గత 7 ఏళ్లలో 17 రేట్లు పెరిగిన తర్వాత భారతదేశ సౌరశక్తి సామర్థ్యం సుమారు 45 గిగావాట్లకు చేరుకుందని నేడు జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో ఇండియా తెలిపింది. ప్రపంచ జనాభాలో 17 శాతం జనాభా కలిగిన దేశం, కాలుష్య ఉద్గారాల పరంగా 4 శాతం మాత్రమే అని నొక్కి చెప్పింది. సీఓపీ26 వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో 11వ ఫెసిలిటేటివ్ షేరింగ్ ఆఫ్ వ్యూస్(ఎఫ్ఎస్ వి) సందర్భంగా తన మూడవ ద్వైవార్షిక నవీకరణ నివేదిక(బియుఆర్)పై ప్రజంటేషన్ ఇస్తూ భారతదేశం ఇలా చెప్పింది.
ప్రస్తుత వార్షిక గ్రీన్ హౌస్ వాయువు(జీహెచ్ జీ) ఉద్గారాలు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపింది. గత ఏడేళ్లలో భారత దేశం ఏర్పాటు చేసిన సౌరశక్తి సామర్థ్యాన్ని 17 రెట్లు పెంచామని, సౌరశక్తి సామర్థ్యాన్ని ఇప్పుడు 45 గిగావాట్లకు చేరుకున్నట్లు అని భట్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. "2015 - 2019 మధ్య, అడవి విస్తీర్ణం 13,031 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఆసియా సింహం, ఏనుగు, ఖడ్గమృగాల సంఖ్య గత 5 నుంచి 6 సంవత్సరాలలో అనేక రెట్లు పెరిగింది" అని భారతదేశం ప్రకటనలో తెలిపింది.
(చదవండి: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు)
Comments
Please login to add a commentAdd a comment