ఆ సీటు బంగారం గానూ.. | 3 kgs gold seized from AI flight | Sakshi
Sakshi News home page

ఆ సీటు బంగారం గానూ..

Published Wed, Jul 8 2015 5:39 PM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM

ఆ సీటు బంగారం గానూ.. - Sakshi

ఆ సీటు బంగారం గానూ..

చెన్నై: సీటు బంగారం అంటే బంగారంతో చేసిన సీటు కాదు. సీటు కింద బంగారం దాచుకుని ప్రయాణించడం. అది కూడా ఒకటీ, అరా కాదు.. ఏకంగా మూడు కిలోల బంగారం!! చెన్నై ఎయిర్పోర్టులో కలకలం రేపిన ఈ సీటు కింద బంగారం కథేంటో చూద్దాం..

ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం కౌలాలంపూర్ నుంచి బుధవారం మధ్యాహ్నం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులందరూ దిగి వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఆ విమానం ముంబైకి ఓ ట్రిప్పు వెళ్లాల్సి ఉంది. దీంతో క్లీనింగ్ స్టాఫ్ హడావిడిగా వాక్యూమ్ క్లీనర్లు, మాప్లతో విమానాన్ని శుభ్రం చేసేందుకు లోనికి వెళ్లారు. ఆ క్రమంలో ఓ సీటు కింద ఒక పెట్టెను చూశారు. వెంటనే అధికారులకు కబురందించారు. బాక్సును స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఏ బుట్టలో ఏ పాము ఉంటుందోనని జాగ్రత్తగా తెరిచి చూస్తే.. దాని నిండా బంగారమే! ఒకటికాదు రెండు కాదు దాదాపు కోటి రూపాయల విలువచేసే మూడు కేజీల బంగారం.

అప్రమత్తమైన అధికారులు ఆ బంగారం ఉన్న సీటులో ప్రయాణించిన వ్యక్తి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఎలాగోలా అతడ్ని పట్టుకోగలిగారు. ప్రస్తుతం అతణ్ని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదేకాకుండా చెన్నై ఎయిర్ పోర్టులో ఈ రోజు అక్రమంగా తరలిస్తున్న 35 నక్షత్ర తాబేళ్లను కూడా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సింగపూర్ కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement