రూ.1.34 కోట్ల కొత్త నోట్లు పట్టివేత | huge cash surrendered in chennai airport | Sakshi
Sakshi News home page

రూ.1.34 కోట్ల కొత్త నోట్లు పట్టివేత

Published Fri, Dec 23 2016 3:10 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

huge cash surrendered in chennai airport

సాక్షి, చెన్నై: కరెన్సీ నోట్ల మార్పిడికి ప్రయత్నించిన ఓ ముఠాను గురువారం చెన్నైలో రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వర్గాలు పట్టుకున్నాయి. వారి నుంచి రూ.1.34 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు  సమాచారంతో గురువారం ఇంటెలిజెన్స్‌ వర్గాలు  చెన్నై మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్‌ కి సమీపంలోని పోలీసుల సహకారంతో వాహనాల తనిఖీ  చేపట్టాయి. ఆ సమయంలో ఓ కారు ఆగకుండా ముందుకు దూసుకెళ్లింది. దీంతో ఆ కారును వెంబడించి ∙పల్లావరం వద్ద కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారులో రూ.1.34 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు బయట పడ్డాయి. పట్టుబడ్డ వారిలో చెన్నైకు చెందిన రిజ్వాన్, ముక్దర్, సమీఅహ్మద్‌తో పాటు మరో ఇద్దరున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement