సాక్షి, చెన్నై: లో దుస్తుల్లో దాచుకుని అక్రమంగా తరలించటానికి ప్రయత్నించిన ఓ యువకుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి రూ.5 లక్షల అమెరికా డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో మంగళవారం చోటు చేసుకుంది. చెన్నై నుంచి నేటి వేకువజామున 3.30 గంటల సమయానికి కొలంబో వెళ్లే శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఆ విమాన ప్రయాణీకుల లగేజీని అధికారులు పరిశీలన చేసి పంపుతున్నారు.
ఆ సమయంలో చెన్నైకి చెందిన షంషుద్ధీన్ (32) టూరిస్ట్ వీసా మీద శ్రీలంకకు వెళ్లటానికి వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం రావడంతో అధికారులు షంషుద్దీన్ లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా అనుమానం నివృత్తి కాని అధికారులు షంషుద్ధీన్ ను గదిలోకి తీసుకుని వెళ్లి తనిఖీలు చేయగా అతడి లోదుస్తుల్లో కట్టలు కట్టలుగా ఐదు లక్షల అమెరికా డాలర్లు కనిపించాయి. అది లెక్కచూపని నగదు అని తేలటంతో అతడి ప్రయాణాన్ని రద్దు చేశారు. నిందితుడు షంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment