TG Venkatesh Babu
-
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత టీజీ వెంకటేష్ సెటైర్లు
-
కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆనాడు మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛలోక్తి విసిరారు. ఆయనతోపాటు రానున్న రెండు నెలల్లో పదవీ విరమణ చేస్తున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌న్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేష్‌కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అలాగే రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్ సభ్యులు నరేష్ గుజ్రాల్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. It has been an honour raising issues relating to Andhra Pradesh's welfare in the Rajya Sabha in my 1st term, and as it comes to an end, I thank Sri @YSJagan garu for this honour & his faith in me. pic.twitter.com/opsHJrT8zm — Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2022 చదవండి: (అఖిలేష్‌కు బీజేపీ చెక్.. రాజ్యసభకు శివపాల్?) ఈ సందర్భంగా ఆయన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పనితీరును అభినందిస్తూ తాను అనేక పర్యాయాలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నిర్మల సీతారామన్‌తో సమావేశమయ్యానని ప్రతి అంశాన్ని ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసే వారని అభినందించారు. టూరిజం, ట్రాన్స్పోర్ట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలన్నింటిలోకి పని తీరులో ఎప్పుడూ ముందంజలో ఉండే టీజీ వెంకటేష్ కమిటీని అధిగమించడానికి కామర్స్ కమిటీ చైర్మన్‌గా తాను తాపత్రయపడుతుండే వాడినని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్ అవుతున్న సహచర సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక వీడ్కోలు, అభినందనలు చెప్పారు. చదవండి: (కర్ణాటకలో మొఘలుల పాఠ్యాంశాలకు గుడ్‌బై!) -
టీడీపీతో బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి కర్నూలు: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తులేకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని, తమ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తిరిగి బీజేపీకే వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ అధ్యక్షుల అభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇన్‌చార్జ్‌లు సునీల్ దియోధర్, మధుకర్ సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. రెండురోజుల పాటు కర్నూలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కర్నూలులోని మౌర్య ఇన్‌లోని పరిణయ ఫంక్షన్ హాలులో ఈ నెల 20, 21 తేదీలలో నిర్వహించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జ్ సుప్రకాశ్, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ దియోధర్, మధుకర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు 13 జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, పదాధికారులు పాల్గొన్నారు. సమావేశం హాలులోకి మీడియాను కూడా అనుమతించలేదు. సమావేశం తర్వాత కూడా విషయాలను బయటికీ వెల్లడించలేదు. అయితే సమావేశానికి హాజరైన బీజేపీ ముఖ్యనేతలు ఇద్దరు విషయాలను ‘సాక్షి’కి వెల్లడించారు. వారి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీతో పొత్తుకు ఒప్పుకునే ప్రసక్తే లేదు బీజేపీ విధానం, పార్టీ బలోపేతం, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సిద్ధం కావడంతో పాటు పొత్తు అంశాలపై చర్చించారు. చంద్రబాబునాయుడు బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు మాత్రమే అధికారంలోకి వచ్చారని, బీజేపీతో కలవకుండా అతను అధికారంలోకి వచ్చిన సందర్భమే లేదని 13 జిల్లాల అధ్యక్షులు వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత బలంగా ఉన్నారని, ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చంద్రబాబు చేయరని, తిరిగి బీజేపీతో జతకట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తారని చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండకూడదని 13 జిల్లాల అధ్యక్షులు మూకుమ్మడిగా నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించాలని కోరారు. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు కీలక నేతలు స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు ఉండదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబును ఆపార్టీ నేతలే నమ్మే పరిస్థితిలో లేరని, కేవలం పొత్తులపై ‘మైండ్‌గేమ్’ ఆడుతున్నారన్నారు. జనసేనతో కూడా పొత్తులపై ఇప్పటికిప్పుడే ఏం చెప్పలేమని, పవన్‌కల్యాణ్‌తో పాటు జనసేన నేతల్లో స్థిరమైన నాయకత్వం లేదని, అలాంటివారిని నమ్మి ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లలేమని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి ఏదీ? బీజేపీ ఇన్‌చార్జ్‌లతో పాటు రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుల నుంచి సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తోంది. జాతీయపార్టీగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే గెలవలేదంటే పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోవడమే కారణమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్ననేతలే బీజేపీలో ఉన్నారని, వారు బీజేపీ కాకుండా టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోందని ఓ వ్యక్తి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్‌ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. సీఎం రమేశ్, సుజనా చౌదరి టీడీపీలో ఎంత క్రియాశీలకంగా పనిచేశారో, చంద్రబాబుకు, వారికి మధ్య ఉన్న ధృడమైన బంధం ఎలాంటిదో, ఎలాంటి పరిస్థితుల్లో వారు బీజేపీలో చేరారో అందరికీ తెలిసిందే! ఇలాంటి వ్యక్తుల మాటలు విశ్వసించి పార్టీలో నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని సునీల్ దియోధర్‌తో పాటు సుప్రకాశ్కు పలువురు అధ్యక్షులు వ్యక్తిగతంగా కలిసి వివరించినట్లు తెలుస్తోంది. బైరెడ్డి గైర్హాజరు... పార్టీ వీడతారని చర్చ సమావేశానికి బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి గైర్హాజరయ్యారు. కనీసం రాష్ట్ర, జాతీయస్థాయి నేతలను వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. జనవరి 22న ఎస్టీబీసీ మైదానంలో జరిగిన ప్రజానిరసన సభలో కూడా ఆయన పాల్గొనలేదు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బైరెడ్డి బీజేపీని వీడతారనే చర్చ జిల్లాలో నడుస్తోంది. టీజీ వెంకటేశ్ వైఖరిపై ఫిర్యాదులు జిల్లా అధ్యక్షులు వ్యక్తిగతంగా పార్టీ నేతలతో కలిసి ముచ్చటించిన సందర్భంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ వైఖరిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీలో, ఆయన తనయుడు టీడీపీలో కొనసాగుతున్నారని, ఈ వైఖరితో కర్నూలు ప్రజల్లో టీజీ ఫ్యామిలీ విశ్వసనీయత కోల్పోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఉంటే ఇద్దరూ బీజేపీలో, లేదంటే టీడీపీలో కొనసాగాలని, రెండు పడవలపై ప్రయాణం వద్దని కర్నూలు జిల్లా నేతలు సునీల్ దియోధర్‌కు చెప్పినట్లు తెలిసింది. -
టీడీపీలో నిస్తేజం: ఆ రెండు కుటుంబాలు పార్టీని వీడతాయంటూ..
సాక్షిప్రతినిధి, కర్నూలు: జిల్లాలో టీడీపీ పూర్తిగా చతికిల పడింది. పార్టీ కార్యక్రమాలకు టీడీపీ నేతలు దూరంగా ఉంటూ వస్తున్నారు. అధిష్టానం వ్యవహారం నచ్చక కొందరు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీకి చావు దెబ్బ తగిలింది. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీలు వైఎస్సార్సీపీ వశమయ్యాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో కూడా టీడీపీకి గడ్డు పరిస్థితి తప్పదనే భావనకు పార్టీ శ్రేణులతో పాటు నేతలు వచ్చారు. దీంతోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సైకిల్ దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. ఆయన కుమారుడు టీజీ భరత్ మాత్రం టీడీపీలో అంటీముట్టనట్లు కొనసాగుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు ‘కేఈ ఫ్యామిలీ’ హాజరు కావడం లేదు. సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా లద్దగిరికే పరిమితమయ్యారు. టీజీ భరత్, కేఈ శ్యాంబాబు పార్టీ వీడుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీజీ భరత్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు ఫోన్ చేసి బుజ్జగించినట్లు సమాచారం. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కోడుమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయిన మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి వైఖరి కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. కోట్ల సొంత నియోజకవర్గమైనా..ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నందికొట్కూరులో టీడీపీ నేత బండి జయరాజు ఎన్నికల సమయంలో మాత్రమే కన్పించారు. నియోజకవర్గాన్ని పర్యవేక్షించే మాండ్ర శివానందరెడ్డి హైదరాబాద్‌లో మకాం వేశారు. ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడే లేరు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఆదోనిలో మీనాక్షినాయుడు వయోభారంతో రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రాలయంలో తిక్కారెడ్డి , పత్తికొండలో శ్యాంబాబు ఇప్పటి వరకు పార్టీ తరఫున ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. ఆలూరులో కోట్ల సుజాతమ్మ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తరచూ వివాదాల్లో చిక్కుకుని కేసులు, కోర్టు వ్యవహారాల్లో మునిగిపోయారు. కుటుంబసభ్యులు కూడా ఆమెకు సహకరించని పరిస్థితి. శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు. పాణ్యం, బనగానపల్లె, కర్నూలు నేతలు స్థానికంగానే ఉంటున్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు. అధినేత వ్యవహారం నచ్చక.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల చంద్రబాబు నాయకత్వంపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. జిల్లాలోనూ టీడీపీకి చెందిన కొందరు నేతలకు కూడా అధినేత వ్యవహారం నచ్చడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు జనంలోకి రావడం లేదని, హైదరాబాద్‌లో కూర్చుని ‘జూమ్’ కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం తప్ప ఆయన ఏమీ చేయడం లేదని పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. చదవండి: ‘మేము మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం చరిత్ర’ -
'చెన్నై ఎయిర్ పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు'
చెన్నై: తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై విమానాశ్రయం పూర్తిగా నీట మునిగిందని పౌర విమానాయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. చెన్నై ఎయిర్ పోర్టులో 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని చెప్పారు. వీరికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. వీరిని సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అన్నారు. మరిన్ని వర్షాలు పడే అవకాశమున్నందున ఇప్పడప్పుడే చెన్నై నుంచి విమానాలు నడిపే పరిస్థితి లేదని పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. కాగా, భారీ వర్షాలతో చెన్నైకు రావాల్సిన రావాల్సిన విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి చెన్నైకు రావాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. శంషాబాద్ నుంచి కోయంబత్తూర్, కొచ్చిన్, అహ్మదాబాద్, విజయవాడ, కొచ్చి వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. -
'జాతీయ విపత్తుగా ప్రకటించండి'
న్యూఢిల్లీ: తమిళనాడు భారీ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది. భారీ వర్షాలతో కుదేలైన తమ రాష్ట్రాన్ని కేంద్రం అన్నివిధాలా ఆదుకోవాలని అన్నాడీఎంకే ఎంపీ టీజీ వెంకటేశ్ బాబు కోరారు. లోక్ సభలో బుధవారం మాట్లాడుతూ... కుండపోత వర్షం, ప్రకృతి ప్రకోపం కారణంగా తమ రాష్ట్రం అతలాకుతలమైందని అన్నారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన సమస్యలను ఎదుర్కొవడానికి తమ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక నీటి నిర్వహరణ ప్రణాళికలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భారీవర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి, తగినవిధంగా సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.