![Illegal drugs sensation In Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/4/drugs.jpg.webp?itok=40aN2XSe)
ప్రతీకాత్మక చిత్రం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ నుంచి చెన్నైకి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న మందులను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. మత్తు కలిగించే రూ.4 లక్షల విలువైన టైడాల్ (టెపడడాల్) మందులను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొరియర్ ద్వారా చెన్నైలో 10 మందికి పంపారు. ఈ సమాచారం తెలుసుకున్న చెన్నై పోలీసులు అవి విజయవాడ నుంచి వస్తున్నట్లు నిర్ధారించుకుని ఇక్కడకు వచ్చారు.
స్థానిక పోలీసులు, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించారు. నక్కల రోడ్డులోని సత్య డ్రగ్ హౌస్, పుష్పా హోటల్ సెంటర్‌లోని శ్రీ వెంకటాద్రి ఫార్మాలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చెన్నైకి మందులు సరఫరా చేసినట్లు బిల్లులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు షాపుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నొప్పి నివారణకు వాడే టెపడడాల్ మందులను బిల్లులు లేకుండా చెన్నై తరలించడంతో అక్కడి పోలీసులు పట్టుకున్నారని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీరామమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment