chennairains
-
చెన్నై వాసుల కష్టాలు
చెన్నై: కుండపోత వర్షాలతో తమిళవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. వరద నీరు ముంచెత్తడంతో తినడానికి తిండి దొరక్క, తాగడానికి మంచి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. తమను ఆదుకోవాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సుమారు నెల రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై వాసుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మొత్తం నగరమంతా నీటిలో ముగినిపోయింది. ఒక్క రాజకీయ నాయకుడు కూడా తమను పలకరించిన పాపాన పోలేదని బాధితులు వాపోయారు. తిండి దొరక్క తమ పిల్లలు అలమటించిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి నీళ్లు లేవనని చెప్పారు. తమ రేషన్ కార్డులు, గుర్తింపు పత్రాలు వరదల్లో కొట్టుకుపోయాయని బాధితులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా, తమిళనాడులో వరదలు తగ్గుముఖం పట్టాలని కోరుకుంటూ బెంగళూరులో కొంతమంది ప్రత్యేక యగాలు, యజ్ఞాలు చేశారు. తమిళవాసుల కష్టాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. -
'చెన్నై ఎయిర్ పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు'
చెన్నై: తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై విమానాశ్రయం పూర్తిగా నీట మునిగిందని పౌర విమానాయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. చెన్నై ఎయిర్ పోర్టులో 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని చెప్పారు. వీరికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. వీరిని సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అన్నారు. మరిన్ని వర్షాలు పడే అవకాశమున్నందున ఇప్పడప్పుడే చెన్నై నుంచి విమానాలు నడిపే పరిస్థితి లేదని పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. కాగా, భారీ వర్షాలతో చెన్నైకు రావాల్సిన రావాల్సిన విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి చెన్నైకు రావాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. శంషాబాద్ నుంచి కోయంబత్తూర్, కొచ్చిన్, అహ్మదాబాద్, విజయవాడ, కొచ్చి వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. -
'జాతీయ విపత్తుగా ప్రకటించండి'
న్యూఢిల్లీ: తమిళనాడు భారీ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది. భారీ వర్షాలతో కుదేలైన తమ రాష్ట్రాన్ని కేంద్రం అన్నివిధాలా ఆదుకోవాలని అన్నాడీఎంకే ఎంపీ టీజీ వెంకటేశ్ బాబు కోరారు. లోక్ సభలో బుధవారం మాట్లాడుతూ... కుండపోత వర్షం, ప్రకృతి ప్రకోపం కారణంగా తమ రాష్ట్రం అతలాకుతలమైందని అన్నారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన సమస్యలను ఎదుర్కొవడానికి తమ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక నీటి నిర్వహరణ ప్రణాళికలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భారీవర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి, తగినవిధంగా సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు
చెన్నై: తమిళవాసులను భారీ వర్షాలు ఊహించని రీతిలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాదాపు నెలరోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై మహానగరం పూర్తిగా నీటిలో ముగినిపోయింది. వరద నీటితో చెన్నై వాసులు కష్టాలు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చెన్నై వాసులు భయాందోళన చెందుతున్నారు. 50 సెంటీమీటర్లు వర్షం కురిసే అవకాశముందని బీబీసీ హెచ్చిరింది. నిత్యావసరాలు అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలకు సూచించింది. అత్యవసర సమయంలో ఫోన్ చేసేందుకు అవసరమైన నంబర్లు ఇక్కడ ఇస్తున్నాం. స్టేట్ ఎమర్జెన్సీ- 1070 జిల్లా ఎమర్జెన్సీ- 1077 ఎలక్ట్రిసిటీ- 1912 ఫైర్ అండ్ రెస్క్యూ- 101 సీవేజ్ ఓవర్ ఫ్లో- 45674567, 22200335 ట్రీ ఫాల్, వాటర్ లాగింగ్- 1913 నేవీ హెల్ప్ లైన్: 044-25394240 దక్షిణమధ్య రైల్వే హెల్ప్ లెన్ 044-29015204 044-29015208 044-28190216 044-25330714 -
'జయతో వారం క్రితం మాట్లాడా'
-
'జయతో వారం క్రితం మాట్లాడా'
న్యూఢిల్లీ: భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడుకు అన్నివిధాలా సాయమందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీయిచ్చారు. వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు వారం రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో మాట్లాడినట్టు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జయలలితతో మాట్లాడారని గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలతో తమిళనాడు వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రధాన జాతీయ రహదారులు నీట మునిగాయి. రాజధాని చెన్నై పూర్తిగా జలమయం అయింది. ఎయిర్ పోర్టును మూసివేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. స్కూల్, కాలేజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. చెన్నై వాసులకు సాయం అందించేందుకు ట్విటర్ ఇండియా చెన్నై రెయిన్స్ హెల్ప్ హాష్ ట్యాగ్ ను ప్రవేశపెట్టింది. కాగా, తమిళనాడు వర్షాలపై సీనియర్ మంత్రులతో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.