పేకాట శిబిరంపై దాడి : భారీగా కొత్త నోట్లు స్వాధీనం | card players arrested in hyderabad saroornagar huge cash surrendered | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరంపై దాడి : భారీగా కొత్త నోట్లు స్వాధీనం

Published Sun, Nov 20 2016 5:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

పేకాట శిబిరంపై దాడి : భారీగా కొత్త నోట్లు స్వాధీనం

పేకాట శిబిరంపై దాడి : భారీగా కొత్త నోట్లు స్వాధీనం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కొత్త నోట్లు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో... ఓ పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసిన ఘటనలో భారీగా కొత్త నోట్లు పట్టుబడడం కలకలం రేపింది. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. స్థానిక నేతాజీనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎల్‌బీనగర్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు.

పేకాట ఆడుతున్న 13మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని... వారి నుంచి రూ.2.30 లక్షల నగదు, పదమూడు సెల్‌ఫోన్‌లు సీజ్ చేశారు. ఈ దాడిలో పట్టుబడిన నగదులో ఎక్కువగా కొత్త రూ.2 వేల నోట్లు ఉండడంతో పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement