transgender (LGBT)
-
వినీత్, తన సహచరుడిని ప్రేమించాడు! ఇక ట్రాన్స్‌జెండర్ మాయ.. వీళ్ల గురించి అసలు ఎందుకిలా?
వినీత్ (పేరు మార్చడమైనది) సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. అతను తన సహచరుడు ప్రేమించుకున్నారు. వారిద్దరూ కలిసి బతకాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా చివరకు వారి నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కానీ, ‘మగవాళ్లు ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారట..’ అనే వ్యంగ్యపు మాటలు వారిని బాధిస్తున్నాయి. అంతేకాదు, సోషల్ మీడియాలో వారికి సంబంధించిన వార్తలు, వ్యతిరేక కామెంట్లు, లైంగికపరమైన చర్చలు జరుపుతుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ‘మేం, మాలాంటి వారంతా గౌరవంగా బతకాలనుకుంటున్నాం. ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మా ఎదుగుదలకు సంబంధించి కాకుండా, లైంగికపరంగా మమ్మల్ని దిగజార్చే మాటలే ఎందుకు పదే పదే వస్తున్నాయి. ఈ బాధించే మాటలు, వీడియోల నుంచి మాకు విముక్తి ఎప్పుడు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ∙∙ మాయ ట్రాన్స్‌జెండర్. ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. సమాజంలో తమ వర్గాన్ని తక్కువగా చూస్తారన్న భయం ఆమెలో లేకపోలేదు. దానికి తోడు యూ ట్యూబ్ చూస్తున్నప్పుడల్లా ఆమెను వేల ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. వీడియోలు వైరల్ అవడం కోసం తమ వర్గానికి చెందిన వారిని లైంగికపరమైన విషయాలమీదనే ఫోకస్ చేస్తున్నారనేది ఆమె బాధ. దీనివల్ల సహచర ఉద్యోగుల్లోనూ, చుట్టుపక్కల కుటంబాల్లోనూ తనను కూడా అదే విధంగా చూస్తారని, నాలాగ బాధపడుతున్నవారు ఎంతో మంది ఉన్నారంటోంది మాయ. ∙∙ ఇది నేటి సమాజంలో అణచివేతకు గురికాబడుతున్న మరో వర్గంగా స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లను ప్రధానంగా చూస్తుంటాం. ఎల్జిబిటిక్యూఐఎ అనే పేరుతో వీరు హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో తమ సమస్యలను విన్నవించుకుంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఈ జుగుప్సాకరమైన కంటెంట్ కలిగించే ఆందోళనను ఓ సున్నితమైన అంశంగా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. తమ వర్గం వారిలోనూ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతోద్యోగాలు చేసుకుంటున్నవారు ఉన్నారని, తమ విజయగాధలను తెలియజేయమని ఈ సందర్భంగా వారు వేడుకున్నారు. వైరల్ ప్రధానమా? సోషల్ మీడియా ద్వారా డబ్బు రావాలంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక సాధనం అని మనకు తెలిసిందే. ఎంత వైరల్ అయ్యే అంశాలు ఉంటే ఆ వీడియో ద్వారా అంత డబ్బు, దానితో పాటు పేరు వస్తుందని చాలా మందికి తెలుసు. అందుకే, ఆసక్తిని రేకెత్తించే అంశం ఏమిటో దానినే వీడియో అప్లోడ్ చేసేవారు ఎంచుకుంటారు. దీనితో పాటు వెబ్‌సైట్స్ ఇతర సామాజిక మాధ్యమాలు కూడా వార్త వైరల్ అయ్యేందుకు ఈ అంశాలను ఎంచుకుంటాయి. సైబర్ వేధింపులు సామాజిక మాధ్యమాల్లో మహిళలే అధిక వేధింపులకు లోనవుతుంటారు. అయితే, ఇటీవల పెరుగుతున్న పరిణామాల్లో ఎల్‌జిబిటిక్యూఐ+ కూడా చేరుతోంది. ఆఫ్‌లైన్‌లో జాతి, మత, వర్గంలో ఉండే విభేధాలు ఆన్‌లైన్‌లోనూ చూస్తుంటాం. డిజిటల్ యుగంలో తమ ఉనికిని చాటుకునే రోజుల్లో ఉన్నాం కాబట్టి ఎంచుకునే అంశాలు మరింత సున్నితంగా, తోటి వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. సహాయం కోసం వీరిని సంప్రదించవచ్చు రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా, సమాజంలో తమ గౌరవం దెబ్బతింటుందని, ఇతరులు తమను వేధింపులకు లోను చేస్తున్నారని అవి సమస్యగా తమ జీవనానికి అడ్డంకిగా ఉందనుకుంటే... 1. చట్టపరమైన రక్షణ కోసం 100కి కాల్ చేసి, పోలీసుల సాయం పొందవచ్చు. 2. జాతీయ/రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) అనేది జాతీయస్థాయి ప్రభుత్వ సంస్థ. మానవ హక్కుల ఉల్లంఘనలను ఈ సంస్థ ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. ఎల్జిబిటిక్యూ+ వ్యక్తులైన వారు తమకు తగిన సహాయం కావాలంటే వీరిని సంప్రదించవచ్చు. 3. మహిళల కోసం జాతీయ /రాష్ట్ర కమిషన్: నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) అనేది లైంగిక నేరాలు, గృహహింస, వేధింపులు .. మొదలైన వాటి నుంచి మహిళల రక్షణలో పనిచేసే జాతీయస్థాయి ప్రభుత్వ సంస్థ. ఈ ఎన్సీడబ్ల్యూ కూడా తగిన సహాయం చేస్తుంది. 4. ఆన్లైన్ క్రైమ్ రిపోర్టింగ్ (ఆన్లైన్లో చేసిన వేధింపుల కింద) https://www.cybercrime.gov.in లోనూ రిపోర్ట్ చేయవచ్చు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఎవరికి రిపోర్ట్ చేయాలి? సామాజిక మాధ్యమాల ద్వారా తమ గౌరవానికి భంగం కలిగించే అంశాలు ఉంటే రిపోర్ట్ చేయాల్సింది.. ఫేస్బుక్ .. https://www.facebook.com/help/ 116326365118751 ట్విటర్ ... https://help.twitter.com/en/safety-and-security/report-abusive-behavior ఇన్స్టాగ్రామ్–యూట్యూబ్ https://help.instagram.com/547601325292351 https://support.google.com/youtube/answer/2801939#protected_group లింక్డ్ఇన్: https://www.linkedin.com/help/linkedin/answer/a1336329/report-harassment-or-a-safety-concern?lang=en పైన ఇచ్చిన సోషల్‌మీడియా లింక్స్ ద్వారా ఆయా విభాగాలకు రిపోర్ట్ చేయవచ్చు. దానిపైన ఆ మాధ్యమాలు తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్. చదవండి: Beaumont Children Missing Case: ఆస్ట్రేలియా చరిత్రలో అపఖ్యాతి.. ఆ ముగ్గురు పిల్లలు ఏమయ్యారు? -
కూతుళ్ల కోసం ‘తల్లి’గా మారాడు!
క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి. -
ఈ డాక్టర్లకు ఆల్ ది బెస్ట్
హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నియామకం పొందారు. అదేం పెద్ద విశేషం? విశేషమే. ఎందుకంటే వీరిద్దరూ ట్రాన్స్జెండర్లు. గత కొంతకాలంగా దేశంలో తమ ఆత్మగౌరవం కోసం, ఉపాధి కోసం, హక్కుల కోసం పోరాడుతున్న ‘ఎల్జిబిటి’ సమూహాలకు ఈ నియామకం ఒక గొప్ప గెలుపు. అందుకే వీరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. గత వారం ప్రాచీ రాథోడ్ (30), రూత్ జాన్ పాల్ (28) ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో హెచ్.ఐ.వి రోగులకు చికిత్స అందించే ఏ.ఆర్.టి విభాగంలో వైద్యాధికారులుగా నియమితులయ్యారు. వీరు రాష్ట్రంలో డాక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన తొలి ట్రాన్స్జెండర్లు కావడం విశేషం. కొత్త చరిత్రకు నాంది పలికిన వీరు ‘సాక్షి’ తో తమ అనుభవాలు పంచుకున్నారు. మా కమ్యూనిటీకి విజయమిది... ఈ ఇద్దరిలో డాక్టర్ రూత్‌ది ఖమ్మం. డాక్టర్ ప్రాచీ రాథోడ్‌ది ఆదిలాబాద్ జిల్లా. చిన్న వయసులోనే డాక్టర్లు కావాలని కలలు కన్నప్పటికీ, కుటుంబ సభ్యుల మద్దతు కరువై, స్కూల్లో తోటి విద్యార్థుల వేధింపులు, సమాజంలో చిన్నచూపు వంటివి ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని సాధించగలిగారు. తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యం కోసం పోరాడుతున్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇదొక చారిత్రాత్మక విజయం అని వీరు అంటున్నారు. అర్హత ఉన్నా... తిరస్కరించారు... ‘మల్లారెడ్డి వైద్య విజ్ఞాన సంస్థలో 2018లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటి నుంచి ఉద్యోగం కోసం విఫలయత్నాలు ఎన్నో చేశా. సిటీలో కనీసం 15–20 ఆసుపత్రులు ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించాయి. దీనికి కారణం మా జెండర్ అని ముఖం మీద చెప్పలేదు. కానీ అది మాకు అర్ధమైంది’ అన్నారు డా.రూత్.. తొలుత ఓ ఆసుపత్రిలో ఇన్ టర్న్షిప్ చేస్తున్నప్పుడు తనకు ఏ సమస్యా రాలేదనీ ∙లింగ మార్పిడి విషయం బయటపెట్టిన తర్వాతే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారామె. తన అర్హతలను కాకుండా జెండర్‌నే చూశారన్నారు. తెలిశాక... వద్దన్నారు... డాక్టర్ ప్రాచీ రాథోడ్ రిమ్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్‌రంగంలో పనిచేస్తూ కెరీర్ ప్రారంభించారు. సిటీలో ఓ ఆస్పత్రిలో పని చేస్తూనే ఎమర్జెన్సీ మెడిసిన్ లో డిప్లొమా చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడేళ్లపాటు పని చేశారు. తన మార్పిడి గురించి తెలిశాక.. రోగులరాకకు ఇబ్బంది అవుతుందని ఆసుపత్రి భావించడంతో ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఏపీలో పెన్షన్ భేష్ ‘ఉస్మానియాలో సహ వైద్యులు, రోగులు బాగా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడం సంతోషంగా ఉంది’ అని వీరు చెప్పారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్జెండర్లకు పింఛనుగా ఏటా రూ.10 వేలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అలాంటి ప్రత్యేక సహాయ సహకారాలు అన్ని చోట్లా మొదలు కావాలని ఆశిస్తున్నామన్నారు. ‘మేమిద్దరం ట్రాన్స్ఉమెన్ గా నీట్ పీజీ పరీక్షలను రాశాము, అయితే థర్డ్ జెండర్‌ను గుర్తించి అడ్మిషన్ ను మంజూరు చేసేందుకు వీలు కల్పించిన 2014 నాటి సుప్రీం కోర్ట్‡ తీర్పుకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్లు పొందలేదు’ అని చెప్పారు. తమ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతామని, సమాజంలో సమాన హక్కులకై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. దేశంలోనూ అక్కడక్కడ వైద్య రంగంలో కెరీర్ ఎంచుకుంటున్న ట్రాన్స్‌జెండర్స్ దేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నారు. కర్ణాటకలో త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ట్రాన్స్ డాక్టర్‌గా, యాక్టివిస్ట్‌గా జాతీయస్థాయిలో పేరొందారు. అలాగే కేరళకు చెందిన వి.ఎస్.ప్రియ కూడా లింగమార్పిడి చేయించుకున్న తొలి వైద్యురాలిగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్ ప్రారంభించిన తొలి నగరంగా సిటీ నిలిచింది. ఇద్దరు ట్రాన్స్ డాక్లర్లకు చిరునామాగా నిలిచిన ఘనతను కూడా తన సొంతం చేసుకుంది. ఒకే తరహా కష్టం కలిపింది స్నేహం అనేకానేక బాధాకరమైన అనుభవాల తర్వాత బతుకుదెరువు వేటలో భాగంగా వీరు ఇద్దరూ వేర్వేరుగా గత ఏడాది నారాయణగూడలో ఎన్.జి.ఓ ఆధ్వర్యంలో ప్రారంభమైన ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ‘మిత్ర్’లో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఒకే తరహా సమస్యల మధ్య ఏర్పడిన తమ స్నేహం వేగంగా దృఢమైన బంధంగా బలపడిందనీ ఒకరి కొకరు తోడుగా, తోడబుట్టిన అక్కచెల్లెళ్లను మించి సాగుతోందని వీరు చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నామంటున్నారు. – ఎస్.సత్యబాబు సాక్షి, సిటీబ్యూరో -
ఒక్క ఫోన్ కాల్.. హిజ్రా ద్రాక్షాయణికి ఉద్యోగం
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): హిజ్రాగా మారాడన్న కారణంతో బాధ్యతలు అప్పగించకుండా నిర్లక్ష్యానికి గురైన అభ్యర్థి సమస్యకు మంత్రి చొరవతో గంటలో పరిష్కారం లభించింది. తిరువళ్లూరు జిల్లా పూందమల్లికి చెందిన సంతానరాజ్ (42) 2010లో గ్రామ కార్యదర్శిగా ఉద్యోగం పొందాడు. 2016 వరకు కొడువేళి గ్రామంలో విధులు నిర్వహించాడు. అనంతరం సంతానరాజ్ హిజ్రాగా మారి ద్రాక్షాయణిగా పేరు మార్చుకున్నాడు. దీంతో కొడువేళి గ్రామాం బాధ్యతలను మరొకరికి అప్పగించి సంతానరాజ్ను పక్కన పెట్టారు. అప్పటి నుంచి అతనికి బాధ్యతలు అప్పగించలేదు. తనకు న్యాయం చేయాలని బాధితుడు మంత్రి నాజర్‌ను శుక్రవారం కలిశాడు. గంటలో అతనికి పునః నియామక పత్రం సిద్ధం చేయాలని మంత్రి పీడీని ఫోన్లో ఆదేశించారు. ఆవడిలోని మంత్రి నివాసానికి పీడీ పరుగులు పెట్టారు. సంబంధిత ఉత్తర్వులను మంత్రి నాజర్ చేతుల మీదుగా సంతానరాజ్ అందుకుని కొడువేళి గ్రామంలో విధుల్లో చేరారు. మంత్రి చర్యలకు పలువురు సోషల్ మీడియాలో ప్రశంసలు తెలుపుతున్నారు. -
పద్మ అవార్డులు: చీర కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది
సాక్షి, వెబ్‌డెస్క్: ట్రాన్స్జెండర్లు.. ఈ పేరు వినగానే చాలా మందికి రోడ్డు మీద భిక్షాటన చేసుకునేవారే గుర్తుకు వస్తారు. అయితే అందరూ అలానే ఉంటారనుకుంటే పొరపాటు. వారిలో కూడా చాలామంది మంచి ఉద్యోగాలు చేసేవారు.. సమాజసేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నావారు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మంజమ్మ జోగతి. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికి మిగతా వారికి భిన్నంగా జీవితాన్ని గడుపుతోంది. ఫోక్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక అవార్డు తీసుకునే వేళ మంజమ్మ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజనులు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ) కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గాను మంజమ్మ జోగతి రికార్డులకెక్కారు. పద్మశ్రీ అవార్డు అందుకునే సమయంలో మంజమ్మ జోగతి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తనదైన స్టైల్లో ఆశీర్వదించి, నమస్కరించిన తీరు సభికుల్ని ఆకట్టుకుంది. మంజమ్మ తన చీర కొంగుతో రామ్‌నాథ్‌కు దిష్టి తీసినట్లు చేశారు. ఇది వారి స్టైల్లో ఆశీర్వదించడం అన్నమాట. రామ్‌నాథ్ కోవింద్ కూడా మంజమ్మ ఆశీర్వాదాన్ని స్వీకరించారు. ఇది చూసిన సభికులు చప్పట్లతో వారివురిని ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇక దేశంలో పద్మశ్రీ అందుకున్న(2019లో) తొలి ట్రాన్స్ జెండర్‌గా నిలిచారు మంజమ్మ. (చదవండి: పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!!) మంజమ్మ జీవితం.. మంజమ్మ దశాబ్దాలపాటు సామాజిక, ఆర్థిక పోరాటాలు చేశారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తట్టుకుని.. నిలబడి.. నేడు సన్మానాలు అందుకున్నారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించిన తర్వాత మంజమ్మగా పేరు మార్చుకున్నారు. ఇక ఆమె కుటుంబం మంజమ్మను జోగప్పగా మార్చడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్లింది. ట్రాన్స్జెండర్ల సంఘం తమను తాము రేణుకా ఎల్లమ్మ దేవత సేవలో అంకితం చేసుకునే ప్రక్రియే జోగప్ప. ఇలా మారిన వారు దేవతను వివాహం చేసుకున్నట్లు భావిస్తారు. పేదరికం, సాంఘిక బహిష్కరణ, అత్యాచారాల మధ్యనే మంజమ్మ జోగతి పలు కళారూపాలు, జోగతి నృత్యం, స్త్రీ దేవతలను స్తుతిస్తూ కన్నడ భాషా జానపద పాటలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. (చదవండి: బిగ్‌బాస్ 5: ఆ అరగంట ఎలాంటి కట్ లేకుండా..) మంజమ్మ సేవలకు గాను 2006లో, ఆమెకు కర్ణాటక జనపద అకాడమీ అవార్డు లభించింది. 13 సంవత్సరాల తర్వాత అనగా 2019లో, ఆమె సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. చదవండి: భర్తకు చెప్పి ఎక్కడం మొదలుపెట్టాను -
బిగ్‌బాస్ 5: ఆ అరగంట ఎలాంటి కట్ లేకుండా..
Tamil Bigg Boss Seanson 5 Namitha Marimuthu Heart Touching Story: బిగ్‌బాస్.. ఈ రియాలిటీ షోను జెన్యూన్‌గా ఆదరించే వాళ్ల శాతం తక్కువే కావొచ్చు. చాలామందికి ఈ రియాలిటీ షో మీద సదాభిప్రాయం లేకపోయి ఉండొచ్చు. సెలబ్రిటీలు-నాన్ సెలబ్రిటీలను ఓ హౌజ్‌లో టాస్క్‌లు-గేమ్‌ల పేరుతో చేసే గారడీ అని, వాళ్లు పంచేవి ఫేక్ ఎమోషన్స్ అని ఫీలవుతుంటారు. ఇలా ఎవరి అభిప్రాయలు వాళ్లవి. కానీ, తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 5లో గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 5.. 18 మంది కంటెస్టెంట్లతో అక్టోబర్ 3న ప్రారంభమైంది. సీనియర్ హీరో కమల్ హాసన్ ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కంటెస్టెంట్లో ట్రాన్స్‌జెండర్ నమిత మారిముత్తు పాల్గొంటోంది. మిస్ ట్రాన్స్ స్టార్ ఇంటర్నేషనల్ 2020 విన్నర్, మోడల్ కమ్ నటి అయిన నమిత.. ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌కు ప్రత్యేక ఆకర్షణ కావడం విశేషం. ఇక ‘ఒరు కథై సొల్లాటుమా’ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్ ఒక్కొక్కరు ఒక్కో కథను చెప్పుకుంటూ వచ్చారు. తన వంతు వచ్చేసరికి భావోద్వేగంగా నమిత చెప్పిన కథ తోటి హౌజ్ మేట్స్‌నే కాదు.. షోను తిలకించిన వాళ్లెందరినో కదిలించింది. కొందరి వల్ల సొసైటీలో తనలాంటి వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి.. సమాజం తమను అంగీకరించకపోవడం గురించి ఒక ప్రతినిధిగా దాదాపు అర్థగంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడింది నమిత. #NamithaMarimuthu 😟😟 Paavam la 😐 First time... BB la oru life story paarthu tears😪 Life is not easy for them😔 Hope this society atleast give comfortable space for them to live like us 💫❤#BBTamilSeason5 #BiggBossTamil5 — Yuna ᴹᴵ (@Yuna_Chillz) October 7, 2021 ఇది కదా చర్చించాల్సింది! సొసైటీలో తనకు ఎదురైన అనుభవాలు, అవమానాల్నే కథగా అల్లిన నమిత.. ఆ కథను ఆద్యంతం భావోద్వేగాలతో చెబుతూ పోయారు. ‘మన సమాజం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఇదే సమాజంలో మా స్థానం ఎక్కడ? మమ్మల్ని ఎందుకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు, అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?. మానసికంగా, శారీరకంగా మమ్మల్ని చంపేస్తున్నారు. అందుకే రోడ్ల మీద అడుక్కుని బతకాల్సి వస్తోంది. Thalaivar Kalaignar Karunanidhi will be Remembered Forever for such Works.. Proud 😍🔥#KalaignarForever #NamithaMarimuthu #BiggBoss5Tamil pic.twitter.com/An4Du5FGXu — நிதன் சிற்றரசு (@Srinileaks) October 8, 2021 మమ్మల్ని మనుషుల్లాగే చూడడం లేదంటూ.. కన్నీళ్లతో మాట్లాడింది నమిత. అంతేకాదు కొందరి వల్ల తనలాంటి వాళ్లకు చెడ్డ పేరు వస్తోందని, అలాంటి ప్రచారం చేసేవాళ్లతో సహా సంఘంలోని అందరిలోనూ తమపట్ల మార్పు రావాలంటూ, తనలా అందరూ రాణిస్తే సంతోషిస్తానని చివర్లో కోరుకుందామె. ఇక స్టార్ విజయ్ ఛానెల్ వాళ్లు కూడా సింగిల్ కట్ లేకుండా, ఎడిట్ చేయకుండా!, బీప్ లేకుండా ఆ అరగంట సీక్వెన్స్‌ను టెలికాస్ట్ చేయడం విశేషం!. అంతకు ముందు ఇదే హౌజ్‌లో ఇసయ్వాణి, చిన్నపొన్నులు సైతం పేదరికంలో తాము పడ్డ కష్టాల్ని పంచుకోగా.. ఆ రియల్ ఎమోషన్స్ సైతం చాలామందిని కదిలించాయి. ట్విటర్లో నమిత.. బిగ్‌బాస్ హౌజ్ వేదికగా కోట్ల మందికి తన గా(వ్య)థను పంచిన నమితను అభినందించని వాళ్లంటూ లేరు. అందుకే రాత్రి నుంచే ఆమెకు మద్దతుగా #NamithaMarimuthu హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో కడదాకా ఉంటుందో లేదో తెలియదుగానీ నమిత కథ మాత్రం.. ఓ బర్నింగ్ ఇష్యూను ఓ బుల్లితెర పాపులర్ షో ద్వారా సాధారణ ప్రజల ముందుకు తీసుకురావడం ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు తెలుగు బిగ్‌బాస్ 5 సీజన్లోనూ సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ ఇదే తరహా ఎమోషన్స్‌ను పంచిన విషయం తెలిసిందే. కంటెంట్ తక్కువతో కలర్ఫుల్గా షోలను నడిపించేవాళ్లు.. తమిళ, తెలుగు బిగ్‌బాస్ హౌజ్‌ల నుంచి చాలా నేర్చుకోవాలనే సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పడు. The pain in #NamithaMarimuthu’s story.💔 Not an ordinary struggle mentally and physically. Jus to hear only was so #exhausing. Can’t imagine what she must have gone through. More power to her and many more achievers from #LGBTQ.#BiggBossTamil #BiggBossTamil5 pic.twitter.com/FaZqJpgRrd — Ajay Ashok🅰️🅰️ (@AjayAsho) October 7, 2021 Her story says how we failed as a society 😭😭 #NamithaMarimuthu #BiggBossTamil5 pic.twitter.com/BY8pGKRxkm — Charan (@Charan_Soz) October 7, 2021 #BiggBossTamil5 She won 17❤️ from #BiggBoss house Million ❤️❤️❤️ from outside the house 🏠#NamithaMarimuthu pic.twitter.com/VQ6gcHzndE — Stay Positive37 (@helothamizha) October 7, 2021 Nameetha Marimuththu She is an icon to showcase the world -People Themselves are more beautiful - She spoke louder her inner feelings and respect @vijaytelevision for not editing her speech ♥️ She is the way beautiful - She is #NamithaMarimuthu #transgenderpride pic.twitter.com/M3NPwIaokl — Bigg Boss Tamil Season 5 (@biggbosstamil_5) October 7, 2021 చదవండి: తెలుగు బిగ్‌బాస్.. ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ -
విత్ డ్రా చేస్కో లేదంటే చంపేస్తాం: ట్రాన్స్‌జెండర్‌కు వేధింపులు
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉందని ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిపై కొందరు దుండగులు బరి తెగించారు. ఆమెను వేధింపులకు గురి చేసి చివరకు ఎన్నికల పోటీ నుంచి విరమించుకునేటట్టు చేశారు. దీంతో ఎన్నికల నుంచి ఆమె విరమించుకుంది. ఆమె నామినేషన్ ఉపసంహరించకోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఈ పరిణామం కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగింది. ఆమెను వేధింపులకు గురి చేసింది సొంత పార్టీ నాయకులు కావడం గమనార్హం. తొలిసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా అనన్య కుమారి అలెక్స్ పోటీలో నిలిచింది. దీంతో ఆమె ప్రత్యేక ఆకర్షణగా మారారు. మలప్పురం జిల్లాలోని వెంగర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. డెమోక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ (డీఎస్‌జేపీ) తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని తీవ్రమైన హెచ్చరికలు వచ్చాయి. దీంతో చివరకు ఆ వేధింపులు భరించలేక ఆమె నామినేషన్ ఉపసంహరించుకుని పోటీ నుంచి విరమించుకుంది. అయితే ఆ వేధింపులకు పాల్పడిన వారు ఎవరో కాదు సొంత పార్టీ నాయకులే. డీఎస్‌జేపీ నాయకులు యూడీఎఫ్ అభ్యర్థికి పీకే కున్హాల్ కుట్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనన్య కుమారి అలెక్స్ నామినేషన్ ఉపసంహరించుకోవాలని వేధింపులకు పాల్పడ్డారు. వేధించడంతో పాటు అవమానించారని అనన్య బాధపడింది. అనన్య కుమారి మొదటి రేడియో జాకీగా గుర్తింపు పొందారు. న్యూస్ యాంకర్‌గా, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పేరు పొందారు. -
కుమార్తెని పరిచయం చేసి షాకిచ్చిన షకీలా
‘షకీలా’ ఈ పేరుకు ఒకప్పుడు ఇండస్ట్రీలో యమ క్రేజ్. స్టార్ హీరోలకు సైతం దక్కని పాపులారిటీని సొంతం చేసుకున్నారు షకీలా. ఆ తరువాత ఉన్నట్లుండి కెరీర్లో ఢీలా పడ్డారు. కారణం ఏదైనా ఆ తరువాత మాత్రం చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యారు. కాగా షకీలా సినిమా కెరీర్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ పలు ఒడిదుడుగులు చవి చూశారు. తనను అర్థం చేసుకునే వాడు దొరకకపోవడంతో.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు షకీలా. ఇదంతా పక్కనపెడితే గత కొద్ది రోజులుగా తెరకు దూరంగా ఉన్న షకీలా ఇటీవల మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. తమిళ బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘కుకు విత్ కోమలి’లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న షకీలా.. ఈ సీజన్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఓ రోజు ఈ షోలో తన కుమార్తెని పరిచయం చేసి కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు షకీలా. మిల్లా నా కుమార్తె అంటూ షకీలా ఓ యువతిని పరిచయం చేశారు. ఇది చూసి కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ తిన్నారు. అసలు షకీలా వివాహం ఎప్పుడు చేసుకున్నారని ఆలోచించడం ప్రారభించారు. ఈ ప్రశ్నలకు షకీలా సమాధానం ఇచ్చారు. మిల్లా తన సొంత కుమార్తె కాదని.. చాలా ఏళ్ల క్రితమే తనను దత్తత తీసుకున్నానని తెలిపారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే మిల్లా ట్రాన్స్‌జెండర్. కుమార్తెని పరిచయం చేస్తూ షకీలా భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మిల్లా చిన్నప్పుడే నేను తనని దత్తత తీసుకున్నాను. ఆమెను నా సొంత కూతురిలా పెంచుకున్నాను. కష్టకాలంలో నాకు మిల్లా చాలా సపోర్ట్ చేసింది. నేను కూడా ఆమెకు చాలా సపోర్ట్ ఇచ్చా. నేనంటే ఆమెకు ఎంతో ప్రేమ’’ అన్నారు. కాగా మిల్లా కాస్ట్యూమ్ డిజైనర్‌గా బిజీగా గడుపుతున్నారు. అలగే మోడల్‌గా ప్రయత్నిస్తున్నారు. చదవండి: కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’ -
హిజ్రాలకు ఐటీ కంపెనీల్లో కొలువులు
సాక్షి, సిటీబ్యూరో: హిజ్రా కమ్యూనిటీలో జరుగుతున్న నేరాలను నియంత్రించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో వారికి పోలీసుల నుంచి చేయూతనందించే దిశగా సైబరాబాద్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ‘ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్’ను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించనున్నారు. దీనిద్వారా ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో తరచూ జరుగుతున్న ఘర్షణలు, రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంతో పాటు హిజ్రాలను ఎవరైనా వేధించిన సందర్భంలో పోలీసుల నుంచి సహాయం కోసం ఈ హెల్ప్‌డెస్క్ మార్గదర్శనం చేయనుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోనే ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్ ప్రారంభిస్తుండడం విశేషం. ఎవరెవరు ఉంటారంటే... గచ్చిబౌలి ఠాణాలోని ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్‌లో ఇద్దరు సిబ్బంది పనిచేస్తున్నారు. ఎస్సీఎస్సీ నియమించిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ (హిజ్రా)తో పాటు పోలీసు విభాగం నుంచి ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తారు. వీరు హిజ్రాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను స్వీకరించి ఏదైనా ఆపదలో ఉంటే మార్గదర్శనం చేస్తారు. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం కోసం పోలీసులను ఎలా సంప్రదించాలనే దానిపై సూచనలు చేస్తారు. ఏదైనా అత్యవసరమైతే సంబంధిత ఠాణా అధికారులను అప్రమత్తం చేసి వారి వద్దకు చేరుకొని సంరక్షించేలా చూస్తారు. అయితే చాలా మంది హిజ్రాలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ..పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియక తికమకపడతారు. ఒకవేళ వెళ్లినా ఆ ఫిర్యాదును పట్టించుకోరనే ఉన్న అపోహను తొలగించేలా ఈ హెల్ప్‌డెస్క్ పనిచేయనుంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో దాదాపు ఎనిమిదివేల మంది వరకు హిజ్రాలు ఉన్నారు. వీరిలో బాగా చదువుకున్న వాళ్లూ ఉన్నారు. విద్యావంతులైన వారు కొందరు వారికి ఆసక్తి ఉన్న రంగంలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే హిజ్రాలకున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిలో బాగా చదువుకున్నవారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎస్సీఎస్సీ చేయూతతో ‘హెల్ప్‌డెస్క్’ పనిచేయనుంది. ఇప్పటికే హిజ్రాలకు ఉద్యోగాలిచ్చేందుకు రెండు ఐటీ కంపెనీలు ముందుకువచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏఏ సమస్యలంటే... కొందరు హిజ్రాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచిస్తున్నారు. వాహనాలు ఆపి మరీ బలవంతంగా పైసలు వసూలు చేస్తున్నారు. షాపుల వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతున్నారు. వీరిలో కొందరు నకిలీ హిజ్రాలు సైతం ఉంటున్నారు. కొందరు వ్యభిచార వృత్తిలో కూడా కొనసాగుతున్నారు. ఆయా సందర్భాల్లో గొడవలు జరిగి నేరాలు పెరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. హిజ్రాల్లో కొంతమందినైనా మార్చగలిగితే నేరాలు నియంత్రణలోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చదవండి: ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ గురించి తెలుసా? -
స్వలింగ వివాహం: షాకిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: ఒకే జెండర్ వారి మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తిస్తూ.. చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో దాఖలైన పిటిషన్‌ని కేంద్రం వ్యతిరేకించింది. అతి పెద్ద శాసన చట్రం కేవలం స్త్రీ, పురుషుల మధ్య జరిగే వివాహాలను మాత్రమే గుర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలు కూడా ఇలాంటి వివాహాలనే గుర్తిస్తాయని.. వీటిలో తల దూర్చితే భారీ వినాశనం తప్పదని హెచ్చరించింది. అంతేకాక ‘‘వివాహం అనేది ఓ ప్రైవేట్ కాన్సెప్ట్ కాదని.. స్వంత ప్రజా ప్రాముఖ్యత కలిగిన సామాజికంగా గుర్తింపు పొందిన వ్యవస్థ అని కేంద్రం తెలిపింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 377 యొక్క డిక్రిమినలైజేషన్ ఉన్నప్పటికీ, పిటిషనర్లు స్వలింగ వివాహాన్ని ప్రాథమిక హక్కుగా పొందలేరు’’ అని సెంటర్ అఫిడవిట్లో పేర్కొంది. జెండర్‌తో సంబంధం లేకుండా ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాల్సిందిగా కోరుతూ.. గే, లెస్బియన్ కమ్యూనిటీకి చెందిన నలుగరు ఢిల్లీ హై కోర్టు ను ఆశ్రయించారు. జస్టిస్ రాజీవ్ సహై ఎండ్లా, అమిత్ బన్సాల్ ధర్మాసనం ఈ విజ్ఞప్తిపై కేంద్రం స్పందనని కోరింది. దీనిపై కేంద్రం బదులిస్తూ.. ‘‘భారతీయ సమాజంలో వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను కలిపే ప్రకియ కాదు.. స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని ఏర్పరిచే వ్యవస్థ. కనుక స్వలింగ సంపర్కుల మధ్య జరిగే వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకుంటే ‘‘వ్యక్తిగత చట్టాల సున్నితమైన సమతుల్యత పూర్తి నాశనానికి కారణమవుతుంది’’ అని అభిప్రాయపడింది. భర్త అంటే బయోలాజికల్‌గా పురుషుడు.. భార్య అంటే కేవలం మహిళ మాత్రమే. కనుక ఒకే లింగ వారి మధ్య జరిగే వివాహాలను సమర్థించం అని కేంద్రం తెలిపింది. చదవండి: అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్ ‘నువ్వు నిజమైన అమ్మాయివి కాదు కదా’ -
ట్రాన్స్‌జెండర్స్‌కు శుభవార్త: ప్రధాని కానుక
వారణాసి: స్త్రీ, పురుషులకు అంటూ ప్రత్యేక టాయిలెట్స్ ఉండగా ట్రాన్స్‌జెండర్స్ ఎటు వెళ్లాలో తెలియక గందరగోళ పడేవారు. దీనిపై సినిమాల్లో కూడా చాలా కామెడీ సీన్స్ పండాయి. అవి నవ్వుకునేందుకు బాగానే ఉన్నా ట్రాన్స్‌జెండర్స్‌కు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు. ఇకపై వారికి అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా టాయిలెట్‌ను నిర్మించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఈ టాయిలెట్ నిర్మించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా వారణాసిలోని కామాచ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ టాయిలెట్‌ను అధికారులు నిర్మించారు. రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ టాయిలెట్‌ను గురువారం మేయర్ మృదుల జైస్వాల్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోనే ఇది మొదటి ట్రాన్స్‌జెండర్ టాయిలెట్ అని మేయర్ తెలిపారు. వారికి అవసరమైన ఇతర ప్రాంతాల్లో కూడా టాయిలెట్స్‌ను నిర్మించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈ టాయిలెట్లు ట్రాన్స్జెండర్ల కోసం మాత్రమేనని.. ఇతరులు వినియోగించరాదని వారణాసి మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ రతి విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మూడో వర్గానికి మరో నాలుగు టాయిలెట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మరుగుదొడ్డి నిర్మాణం పట్ల ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారణాసి మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇన్నాళ్లు తాము పడ్డ ఇబ్బందులు ఇకపై తొలగిపోనున్నాయి. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా మా కోసం టాయిలెట్స్ నిర్మించాలి’ అని ట్రాన్స్‌జెండర్ రోహణి విజ్ఞప్తి చేశారు. -
అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్
జో బైడెన్ బుధవారం ప్రెసిడెంట్ సీట్లో కూర్చోవడంతోనే పదిహేడు సంతకాలు పెట్టారు. వాటిల్లో ఒక సంతకం ట్రాన్స్జెండర్లది. ‘మనషులంతా ఒక్కటే. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్. వివక్ష పాటించరాదు’ .. అని సైన్ చేసేశారు. అయితే ఇందుకు అందరూ ఓకే. ఒక్క అథ్లెట్లే.. నాట్ ఓకే. ‘‘ట్రాన్స్ ఉమన్ రన్నర్‌ని మామూలు ఉమన్ రన్నర్‌తో పోటీకి దింపితే గెలిచేది ట్రాన్స్ ఉమనే. వాళ్లు బలంగా ఉంటారు. అప్పుడది అథ్లెట్స్ మధ్య పోటీ అవదు. శారీరకంగా బలమైనవాళ్లకు, వారికన్నా బలహీనమైన వాళ్లకు మధ్య పోటీ అవుతుంది’ అని వారి వాదన. బైడన్ ఏమంటారు! తన ఆర్డర్‌ను వెనక్కు తెప్పించి, ‘అథ్లెట్స్ తక్క’ అని రీ ఆర్డర్ పాస్ చేస్తారా? బైడెన్ దగ్గరకు వాషింగ్టన్ వెళ్లేముందొకసారి ఇండియాలోని గోపాల్‌పూర్‌కి వెళదాం. ఆరేళ్లు వెనక్కి. 2014 లోకి. ఏ గోపాల్పూర్ అంటే ఒడిశా జైపూర్ జిల్లాలో ఉన్న గోపాల్పూర్. స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఊరు. ఊహు. తనక్కడ లేదు! పంజాబ్‌లో ఉందట.. ట్రైనింగ్ సెంటర్లో. గ్లాస్గోవ్ కామన్వెల్త్ గేమ్స్‌కి ప్రాక్టీస్ చేస్తోంది. అప్పటికి ఆమె వయసు 18. పెద్దయ్యాక ఆడబోతున్న తొలి పెద్ద గేమ్! ఆ ముందు నెలలోనే తైవాన్ వెళ్లి ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఆడొచ్చింది. 200 మీటర్ల పరుగు పందెంలో, 400 మీటర్ల రిలేలో గోల్డ్ మెడల్స్ కొట్టుకొచ్చింది. ‘‘వారెవ్వా అమ్మాయీ..’’ అంది ఇండియా. ఇంకా అంటూనే ఉంది, అంతలోనే ద్యుతీకి ఢిల్లీ నుంచి పిలుపు.. అర్జెంటుగా ఢిల్లీ వచ్చెయ్యమని! పిలిచింది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్. ద్యుతీ కాలు నిలవలేదు. ట్రైనింగ్‌కి బెంగళూరు పంపడానికి ఢిల్లీ రమ్మన్నారనుకుంది. పంజాబ్‌లో బస్సెక్కి, ఐదు గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరుకుంది. ‘‘డాక్టర్ని కలువమ్మా.. ’’ అని ఫెడరేషన్ డాక్టర్ దగ్గరకు పంపించారు డైరెక్టర్. ద్యుతీ డౌట్ పడలేదు. ఫిట్నెస్ పరీక్షలు అనుకుంది. