మానవత్వం చాటుకున్న ట్రాన్స్‌జెండర్‌ ఎస్‌ఐ | SI Shows Her Humanity In Tamilnadu | Sakshi
Sakshi News home page

Transgender SI: మానవత్వం చాటుకున్న ట్రాన్స్‌జెండర్‌ ఎస్‌ఐ

Published Thu, Dec 9 2021 7:47 AM | Last Updated on Thu, Dec 9 2021 10:48 AM

SI Shows Her Humanity In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రాణాపాయ స్థితిలో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌కు ట్రాన్స్‌ జెండర్‌ ఎస్‌ఐ ప్రితికా యాసిని రక్తదానం చేశారు. ఈ సమాచారంతో ప్రితికాను కమిషనర్‌ శంకర్‌ జివ్వాల్‌ బుధవారం అభినందించారు. చెన్నై అన్నాసాలై పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా కె ప్రితికా యాసిని పనిచేస్తున్నారు. రాష్ట్రంలో తొలి ట్రాన్స్‌జెండర్‌ ఎస్‌ఐగా గుర్తింపు పొందారు.

ఈ క్రమంలో స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ శంకర్‌ అనార్యోగంతో ఉండడంతో రెండు రోజుల క్రితం పరామర్శించారు. ఆయనకు అత్యవసరంగా మూడు యూనిట్ల రక్తం అవసరం కావడంతో మంగళవారం తానే ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. కమిషనర్‌ శంకర్‌ జివ్వాల్‌ ఎస్‌ఐను అభినందించారు.   

చదవండి: బంజారాహిల్స్‌ కారు యాక్సిడెంట్‌ కేసు: కొంత ‘కాంప్రమైజ్‌’?.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement