huge cash surrendered
-
రూ.1.34 కోట్ల కొత్త నోట్లు పట్టివేత
సాక్షి, చెన్నై: కరెన్సీ నోట్ల మార్పిడికి ప్రయత్నించిన ఓ ముఠాను గురువారం చెన్నైలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు పట్టుకున్నాయి. వారి నుంచి రూ.1.34 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో గురువారం ఇంటెలిజెన్స్ వర్గాలు చెన్నై మీనంబాక్కం ఎయిర్పోర్ట్ కి సమీపంలోని పోలీసుల సహకారంతో వాహనాల తనిఖీ చేపట్టాయి. ఆ సమయంలో ఓ కారు ఆగకుండా ముందుకు దూసుకెళ్లింది. దీంతో ఆ కారును వెంబడించి ∙పల్లావరం వద్ద కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారులో రూ.1.34 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు బయట పడ్డాయి. పట్టుబడ్డ వారిలో చెన్నైకు చెందిన రిజ్వాన్, ముక్దర్, సమీఅహ్మద్‌తో పాటు మరో ఇద్దరున్నారు. -
మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా కొత్త కరెన్సీ పట్టివేత
రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లాలో భారీగా కొత్త కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పరిధిలో మంగళవారం రూ.37 లక్షల కొత్త కరెన్సీని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీ మార్పిడికి ఈ నగదును తీసుకువచ్చి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కర్నూలులో భారీగా కొత్త కరెన్సీ స్వాధీనం
-
నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
- రూ.12 లక్షల 2వేల నోట్లు పట్టివేత - ఇన్నోవా వాహనం, కౌంటింగ్ మిషన్ స్వాధీనం - నిందితుల్లో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే సమీప బంధువు ఆత్మకూరురూరల్: నోట్ల మార్పిడి ముఠాను కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన రూ. 2వేల నోట్లను పట్టుకున్నారు. ఇన్నోవా వాహనం..కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందుల్లో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే సమీప బంధువు. ఆ వివరాలను డీఎస్పీ సుప్రజ విలేకరులకు వివరించారు. ఏపీ 21బీబీ4949 అనే నంబరు గల ఇన్నోవా వాహనంలో నోట్ల మార్పిడి ముఠా ఒకటి తిరుగుతోందని.. ఈనెల 9వతేదీన సమాచారం వచ్చిందన్నారు. ఓంకారం సమీపంలో ఇన్నోవాను స్వాధీనం చేసుకొని తనిఖీలు చేయగా.. అందులో రూ.12 లక్షల కొత్త రెండువేల నోట్లు, అంతేగాక నోట్లను లెక్కించే యంత్రం దొరికాయన్నారు. బనగానపల్లెకు చెందిన కోడూరు రవితేజారెడ్డి, సంజీవగౌడులు అదుపులోకి తీసుకొని విచారించగా.. భాస్కర్, సుధాకర్ అనే వ్యక్తులు పారి పోయినట్లు చెప్పారని వివరించారు. నిందితుల వద్ద దొరికిన డబ్బుకు సరైన ఆ«ధారాలు చూపనందున..దానిని ఐటీ అధికారులకు అప్పగించనున్నామన్నారు. ముఠా అరెస్టులో చాకచక్యంగా వ్యవహరించిన ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు లోకేష్‌కుమార్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, విష్ణు నారాయణలను డీఎస్పీ అభినందించారు. టీడీపీ ఎమ్మెల్యే సమీప బంధువు.. నిందితుల్లో ఒకరైన రవితేజా రెడ్డి బనగానపల్లెకు చెందిన ప్రముఖ నెహ్రూ విద్యాసంస్థల డైరెక్టరు. ఇతను ఒక టీడీపీ శాసనసభ్యునికి సమీప బ««ంధువు కావడం చర్చనీయాంశమైంది. ఆ శాసనసభ్యుడు నోట్ల మార్పిడి కేసు తీవ్రత తగ్గించేందుకు పలుమార్లు అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు నోట్లమార్పిడి నిందితులను మంచివారిగాను, పూర్వ నేర చరిత్ర లేని వారిగానూ, వారి తల్లిదండ్రుల గుణగణాలను పదపదేవల్లె వేశారు. ఏదో 10 శాతం కమీషన్‌కు కక్కుర్తిపడి కేసులో ఇరుక్కున్నారని సానుభూతి తెలపడం చర్చనీయాంశమైంది. -
పేకాట శిబిరంపై దాడి : భారీగా కొత్త నోట్లు స్వాధీనం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కొత్త నోట్లు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో... ఓ పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసిన ఘటనలో భారీగా కొత్త నోట్లు పట్టుబడడం కలకలం రేపింది. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. స్థానిక నేతాజీనగర్‌లోని ఓ అపార్టుమెంట్లో కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 13మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని... వారి నుంచి రూ.2.30 లక్షల నగదు, పదమూడు సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఈ దాడిలో పట్టుబడిన నగదులో ఎక్కువగా కొత్త రూ.2 వేల నోట్లు ఉండడంతో పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వరంగల్‌లో రూ.2.65 లక్షలు స్వాధీనం
వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై శనివారం ఉదయం జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతన్ని వరంగల్ జిల్లా ములుకలగూడెంకు చెందిన బ్రహ్మదేవ రాజుగా గుర్తించారు. స్థానికంగా కిరాణా షాపు నడుపుతున్న అతని వద్ద రూ.2,65,000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్తున్నాడని, దీనిపై ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించామని వరంగల్ రైల్వే సీఐ స్వామి తెలిపారు.