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసి, మూడో రోజు బెంగళూరు పంపించారు. అయితే ప్రాక్టీస్ కోసం కాదు. మరికొన్ని పరీక్షల కోసం. ద్యుతీకి క్రోమోజోమ్ ఎనాలిసిస్ టెస్ట్ చేశారు. ఎం.ఆర్.ఐ. తీశారు. గైనకాలజికల్ ఎగ్జామ్స్ చేశారు. తర్వాత హార్మోన్ పరీక్షలు! ద్యుతీ క్లిటారిస్‌ను కదలించి చూశారు. ఆ ప్రకంపనల్ని నోట్ చేశారు. వెజీనా గోడల్ని పరీక్షించి చూశారు. ప్యూబిక్ హెయిర్ సాంద్రత గుణాన్ని పట్టి పట్టి చూశారు. బ్రెస్ట్ దగ్గరికి వచ్చారు. నొక్కి చూశారు. సైజ్ చుట్టుకొలత తీసుకున్నారు! అవన్నీ కామన్ పరీక్షలేనేమో అనుకుంది ద్యుతీ. రిపోర్ట్స్‌లో ‘అన్ కామన్’ అని వచ్చింది! ద్యుతీలో స్త్రీ పాళ్లు తక్కువగా పురుషపాళ్లు ఎక్కువగా ఉన్నాయని వచ్చింది. మగాళ్లలో ఉండే టెస్టోస్టెరోన్ హార్మోన్ ఆడవాళ్లలో లీటరు రక్తానికి 1.0–3.3 నానోమోల్స్ మధ్య మాత్రమే ఉండాలి. ద్యుతీలో 10 నానోమోల్స్‌కి మించి ఉన్నాయి. దానర్థం ఆమె మహిళ కాదు!! మహిళలతో పోటీ పడటానికి లేదు. పైకి మహిళే కనుక మగాళ్లతోనూ ఆమెను పోటీ పడనివ్వడానికి లేదు. అయ్యో.. ద్యుతీ కెరీర్ అంతమైపోయినట్లేనా? ఆమె కెరీర్ సంగతి తర్వాత, ఆమెతో పోటీ పడితే అమ్మాయిల కెరీర్ అంతమైపోయినట్లేనని అథ్లెట్స్ ఫెడరేష¯Œ ఆలోచనలో పడిపోయింది. 150 సెంటీ మీటర్ల ఎత్తు మాత్రమే.. అంటే 4 అడుగుల 9 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ద్యుతీ రన్నింగ్‌లో అంత శక్తిమంతమైన అడుగు ఎలా వేయగలుగుతోంది అనే సందేహం తీర్చుకునేందుకే ఫెడరేషన్ ఆమెకు టెస్టోస్టెరోన్ టెస్ట్‌లు చేయించింది. చేయించాక, ఆడవాళ్లతో ద్యుతీ పోటీ పడడం సబబేనా అనే తర్కంలో పడిపోయింది. తర్వాతేమైంది! భారీ అడుగు : భారతీయ స్ప్రింటర్, 100 మీటర్ల పరుగు ఈవెంట్లో ప్రస్తుతం మన నేషనల్ చాంపియన్ ద్యుతీ చంద్ ద్యుతీ చంద్కి ఇప్పుడు 24 ఏళ్లు. ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు సాధించాక గ్లాస్గోవ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడలేకపోయినా ఆమె 2016లో, 2017లో, 2018లో ఆడింది. పతకాలు సంపాదించింది. 2019లో ఇటలీ వెళ్లి సమ్మర్ యూనివర్సియాyŠ 100 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ గెలుచుకొచ్చింది. ఇవన్నీ కూడా ‘సోర్ప్›్ట కోర్టు’లో కేస్ వేసి, టెస్టోస్టెరాన్ రూల్స్ అన్యాయం అని వాదించి, కేసు నెగ్గి, ఆడి, సాధించింది. ఆ తర్వాత 2019 లో తొలిసారి తను ఎల్జీబీటీ (ట్రాన్స్‌జెండర్) సభ్యురాలినని బాహాటంగా ప్రకటించుకుంది. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌కి కూడా వెళుతోంది. అక్కడా ఆడవాళ్లతోనే తను ఆడుతుంది. అయితే ఇది అన్యాయం అనే వాళ్లు అంటూనే ఉన్నారు. ద్యుతీ తనను ట్రాన్స్ ఉమెన్ గా ప్రకటించుకున్నాక కూడా మహిళల కేటగిరీలో ఆమెకు చోటు ఇవ్వడం ఏమిటని వారి వాదన. ఈ వాదనకు బలం ఉన్నా, వాదనగా నిలబడే బలం మాత్రం లేదు. ఐ.ఎ.ఎ.ఎఫ్. (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కౌన్సిల్) 2019 అక్టోబర్ నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ట్రాన్స్‌జెండర్ నిబంధనల ప్రకారం ట్రాన్స్ ఉమన్ మహిళలు తమ రక్తంలో లీటరుకు 5 నానోమోల్స్‌కు మించి టెస్టోస్టెరోన్ లేదని (ఈవెంట్లో పాల్గొనడానికి ముందు పన్నెండు నెలల నుంచి) రుజువు చేసి సంతకం పెట్టి ఇస్తే చాలు. ఆటకు అర్హులే. మరి ఒలింపిక్స్ నాటికి ద్యుతీ చంద్ టెస్టోస్టెరోన్ 5 నానోమోల్స్‌కి మించి ఉంటే? ఆమె ఆడలేకపోవచ్చు. ఇప్పుడు బైడన్ దగ్గరికి వద్దాం. ‘మనుషులంతా ఒక్కటే. ఎవరినీ లైంగిక వివక్షతో చూడకూడదు’ అని బుధవారం ఆయన ఆర్డర్ పాస్ చేసినప్పటి నుంచి అగ్రరాజ్యంలో ట్రాన్స్‌జెండర్ ల విజయోత్సవాలు జరుగుతున్నాయి. ‘మా మంచి ప్రెసిడెంట్’ అని బైడెన్‌కు ట్రాన్స్‌జెండర్ లు పూల గుచ్ఛాలు పంపుతున్నారు. వాళ్ల సంతోషానికి, బైడెన్ సమభావనకు ఎవరూ అడ్డు పడటం లేదు కానీ, ‘‘మహిళల స్పోర్ట్ ఈవెంట్‌కి ట్రాన్స్ మహిళల్ని అనుమతించకండి. వాళ్లు బలంగా ఉంటారు. వాళ్లతో పోటీ పడితే మేము ఓడిపోతాం’’ అని క్రీడారంగంలోని అమెరికన్ మహిళలు బైడెన్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ‘కరెక్టే’ అని రిపబ్లికన్లు మద్దతు ఇస్తున్నారు. ఏ రంగంలోనైనా తొలి ట్రాన్స్ అవడం నిజంగా గొప్ప సంగతే. ఇండియానే తీసుకుందాం. తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయవాది సత్యశ్రీ షర్మిల. తొలి ట్రాన్స్‌జెండర్ జడ్జి జోయితా మండల్. తొలి ట్రాన్స్‌జెండర్ పోలీస్ ఆఫీసర్ ప్రీతికాయషిని. తొలి ట్రాన్స్‌జెండర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మానవీ బందోపాధ్యాయ్. ఎన్నికల్లో నిలబడిన తొలి ట్రాన్స్‌జెండర్ ముంతాజ్. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ట్రాన్స్‌జెండర్ షబ్మమ్ మౌసీ. తొలి ట్రాన్స్‌జెండర్ సిపాయి షబీ. తొలి ట్రాన్స్‌జెండర్ మెడికల్ అసిస్టెంట్ జియా దాస్. వీళ్లందరివీ గొప్ప అచీవ్మెంట్స్. కానీ భౌతిక శక్తి అవసరమైన క్రీడా పోటీలలో మహిళల కేటగిరీలోకి ట్రాన్స్ ఉమన్‌ని అనుమతించి, వారు గెలిచినప్పుడు ‘తొలి ట్రాన్స్ ఉమన్ రన్నర్’ అని అనడం వారి విజయానికి సంపూర్ణతను ఇచ్చినట్లవుతుందా? బహుశా బైడెన్ ఆర్డర్ నుంచి ట్రాన్స్‌జెండర్ లు తమకు తాముగానే క్రీడారంగాన్ని మినహాయించుకోడానికి త్వరలోనే ముందుకు రావచ్చు. వారి గౌరవం కోసం వాళ్లు. -
‘నువ్వు నిజమైన అమ్మాయివి కాదు కదా’
న్యూఢిల్లీ: ‘‘నువ్వు నిజమైన, పరిపూర్ణ మహిళవు కాదు కదా’’.. మోడలింగ్ షూట్‌కు వెళ్లిన ఆర్చీ సింగ్‌ను ఉద్దేశించి ఓ ఏజెంట్ నోటి నుంచి వచ్చిన మాట. ఇలాంటి ఎన్నెన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి ఆమెకు. ఎందుకంటే తొలుత ఆమె అతడుగా ఉండేవాడు. తనలోని నిజమైన ఆత్మను గుర్తించి స్త్రీగా మారాలని నిశ్చయించుకున్నాడు. పదిహేడేళ్ల వయస్సులో తన సెక్సువల్ ఐడెంటిని బయటపెట్టిన ఆర్చీ.. ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారిపోయాడు. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె.. మిస్ ట్రాన్స్ ఇండియా కిరీటం దక్కించుకుంది. ఈ క్రమంలో అనేకసార్లు ఆమెకు వినిపించిన మాట.. ‘‘నువ్వు నిజంగా అమ్మాయివి కాదు’’.. ఇందుకు ఆర్చీ సమాధానం ఒక్కటే.. ‘‘ నేనూ మహిళనే.. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికీ ఒక స్త్రీకి ఉండే గుణాలన్నీ నాలో ఉన్నాయి. నేను అమ్మాయినే అని రుజువు చేసేందుకు ప్రభుత్వం నాకిచ్చిన ఐడీ నా వద్ద ఉంది. నేను సర్జరీ చేయించుకుని పూర్తిగా స్త్రీగా మారిపోయాను’’ అని. కానీ ఇలా ఎన్నిసార్లు చెప్పినా సరే సంకుచిత మనస్తత్వం గల కొంతమంది వ్యక్తులు ఆమెను కావాలనే తమ సూటిపోటి మాటలతో గుచ్చిగుచ్చి వేధించేవారు. అయినా ఆర్చీ సింగ్ ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోలేదు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ 2021లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. కొలంబియాలో జరిగే అందాల పోటీలకు సన్నద్ధమవుతోంది.(చదవండి: షేపవుట్..? ఫొటోషూట్..) కుటుంబం అండగా నిలబడింది ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో ఆర్చీ సింగ్ జన్మించింది. ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న సమయంలో తన మానసిక పరిస్థితి గురించి తల్లిదండ్రులకు చెప్పింది. తొలుత వాళ్లు ఆందోళన చెందినప్పటికీ.. అర్థం చేసుకుని ఆర్చీకి అండగా నిలబడ్డారు. ‘‘నాలో దాగున్న నన్ను.. కేవలం నన్ను మాత్రమే నేను చూడాలనుకున్నాను. వేరే ఎవరిలాగానో నటించడం నా వల్ల కాలేదు. మోడలింగ్ చేయాలనేది నా కల. ఈ కెరీర్ ఆరంభించకముందు సోషల్ వర్క్‌లో భాగమయ్యాను. ట్రాన్స్జెండర్ల గురించి సమాజంలో ఉన్న అపోహలు, అనుమానాలు, చిన్నచూపు తొలగిపోయేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. మోడలింగ్ వల్ల ఇది మరింత విస్త్రృతమైంది. నాకొక చక్కని వేదిక దొరికనట్లయింది’’ అని ఆర్చీ సింగ్ తన గతం, వర్తమానం గురించి చెప్పుకొచ్చింది. ఇక సమాజంలో తమ పట్ల ఉన్న వివక్ష గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రతిభ, అందం లేని కారణంగా నాకెప్పుడూ అవకాశాలు రాకుండా పోలేదు. కేవలం నేను ట్రాన్స్ వుమన్ అయినందు వల్లే ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొన్నా. అయితే వాటన్నింటినీ అధిగమించి నేడు అంతర్జాతీయ వేదికపై నడిచే అవకాశాన్ని దక్కించుకున్నాను. జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతి మనిషి తనలోని మానవత్వాన్ని, తోటి ప్రాణులను ఆదుకునే గుణాన్ని మాత్రమే తన గుర్తింపుగా చేసుకోవాలి. సెక్సువాలిటీ లేదా చేసే పని ఆధారంగా ఫలానా అనే గుర్తింపు కంటే ముందు మనిషిగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి’’ అని తన ఆలోచనలు పంచుకుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ట్రాన్స్జెండర్ల పట్ల చిన్నచూపు ఎక్కువగా ఉందన్న ఆర్చీ.. ప్రకృతిసిద్ధంగా జరిగే మార్పులకు తమను నిందించాల్సిన పనిలేదని, ఈ విషయం గురించి ఎడ్యుకేట్ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ 2021 టైటిల్ విజేతగా నిలవడమే తన ముందున్న ప్రస్తుత లక్ష్యం అంటున్న 22 ఏళ్ల ఆర్చీ సింగ్.. తనలాంటి మరెంతో మందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపడతానని పేర్కొంది. -
52 ఏళ్ల తరువాత క్షమాపణ : ఆమె ఏం చేసింది?
ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ట్రాన్స్జెండర్లకు ఆమె ఒక విజయ పతాక. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి తానెంచుకున్న రంగంలో అత్యంత ప్రతిభావంతంగా ఎదిగి ట్రాన్ప్జెండర్ సమూహానికి ప్రజలకు ఉత్సాహాన్నిచ్చిన ధీర వనిత. కానీ ఇదంతా సాధించడానికి ట్రాన్స్‌జెండర్ మహిళకు అర్ధశతాబ్దానికి పైగా పోరాటం చేయాల్సి వచ్చింది. విశేష ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం తాను ట్రాన్స్‌జెండర్ విమెన్ని అని ప్రకటించినందుకు ఉద్యోగాన్ని కోల్పోయింది. 1968 లోనే లింగమార్పిడి చేసుకున్న మహిళనని తనకు తాను ధైర్యంగా వెల్లడించింది. కానీ టెక్ దిగ్గజం ఐబీఎం ఒక యువ కంప్యూటర్ మేధావిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే తదనంతర కాలంలో తన అసాధారణ ప్రతిభా పాటవాలతో ఒకపుడు తనను అవమానపరిచిన సంస్థే స్వయంగా పొరపాటును గ్రహించి క్షమాపణలు చెప్పే స్థాయికి ఎదిగింది. దీనికి తోడు ఎల్జీబీటీక్యూ హక్కులపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం పెరగడంతో ఐబీఎం ఆ వైపుగా స్పందించింది. ఆధునిక కంప్యూటర్ యుగానికి బాటలు వేసిన ఆమెకు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని మార్చిన వ్యక్తులకు ఇచ్చే అరుదైన ఐబీఎం లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. ఆమె పేరే లిన్ కాన్వే (82) గత నెలలో 1,200 మందికి పైగా ఉద్యోగులు హాజరైన ఆన్లైన్ ఈవెంట్‌కు ఆహ్వానించింది. ఈ వేడుకలో ఐబీఎం ఆమెను క్షమాపణ కోరింది. ఆమె పరిశోధన తమ విజయానికి ఎంతో తోడ్పడిందని, చేయకూడని పనిచేశామంటూ ఐబీఎం హెచ్ఆర్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డయాన్ గెర్సన్ క్షమాపణ కోరడం విశేషం. అలాగే ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఎవరీ లిన్ కాన్వే లిన్ ఆన్ కాన్వే. అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆవిష్కర్త, ట్రాన్స్‌జెండర్ పీపుల్ కోసం పనిచేస్తున్న ఉద్యమకర్త. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో అత్యంత గౌరవనీయమైన ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. అనేక అవార్డులు, రివార్డులు ఆమె సొంతం. అంతేనా ఇవాల్టి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, చిప్ ఆవిష్కరణలు దశాబ్దాల తరబడి ఆమె చేసిన కృషి ఫలితమే. 1938లో న్యూయార్క్ లోని మౌంట్ వెర్నాన్లో అబ్బాయిగా పుట్టారు లిన్ చిన్నతనం నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. గణితం అన్నా, సైన్స్ అన్నా ప్రాణం.155 పాయింట్ల ఐక్యూతో అసాధారణ తెలివితేటలతో రాణించాడు. కానీ చిన్న వయసు నుంచే డిస్ఫోరియా అన లింగపరమైన సమస్య వెంటాడింది. అయినా చదువులోప్రతిభ కనబరుస్తూ కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అప్లైడ్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1964లో ఐబీఎం రీసెర్చ్ విభాగంలో జాయిన్ అయ్యారు. ఆర్కిటెక్చర్ బృందంలో అధునాతన సూపర్ కంప్యూటర్ రూపకల్పన చేయడంతోపాటు, గొప్ప పరిశోధకురాలిగా ఎదిగారు. 1964లో పెళ్లి చేసుకున్న లిన్‌కు (మహిళగా మారకముందు) ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఆమెలోని జన్యుపరమైన లోపం కుదురుగా ఉండనీయలేదు. దీంతో 1967లో, మాన్హటన్కుచెందిన సెక్సాలజిస్ట్ డాక్టర్ హ్యారీ బెంజమిన్ ద్వారా లింగమార్పడి గురించి తెలుసుకున్నారు. అలా బెంజమిన్ సహాయంతో, ఆమె మగ నుండి ఆడకు శారీరకంగా పరివర్తనను ప్రారంభించారు. చివరకు 1969లో ఆపరేషన్ తరువాత పూర్తి మహిళగా అవతరించారు. దీనికి ఆమె కుటుంబం, సహచరుల మద్దతు లభించింది. కానీ ఐబీఎం మాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఆమె వలన ఇతర ఉద్యోగులకు కూడా ఇబ్బంది అంటూ అప్పటి సీఈవో థామస్ జేవాట్సన్ లిన్‌ను తొలగించారు. దీంతో లిన్ కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించడంతో కష్టపడాల్సి వచ్చిందని, ఎప్పటికి ఈ సమస్యల్ని అధిగమిస్తానో తెలియని స్థితిలో తీవ్ర నిరాశకు గురయ్యానని ఆమె చెప్పారు. అయినా దుఃఖాన్ని దిగమింగి తన పోరాటాన్ని కొనసాగించానన్నారు. చివరకు తన కొత్త అవతారాన్ని దాచి పెట్టి ఎంట్రీ లెవల్ కాంట్రాక్ట్ ప్రోగ్రామర్‌గా మళ్లీ ఉద్యోగంలో చేరానని ఆమె చెప్పారు. ఆ తరువాత తన ప్రతిభతో అమెరికా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీలో ఉద్యోగాన్ని సాధించారు. దాదాపు 30ఏళ్ల పాటు తాను ట్రాన్స్జెండర్ననీ ఎవరికీ చెప్పలేదు. (కొద్దిమంది సన్నిహితులు, బంధువులు, హెచ్ఆర్ సిబ్బంది, భద్రతా క్లియరెన్స్ ఏజెన్సీలు మినహా). అయితే 1999లో కంప్యూటర్ రంగంలో ఆమె ఆవిష్కరణలపై చరిత్రకారుల పరిశోధించడం ప్రారంభించినప్పుడు ఆమె తన ఉనికిని బహిరంగపర్చారు. ఐబీఎంలో ఉద్యోగం కోల్పోయిన సంఘటనతో పాటు, తన లింగ మార్పిడి ప్రస్థానాన్ని ఆన్లైన్లో బహిర్గతం చేశారు. కంప్యూటర్ సైంటిస్టుగా ప్రస్థానం, పురస్కారాలు కాంట్రాక్ట్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగంలో చేరిన లిన్ ఆ తరువాత తన కరియర్లో వెనుతిరిగి చూసింది లేదు. ఆధునిక స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, సిలికాన్ వ్యాలీలోని అనేక శక్తివంతమైన కంపెనీల అభివృధ్దితో ఆధునిక కంప్యూటర్ యుగానికి బాటలు వేశారు. ఇంటర్నెట్కు, అనేక టెక్ స్టార్టప్‌ల ఆవిర్భావానికి అపూర్వ సామర్ధ్యాన్నిచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆమెది కీలక పాత్ర. 70 ల ప్రారంభంలో ప్రసిద్ధి చెందిన జిరాక్స్ పాలో ఆల్టో రిసెర్చ్ సెంటర్లో కంప్యూటర్ చిప్ డిజైన్‌ను ఆవిష్కరించిన ఘనత ఆమె సొంతం. 1980లలో ఇ-కామర్స్, మైక్రోప్రాసెసర్ చిప్ రూపకల్పనలో ఆమె సాధించిన పురోగతి సిలికాన్ వ్యాలీ మొట్టమొదటి స్టార్టప్‌లకు శక్తినిచ్చిందని ఫోర్బ్స్ ఆమెను ప్రశంసించింది. 1983లో మెషిన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో చేసిన కృషికి మెరిటోరియస్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 2014లో టైమ్ మ్యాగజైన్ ఆమెను అమెరికన్ సంస్కృతిలో అత్యంత ప్రభావవంతమైన ఎల్జీబీటీక్యూ వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. ఈ క్రమంలో ఆమె ఎల్జీబీటీ కార్యకర్తగా, రచయితగా మారారు. తమ లాంటి వాళ్లకోసం ఉద్యమిస్తూ..ఎంతో మంది ఎల్జీబీటీక్యూ హక్కుల కార్యకర్తలకు, సెలబ్రిటీలకు స్ఫూర్తిగా నిలిచారు. -
