Emily Ratajkowski Model Accuses Robin Thicke Groping Her Breasts While Shotting Blurred Lines - Sakshi
Sakshi News home page

Emily Ratajkowski: వెకిలిగా నవ్వాడు.. ఆ స్పర్శతో తొలిసారి నగ్నంగా ఫీలయ్యా: నటి

Published Sun, Oct 3 2021 9:20 PM | Last Updated on Mon, Oct 4 2021 9:05 AM

Emily Ratajkowski Accuses Robin Thicke Of Groping Her Breasts On Blurred Lines set - Sakshi

Emily Ratajkowski Alleges Robin Thicke:  ఓ మ్యూజిక్‌ వీడియో షూటింగ్‌ చేస్తున్నప్ప​డు సింగర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రముఖ అమెరికన్‌ మోడల్‌ ఎమిలీ రటాజ్‌కోవ్స్‌కీ ఆరోపించింది. 2013లో ‘బ్లర్డ్ లైన్స్’అనే మ్యూజిక్‌ వీడియో షూట్‌ సమయంలో సమయంలో అమెరికన్‌ సింగర్‌ రాబిన్ తికే తాగి సెట్స్‌పైకి వచ్చాడు. 'అంతేకాకుండా నా చాతిని (వక్షోజాలను) టచ్‌ చేశాడు.


ఓ వ్యక్తి స్పర్శను నేను వెంటనే పట్టిగట్టాను. ఎవరా అని వెనక్కి తిరిగి చేస్తూ..రాబిన్‌ వెకిలిగా నవ్వుతూ కనిపించాడు. వెంటనే నేను అక్కడి నుంచి పరిగెత్తాను. అప్పుడు మొదటిసారి నేను నగ్నంగా ఉన్నట్లు అనిపించింది' అంటూ పేర్కొంది.


ఈ మ్యూజిక్‌ వీడియోలో ఎమిలీతో పాటు మరో ఇద్దరు మోడల్స్‌ సైతం నగ్నంగా కనిపించారు. షూటింగ్‌ వరకు నగ్నంగా ఉన్నా తానెప్పుడూ అలా ఫీల్‌ అవ్వలేదని, రాబిన్‌ చర్యలతో సిగ్గుతో సెట్‌ వెనకాల దాక్కున్నట్లు ఎమిలీ ఆరోపించింది. కాగా ఇటీవలె ఈమె రాసిన  ‘మై బాడీ‘అనే పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాబిన్‌పై ఎమిలీ చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్‌ రాబిన్‌ ఇంత వరకు స్పందించలేదు. 

చదవండి: నా కొడుకు అమ్మాయిలతో తిరగొచ్చు..డ్రగ్స్‌ తీసుకోవచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement