Model Ariana Viera, 26, Passes Away Weeks After Car Crash - Sakshi
Sakshi News home page

Ariana Viera: కారు నడుపుతుండగా కునుకు.. చిన్నవయసులోనే బ్యూటీ క్వీన్‌ కన్నుమూత

Published Fri, Aug 4 2023 10:52 AM | Last Updated on Fri, Aug 4 2023 11:37 AM

Model Ariana Viera Passed Away at 26 - Sakshi

బ్యూటీ క్వీన్‌, వెనిజులా మోడల్‌ అరియానా వీర రోడ్డుప్రమాదంలో మరణించింది. జూలై 13న ఫ్లోరిడాలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచింది. కారు నడిపే క్రమంలో అలసటకు లోనైన అరియానా డ్రైవింగ్‌లో రెప్పవాల్చడంతోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని అరియానా తల్లి వివియన్‌ ఓచోవా మీడియాకు వెల్లడించింది. తను ఎంతోమందికి సాయం చేసిందని, అలాంటి నా కూతుర్ని భగవంతుడు త్వరగా తీసుకెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది.

కాగా ఈ బ్యూటీ మే నెలలో అంత్యక్రియల వీడియో పోస్ట్‌ చేసింది. 'నా వీడియోలను నేనే తీసుకుంటాను. నేను చనిపోయాక నా అంత్యక్రియలను ఎవరైనా రికార్డు చేస్తారో లేదో? అందుకే ఎప్పుడో జరగాల్సిన నా అంత్యక్రియలను ఓసారి నేనే రికార్డు చేసి పెట్టుకుంటున్నాను' అంటూ సదరు వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 

కాగా అరియానా మోడల్‌ మాత్రమే కాదు, రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. తను ఫుల్‌ హౌస్‌ క్లీనింగ్‌ సర్వీస్‌ అనే కంపెనీ కూడా నిర్వహిస్తోంది. ఇకపోతే అక్టోబర్‌లో జరగబోయే 'మిస్‌ లాటిన్‌ అమెరికా ఆఫ్‌ ద వరల్డ్‌ 2023' పోటీల్లో అరియానా.. వెనిజులా తరుపున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే ఈ దారుణం జరగడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement