
సాక్షి, చెన్నై: సింగపూర్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ వృద్ధురాలు విమానంలోనే కన్నుమూసింది. సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానం శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు చెన్నై చేరుకుంది. అందులో నాగపట్టణం జిల్లా మైలాడుదురై సమీపాన గల తిరుమంగళంకు చెందిన రహ్మత్‌గని (70) ఉంది. ప్రయాణీకులందరూ దిగి వెళ్ళినప్పటికీ రహ్మత్‌గని దిగలేదు. వెంట ఉన్న బంధువులు ఆమెను లేపేందుకు ప్రయత్నించగా సీటులోనే వాలిపోయింది. దీంతో వెంటనే ఎయిర్‌హోస్టెస్ ద్వారా చీఫ్ పైలట్‌కు విషయాన్ని తెలిపారు. అక్కడి నుంచి సమాచారం అందుకున్న విమానాశ్రయ అధికారులు, వైద్య బృందం వచ్చి రహ్మత్‌గనిని పరీక్షించగా ప్రయాణికురాలు గుండెపోటుతో మృతి చెందిందని తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి పంపారు. కుటుంబీకులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment