ అరోరా ఆ పుస్తకంలో.. 1983 నవంబర్‌లో దివగంత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో గోవాలో దాదాపు 40కి పైగా కామెన్‌వెల్త్ దేశాల నాయకులతో 48 గంటల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ సదస్సు వరల్డ్ టూరిజం మ్యాప్‌లో గోవాను ఉంచాలనే లక్ష్యంతో జరుగుతోంది. వారికి గోవా తాజా హోటల్‌లో ఆతిధ్యం ఏర్పాటు చేశారు. నాయకులకు అందించే వంటకాల మెనుతో సహా ఇందిరాగాంధీ భోజన మెనూ కూడా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చింది.
ఇందిరాగాంధీ బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయిలు తీసుకుంటారని ఆ మెనూలో ఉంది. గోవాలో అది కూడా నవంబర్ మాసం కావడంతో బోపాయిలు ఎక్కడ అందుబాటులో లేవు. అదీగాక ఈ కామెన్‌వెల్త్ నాయకుల సదస్సు కోసం గోవా అంతటా టైట్ సెక్యూరిటీతో పోలీసులు బందోబస్తుతో హాడావిడిగా ఉంది. ఎక్కడిక్కడ మరమత్తులు చేసి వీధి దీపాలు వెలిగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బయటకు వెళ్లి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే పోలీస్ చెకింగ్ దాటుకుని బయటకు వెళ్లి తిరిగి రావడం మాటలు కాదు. దీంతో చెఫ్‌ల బృందం బొప్పాయిలను ముంబై తాజ్ నుంచి తెప్పించే ఏర్పాట్లు చేసిందని అక్కడే ఐదేళ్లుగా సేవలందించిన చెఫ్ సతీష్ అరోరా వెల్లడించారు.
"వచ్చిన పచ్చి బొప్పాయిలు తొందరగా పక్వానికి వచ్చేలా కాగితం చుట్టి ఉంచాను. అవి పక్వానికి మెల్లగా వస్తున్నాయి. ఇంకో పక్క ఇందిరా గాందీ, ఆమె సిబ్బంది బ్రేక్ ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పడంతో ఎలా అందించాలో తెలియక కలవరపడుతున్నాం. ఎందుకంటే సరిగా పక్వానికి రానీ పండ్లను వారికి ఎలాఅందించాలో తెలియక ఒకటే ఆందోళన. ఇక లాభం లేదనుకుని ఆమెకు బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయిలు అందించేందుకు పోలీస్ జీపులో ఓ యుద్ధ వీరుడి మాదిరి గోవా మార్కెట్‌లన్నీ గాలించానని" తెలిపారు అరోరా. "చివరికి ఓ మార్కెట్‌లో పండిన బొప్పాయిలు కనిపించాయి. ఓ డజను బొప్పాయిలను తీసుకుని అదే జీపులో వస్తూ.. ఏదో సాధించిన వీరుడిలా ఆనందంగా వచ్చా".
కానీ చివరికి ఆ హోటల్ ప్రవేశించేందుకు హోటల్ సెక్యూరిటీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యులు అరోరాను అడ్డుకున్నారు. వాస్తవాన్ని వివరించి ఎంతగా బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పండ్లలో పేలుడు పదార్థాలు ఉన్నాయోమో! అని ప్రతి దానికి రంధ్రాలు పెట్టి చెక్‌చేశారు. ఓ రెండు చెక్‌లు చేసి వదిలిపెట్టక మొత్తం అన్నింటికి రంధ్రాలు చేశారు సెక్యూరి సిబ్బంది. ఏదో రకంగా ప్రదాని ఇందిరా గాంధీకి బ్రేక్‌ఫాస్ట్‌గా బోప్పాయిల అందిచేందుకు చేసిన యుద్ధం విజయవంతం కాకపోగా తమకు అత్యంత నిరాశనే మిగిల్చిందంటారు అరోరా. పైగా జీవితంలో మర్చిపోలేనంత టెన్షన్‌కి గురిచేసిన రసవత్తరం ఘట్టం అని తన పుస్తకం స్వీట్స్ అండ్ బిట్టర్స్‌లో చెప్పుకొచ్చారు చెఫ్ అరోరా. నాయకులకు సంబంధించని కొన్ని ఆసక్తకర విషయాలు వాళ్లు మన ముందు సజీవంగా లేకపోయినా వాళ్ల నిర్ణయాలు, జీవితశైలికి అద్దం పట్టేలా కనిపిస్తాయి కదూ!.
(చదవండి: సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే ఇవాళ అయోధ్య..!)
Comments
Please login to add a commentAdd a comment