న్యూఢిల్లీ: తమిళనాడు భారీ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది. భారీ వర్షాలతో కుదేలైన తమ రాష్ట్రాన్ని కేంద్రం అన్నివిధాలా ఆదుకోవాలని అన్నాడీఎంకే ఎంపీ టీజీ వెంకటేశ్ బాబు కోరారు. లోక్ సభలో బుధవారం మాట్లాడుతూ... కుండపోత వర్షం, ప్రకృతి ప్రకోపం కారణంగా తమ రాష్ట్రం అతలాకుతలమైందని అన్నారు.
భారీ వర్షాల కారణంగా తలెత్తిన సమస్యలను ఎదుర్కొవడానికి తమ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక నీటి నిర్వహరణ ప్రణాళికలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భారీవర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి, తగినవిధంగా సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'జాతీయ విపత్తుగా ప్రకటించండి'
Published Wed, Dec 2 2015 1:21 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM
Advertisement
Advertisement