చనిపోయేవరకు స్వలింగ సంపర్కులని తెలియదు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని సెహోర్ పట్టణంలో దంపతులిద్దరు ఎంతో అన్యోన్యతతో జీవించేవారు.వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నామని.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు, ఇతర బంధువులకు చెప్పి 2012లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు సంవత్సరాలకు ఒక పిల్లాడిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. 8 సంవత్సరాలుగా తమ వైవాహిక జీవితాన్ని ఆనందంతో గడిపేస్తున్నారు. తాజాగా గతనెల ఆగస్టు 11న భార్య భర్తలిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దదై చివరికి అతని భార్య తన శరీరానికి నిప్పు అంటించుకుంది. భార్యను కాపాడే ప్రయత్నంలో అతనికి కూడా మంటలంటుకున్నాయి. ఇంటిపక్కన ఉన్న వారు విషయం తెలుసుకొని వారిద్దరిని భోపాల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాదాపు 90శాతం కాలిపోయిన వ్యక్తి భార్య ఆగస్టు 12న చనిపోగా.. సదరు వ్యక్తి పరిస్థితి విషమించి ఆగస్టు 16న కన్నుమూశాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పోస్టుమార్టం సమయంలో భార్య నుంచి తీసిన అటాప్సీ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. డాక్టర్లు వారు ఇచ్చిన ప్రాథమిక అటాప్సీ రిపోర్టులో చనిపోయిన ఇద్దరు మగవారేనంటూ అనుమానాస్పద పద్దతిలో పేర్కొన్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులుకు తెలిపారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. చనిపోయిన ఇద్దరు మగవారేనన్న విషయం పోలీసులు కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావించగా మాకు తెలియదని సమాధానమిచ్చారు. దీంతో పూర్తి అటాప్సీ వివరాలు వస్తేనే అసలు విషయం బయటపడుతుందని పోలీసులు భావించారు. చనిపోయిన భార్య అటాప్సీ పూర్తి రిపోర్ట్‌ను పరిశీలించగా.. చనిపోయింది అమ్మాయి కాదని.. అబ్బాయేనని డాక్టర్లు నిర్థారించారు. ఇదే విషయమై పోలీసులు మరోసారి కుటుంబసభ్యులను ఆరా తీశారు. చనిపోయిన భర్త తరపు సొంత అన్నయ్య స్పందించాడు. 'నా తమ్ముడు ఎల్జబీటీ ఉద్యమానికి మద్దతుగా పోరాటం చేసేవాడు. అక్కడే అతనికి ఒక గే పరిచయం అయ్యాడని.. మేమిద్దరం కలిసి బతకాలని నిర్ణయించుకున్నట్లు మాతో తెలిపాడు. కానీ మా కుటంబానికి అది ఇష్టం లేకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తర్వాత మాకు తెలియకుండా పెళ్లి చేసుకొని దూరంగా ఉంటున్నట్లు' తెలిపాడు. 8 ఏళ్లుగా సెహూర్ నివసిస్తున్న వారిద్దరు నిజమైన భార్య భర్తల్లాగా ఉండేవారని.. చనిపోయేంతవరకు కూడా స్వలింగ సంపర్కులు అన్న అనుమానం కూడా కలగలేదని అక్కడి స్థానికులు పేర్కొన్నారు. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 సెప్టెంబర్ 6న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కింద గే సెక్స్‌లో పాల్గొనే వారికి శిక్ష విధించడం సరికాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ డీవై చంద్రచుద్, రోహింటన్ ఫాలి నారీమన్, ఏఎం ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రాలతో కూడిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గే సెక్స్‌ను నేరంగా పరిగణించడం సహేతుకం కాదని జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్ (ఎల్జీబీటీ)లకు కూడా ఇతర పౌరుల్లాగే సమాన హక్కులు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. -
సంతోషంగా ఉంది: ట్రాన్స్జెండర్లు
లక్నో: దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ రూపుదిద్దుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. అఖిల భారతీయ కిన్నర్ శిక్షా సేవా ట్రస్టు(ఏఐటీఈఎస్‌టీ) ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో శిశు తరగతి నుంచి పీహెచ్డీ వరకు అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ విషయం గురించి ఏఐటీఈఎస్‌టీ అధ్యక్షుడు డాక్టర్ క్రిష్ణమోహన్ మిశ్రా మాట్లాడుతూ... ‘ ట్రాన్స్‌జెండర్ వర్గం కోసం దేశంలోనే తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. జనవరి 15 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి. మా కమ్యూనిటీ నుంచి తొలుత ఇద్దరు పిల్లలకు ఇక్కడ ప్రవేశం కల్పిస్తాం. ఫిబ్రవరి, మార్చి నుంచి అన్ని తరగతులు ప్రారంభమవుతాయి’ అని పేర్కొన్నారు. ఇక ఈ యూనివర్సిటీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గంగా సింగ్ కుశ్వాహ... విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుని.. ట్రాన్స్జెండర్లు దేశానికి దిశా నిర్దేశం స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదే విధంగా గుడ్డీ కిన్నర్ అనే ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ... ‘చాలా సంతోషంగా ఉంది. చదువుకుంటే మాకు ఈ సమాజంలో గౌరవం దక్కుతుంది. అందరిలాగే మేము కూడా తలెత్తుకుని బతకగలుగుతాం’ అని హర్షం వ్యక్తం చేశారు. -
అతను కాస్తా.. ఆవిడగా మారడమే...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రైల్వే ఉన్నతాధికారులకు వింత అనుభవం ఎదురైంది. నివాసం మారినప్పుడు, మరేదైనా కారణాలతో కార్యాలయ రికార్డుల్లో మార్పులు చేయాలని మాత్రమే తెలిసిన వాళ్లకు.. తాజాగా జెండర్ మార్చాలని విజ్ఞప్తి వచ్చింది. అతను కాస్తా.. ఆవిడగా మారడమే దీనికి కారణం. వివరాలు.. రాజేష్ పాండే (35) తండ్రి రైల్వే ఉద్యోగి. తండ్రి 2003లో చనిపోవడంతో కారుణ్య నియామకం కింద రాజేష్ రైల్వేలో ఉద్యోగం పొందాడు. రైల్వే వర్క్ షాప్‌లో గ్రేడ్-1 టెక్నీషియన్‌గా చేరాడు. నలుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడైన రాజేష్‌కు చిన్నప్పటి నుంచి స్త్రీగా ఉండటమే ఇష్టం. దాంతో 2017లో రాజేష్ లింగమార్పిడి చేయించుకుని, సోనియా పాండేగా పేరు మార్చుకోవడం జరిగింది. అందరూ సోనియా అని పిలుస్తున్నా.. ఆఫీస్ రికార్డుల్లో మాత్రం ఇంకా రాజేష్ పాండే అనే ఉంది. దీంతో రికార్డుల్లో జెండర్ పేరు మార్చాలని గోరఖ్‌పూర్‌లోని ఈశాన్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌ను రాజేష్ అలియాస్ సోనియా కలిసింది. ఆ దరఖాస్తును హుండ్లీలోని రైల్వే బ్రాంచ్‌కు పంపించారు. రికార్డుల్లో పేరు, లింగం మార్చాలని కోరతూ దరఖాస్తు రావడం ఇదే మొదటిసారి అని వారు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. లింగ మార్పిడి చేసుకోవడానికి ముందే రాజేష్‌కు స్థానికంగా ఉండే ఓ యువతితో పెళ్లైంది. కానీ, అసలు విషయం బయటపడటంతో విడాకులు తప్పలేదు. భార్యకు తన శరీర స్వభావం గురించి చెప్పి విడాకులు తీసుకున్నానని, లింగ మార్పిడి అనంతరం అమ్మాయిగా జీవించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది సోనియా పాండే. -
వాలెంటైన్స్ డే : ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లాడిన యువకుడు
ఇండోర్ : ‘నీ పైన నా ప్రేమకు అంతేలేదు.. నిన్ను నా కలల రాణిగా చూసుకుంటా’ అని ప్రేమికుల రోజే ఓ యువకుడు కన్నవారిని, అయిన వారిని ఎదురించి మరి ఓ ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన జునైద్ ఖాన్, ట్రాన్స్జెండరైన జయా సింగ్‌ను ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. రెండు వారాల క్రితం జునైద్ ఖాన్ జయాసింగ్‌కు ప్రపోజ్ చేయగా.. ఆమె ఒప్పుకుంది. దీంతో ఈ ఇద్దరు ప్రేమికుల రోజే మంచి ముహుర్తంగా భావించి.. హిందూ సంప్రదాయం ప్రకారం ఓ దేవాలయంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ‘నా కుటుంబం మా పెళ్లిని ఒప్పుకోవాలనుంది. ఒకవేళ వారు ఒప్పుకోకపోయినా.. నేను జయాతోనే ఉంటాను. ఆమెను నేను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను ఎప్పుడు సంతోషంగా ఉంచుతాను’ అని జునైద్ ఖాన్ మీడియాకు తెలిపాడు. ‘ట్రాన్స్‌జెండర్స్‌కు పెళ్లవ్వడం ఓ సవాల్‌తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ సమాజం వారి పెళ్లిలను అంగీకరించదు. అతని తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోనప్పటికి జునైద్ నన్నే పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటికైనా వారు మా పెళ్లిని అంగీకరిస్తాని ఆశిస్తున్నాను. ఏదో ఒకరోజు మా అత్త, మామలకు సేవ చేసే భాగ్యం నాకు కలుగుతుంది.’ అని జయాసింగ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ జోడికి మద్దతు లభిస్తోంది. -
సభాముఖంగానూ గళమెత్తిన చంద్రముఖి..!
ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న చంద్రముఖి.. సభాముఖంగానూ తన గళం వినిపించేందుకు బీఎల్ఎఫ్ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేస్తున్నారు. చంద్రముఖి మువ్వల! ట్రాన్స్‌జెండర్ మాత్రమే కాదు. ప్రావీణ్యం గల భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత. సినీనటి. అంతేకాదు, ఒక దశాబ్దకాలంగా ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త. చంద్రముఖి ఇప్పుడు మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. చక్కటి రూపం, శ్రావ్యమైన గొంతుక ఉన్న చంద్రముఖి ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో తమ స్వరాన్ని వినిపించేందుకు, ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగా ముందుకొస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్) అభ్యర్ధిగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగుతున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ బహుశా చంద్రముఖే కావచ్చు. సామాజిక జీవనంలో ట్రాన్స్జెండర్లు కూడా భాగస్వాములేనని, వారిపై కొనసాగుతున్న అన్ని రకాల హింస, వివక్ష తొలగిపోవాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అమలును ఆకాంక్షిస్తూ, వారి స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం, సమానత్వం కోసం ఒక నినాదమై చంద్రముఖి ముందుకొస్తున్నారు. అస్తిత్వానికి ప్రతీక ‘‘వందల ఏళ్లుగా హింసకు, అణచివేతకు గురవుతూనే ఉన్నాం. మహిళలపై కొనసాగుతున్న అన్ని రకాల అణచివేతలు ట్రాన్స్‌జెండర్లపైన కూడా ఉన్నాయి. సామాజికంగా తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నాం. కుటుంబాల బహిష్కరణకు గురవుతున్నాం. అడుగడుగునా అవహేళన. చూపులతో, సూటిపోటి మాటలతో, రకరకాల హావభావాలతో చేసే వెకిలి చేష్టలు. అన్ని రకాల వేధింపులను భరిస్తున్నాం. దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాలు, ఆందోళనల ఫలితంగా సుప్రీం కోర్టు ట్రాన్స్జెండర్ల హక్కులను గుర్తించింది. సమాజంలో భాగమేనని చెప్పింది. ఏ వివక్షా లేని స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని అనుభవించే హక్కుకు భరోసాను ఇచ్చింది. కానీ ఆచరణలో ఆ ఆదేశాలు అమలుకు నోచడం లేదు. ప్రభుత్వాలు తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతున్నాయి. లక్ష మందికి పైగా ఉన్న తెలంగాణలో గత నాలుగున్నరేళ్లుగా మా సమస్యలపై గళమెత్తుతూనే ఉన్నాం. ఆందోళన చేస్తూనే ఉన్నాం. ఒక్క ట్రాన్స్జెండర్ల సమస్యలపైనే కాదు. సామాజిక జీవితంలో భాగంగా, బాధ్యత కలిగిన వ్యక్తులుగా అనేక రకాల సమస్యలపైనా మా కమ్యూనిటీ ఎప్పటికప్పుడు పోరాటాలు చేపడుతూనే ఉంది. ఎలాంటి అభివృద్ధికి, సంక్షేమానికి నోచని అణగారిన వర్గాలతో కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చట్టసభల్లో ప్రతిబింబించేందుకు, మా సమస్యలను మరింత బలంగా వినిపించేందుకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాం’’ అంటున్నారు చంద్రముఖి. ‘‘వందల ఏళ్లుగా హిజ్రాలు ఈ సామాజిక జీవనంలో భాగంగానే ఉన్నారు. ఒకప్పుడు గౌరవప్రదంగా బతికినప్పటికీ ఇప్పుడు యాచకులుగా ఎంతో దయనీయమైన జీవితాలను గడుపుతున్నారు. ఇప్పటికైనా మా బతుకులు మారొద్దా...’’ అని ప్రశ్నిస్తున్న చంద్రముఖి డిగ్రీ పూర్తి చేశారు. ‘అలయన్స్ ఇండియా పహెచాన్’ అనే సంస్థలో కొంతకాలం పాటు ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేశారు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. ఒక టీవీ చానల్లో వ్యాఖ్యాతగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు భరతనాట్యంలో శిక్షణనిస్తున్నారు. హక్కులకు భరోసా కావాలి ‘‘మేమెందుకు యాచకులుగా బతకాలి. అందరిలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాల వృత్తులు చేసుకొనే అవకాశాలు మాకెందుకు లభించకూడదు’’ అంటున్న చంద్రముఖి సమాజంలో తమ జనాభాకు అనుగుణమైన అవకాశాలు లభించాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండాలని కోరుతున్నారు. ట్రాన్స్జెండర్ల గౌరవప్రదమైన జీవితం కోసం 2011లోనే ‘ తెలంగాణ హిజ్రా, ఇంటర్‌సెక్స్ ట్రాన్స్జెండర్సమితి’ని ఏర్పాటు చేశారు. ఒకవైపు తనకు నచ్చిన కెరీర్లో కొనసాగుతూనే మరోవైపు ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం జరుగుతున్న అన్ని పోరాటాల్లో భాగస్వామిగా నిలిచారు. ‘‘ట్రాన్స్జెండర్లుగా స్కూళ్లు, కాలేజీల్లో చదువుకోలేకపోతున్నాం. అనేక రకాల అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. తమ కొడుకు ట్రాన్స్‌జెండర్ అని తెలియగానే ఆ కుటుంబాలు ఇళ్ల నుంచి బహిష్కరిస్తున్నాయి. అలా వీధిన పడ్డవాళ్లకు ఎక్కడా రవ్వంత ఆదరణ లభించదు. ఇటు కుటుంబం, అటు సమాజం బహిష్కరిస్తే మేము ఎక్కడికి వెళ్లాలి. అలా పుట్టడం మా తప్పా’’ అని అడుగుతున్న చంద్రముఖి ఆవేదన మాత్రమే కాదిది. వేలాది మంది ట్రాన్స్జెండర్ల హృదయ వేదన. తమ పోరాటం కేవలం తమకే పరిమితం కాకూడదని, అన్ని రాజకీయ పార్టీలు ట్రాన్స్జెండర్ల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని చంద్రముఖి కోరుతున్నారు. గెలుపుపై ధీమా బీఎల్ఎఫ్ అభ్యర్ధిగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్న చంద్రముఖి నవంబర్ 19న (నేడు) నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బీఎల్ఎఫ్ కూటమి పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా, హక్కుల సంఘాల మద్దతుతో పోటీకి దిగుతున్న తనను ప్రజలు ఆదరించాలని కోరుతున్నారు. తనను గెలిపిస్తే కేవలం ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగానే కాకుండా గోషామహల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెబుతున్నారు. ‘‘అన్ని వర్గాల ప్రజల మద్దతు, ఆదరణ తమకు ఉందని, తప్పనిసరిగా గెలిచి తీరుతానని కూడా చంద్రముఖి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుర్తించండి చాలు ♦ అన్ని రాజకీయ పార్టీలు ట్రాన్స్జెండర్ల సమస్యలను తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో గుర్తించాలి. ♦ ‘సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ అనే ఒక కమ్యూనిటీ ఉంది’ అని గుర్తిస్తే చాలు. అందరిలాగే వాళ్లు కూడా మనుషులేనని గౌరవిస్తే చాలు. ♦ అన్ని రకాల హింసల నుంచి, వివక్ష, అణచివేతల నుంచి విముక్తి లభించాలి. ♦ ట్రాన్స్‌జెండర్లందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ♦ విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ♦ అన్ని ఆసుపత్రుల్లో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలి. ♦ వయోధికులైన వారికి పెన్షన్ సదుపాయం అమలు చేయాలి. ♦ అన్నింటికీ మించి ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు సామాజిక భద్రత కల్పించాలి. – పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ -
విద్యార్థి ఎన్నికల్లో ఓ అమ్మ.. ఓ స్వలింగ సంపర్కుడు.. ఓ కజకిస్థానీ!
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) లో ఎన్నికలంటేనే దేశవ్యాప్తంగా ఓ ఆసక్తి కలగడం సహజం. అయితే ఈసారి జేఎన్ యూ లో ఎన్నికలు మరో విధంగా ఆకర్షిస్తున్నాయి. ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో పలు పార్టీలు విజయం సాధించడానికి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపారు. అయితే జేఎన్ యూ ఎన్నికల్లో గే (స్వలింగ సంపర్కుడు), ఓ తల్లి, కజకిస్థాన్ కు చెందిన అభ్యర్థులు నేను సైతం అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓ పాపకు తల్లైన గుంజన్ ప్రియ జేఎన్ యూ లో ఎంఫిల్ స్టూడెంట్. గుంజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) పార్టీ తరపున కౌన్సిలర్ గా ప్రచారం చేస్తోంది. అయితే గుంజన్ కూతురు కూడా జేఎన్ యూ క్యాంపస్ లో తన తల్లికి ఓటు చేయాలని ప్రచారం చేయడం అందర్ని ఆకట్టుకుంటోంది. 'తాను వివాహితురాలిని. లింగ సమానత్వం కోసం పోరాడుతాను. వివాహిత మహిళలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి' అనే డిమాండ్ తో గుంజన్ ముందుకెళ్తోంది. ఇక ఎస్ఎఫ్ఐ బ్యానర్ లో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీటీ) కమ్యూనిటీ తరపున గౌరవ్ ఘోష్ రంగంలో నిలువడం ప్రత్యేకతగా నిలిచింది. ఎల్ జీ బీటి కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులకు జేఎన్ యూ లో సమాన హోదా కల్పించాలి. మా కమ్యూనిటీలోని సభ్యులపై వివక్ష కు అంతం పలికి, సమానత్వం కల్పించాలని గౌరవ్ డిమాండ్ చేస్తున్నాడు. ఇక జేఎన్ యూ ఎన్నికల్లో విదేశీ విద్యార్థి కూడా అధ్యక్ష పదవికి పోటి పడుతూ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నాడు. కజకిస్థాన్ కు చెందిన అక్మెత్ బెకోవ్ ఝాస్సులాన్ ఓ అనువాదకుడి సహాయంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మాజీ సైనికుడైన ఝాస్సులాన్ కు యుద్దంలో పాల్గొన్నందుకు పలు పతకాలు కూడా దక్కించుకున్నట్టు సమాచారం.ఝాస్సులాన్ ప్రస్తుతం జేఎన్ యూలో ఎకనామిక్స్ లో స్నాతకోత్సవ విద్యను అభ్యసిస్తున్నాడు. ఝాస్సులాన్ జనతాదళ్ యునైటెడ్ (జేడీ-యూ) తరపున బరిలో ఉన్నారు. జేఎన్ యూలో విదేశీ విద్యార్థులకు ఇబ్బందులున్నాయని.. భాష ప్రధానంగా అనేక సమస్యలను సృష్టిస్తోందని.. ఇలాంటి పరిస్థితులను అధిగమించేలా తాను చర్యలు తీసుకుంటానని తన ఎజెండాగా ప్రచారంలో ముందుకు పోతున్నాడు. అనేక విశేషాలతో కొనసాగుతున్న ప్రచారం సెప్టెంబర్ 13 తేదిన జరిగే ఎన్నికలతో ముగియనుంది.