హిజ్రాకు నియామక పత్రం అందజేస్తున్న మంత్రి నాజర్
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): హిజ్రాగా మారాడన్న కారణంతో బాధ్యతలు అప్పగించకుండా నిర్లక్ష్యానికి గురైన అభ్యర్థి సమస్యకు మంత్రి చొరవతో గంటలో పరిష్కారం లభించింది. తిరువళ్లూరు జిల్లా పూందమల్లికి చెందిన సంతానరాజ్ (42) 2010లో గ్రామ కార్యదర్శిగా ఉద్యోగం పొందాడు. 2016 వరకు కొడువేళి గ్రామంలో విధులు నిర్వహించాడు. అనంతరం సంతానరాజ్ హిజ్రాగా మారి ద్రాక్షాయణిగా పేరు మార్చుకున్నాడు.
దీంతో కొడువేళి గ్రామాం బాధ్యతలను మరొకరికి అప్పగించి సంతానరాజ్‌ను పక్కన పెట్టారు. అప్పటి నుంచి అతనికి బాధ్యతలు అప్పగించలేదు. తనకు న్యాయం చేయాలని బాధితుడు మంత్రి నాజర్‌ను శుక్రవారం కలిశాడు. గంటలో అతనికి పునః నియామక పత్రం సిద్ధం చేయాలని మంత్రి పీడీని ఫోన్‌లో ఆదేశించారు.
ఆవడిలోని మంత్రి నివాసానికి పీడీ పరుగులు పెట్టారు. సంబంధిత ఉత్తర్వులను మంత్రి నాజర్ చేతుల మీదుగా సంతానరాజ్ అందుకుని కొడువేళి గ్రామంలో విధుల్లో చేరారు. మంత్రి చర్యలకు పలువురు సోషల్ మీడియాలో ప్రశంసలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment