చెన్నై : చెన్నై విమానాశ్రయంలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఉత్ప్రేదిక పదార్థమైన 'కెటమైన్' డ్రగ్‌ను అధికారులు శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కెటమైన్ మాదకద్రవ్యం విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని అంచనా.
ఇందుకు సంబంధించి ఇంతియాజ్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో దిగిన ఇతగాడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సందేహించిన అధికారులు, అతడి వద్ద సోదా చేయగా నాలుగు కోట్ల రూపాయలను విలువచేసే కెటమైన్ పట్టుబడింది. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.