'చెన్నై ఎయిర్ పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు'
చెన్నై: తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై విమానాశ్రయం పూర్తిగా నీట మునిగిందని పౌర విమానాయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. చెన్నై ఎయిర్ పోర్టులో 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని చెప్పారు. వీరికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. వీరిని సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అన్నారు.
మరిన్ని వర్షాలు పడే అవకాశమున్నందున ఇప్పడప్పుడే చెన్నై నుంచి విమానాలు నడిపే పరిస్థితి లేదని పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. కాగా, భారీ వర్షాలతో చెన్నైకు రావాల్సిన రావాల్సిన విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి చెన్నైకు రావాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. శంషాబాద్ నుంచి కోయంబత్తూర్, కొచ్చిన్, అహ్మదాబాద్, విజయవాడ, కొచ్చి వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి.