
తిరువొత్తియూరు: ఓ మతానికి సంబంధించి వ్యతిరేకంగా అభిప్రాయాలను ఫేస్‌బుక్‌లో వెల్లడించిన బీజేపీ ప్రముఖుని పోలీసులు చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం అరెస్టు చేశారు. చెన్నై నంగనల్లూరుకు చెందిన కల్యాణరామన్ బీజేపీ ప్రముఖుడు. ఈయన కాక్కచై సిద్ధర్ కళ్యాణ రామన్ పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది. ఇందులో ఓ మతానికి వ్యతి రేకంగా సందేశాలు ఇచ్చినట్లు పలువురు కల్యాణరామన్‌పై చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు కమిషనర్ ఆదేశాల మేరకు ఆయనపై చెన్నై సెంట్రల్ క్రైం పోలీసులు 153ఎ, 295, 505 విభాగంలో కేసు నమోదు చేశారు. శనివారం అహ్మదాబాద్ నుంచి విమానంలో చెన్నైకి వచ్చిన కల్యాణరామన్‌ను ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లి అతని వద్ద విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment