Illegal drugs
-
అసలే అక్రమం... ఆపై నకిలీ!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి నకిలీ, అక్రమ ఔషధాలను తీసుకువచ్చి వివిధ ఆస్పత్రులతో పాటు సామాన్యులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును సౌత్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులున్న ముఠాలో ఇద్దరిని అరెస్టు చేసి రూ.28.72 లక్షల విలువైన ఔషధాలు స్వాదీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శనివారం వెల్లడించారు. కర్మన్‌ఘాట్‌కు చెందిన పోకల రమేష్, పెద్ద అంబర్‌పేట వాసి బి.రాఘవరెడ్డి వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇందులో తీవ్రనష్టాలు రావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించారు. రమేష్ కు సమీప బంధువైన పూర్ణచంద్రరావుకు ఫార్మ రంగంలో అనుభవం ఉంది. గతంలో ఆల్ఫాజోలమ్ టాబ్లెట్లు అక్రమంగా విక్రయిస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కాడు. ఇతగాడు ఉత్తరాది నుంచి అక్రమ, నకిలీ ఔషధాలను సిటీకి తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిద్దామంటూ సలహా ఇచ్చాడు. లైసెన్సు లేకపోయినా ఈ దందాలోకి దిగిన వీరితో పాటు లక్ష్మణ్ అనే వ్యక్తి కూడా ముఠాలో చేరాడు. వీరంతా కలిసి ఉత్తరప్రదేశ్‌కు చెందిన నదీమ్, ఢిల్లీ వాసి అరుణ్ చౌదరి నుంచి ఈ ఔషధాలను తక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు. ఎలాంటి బిల్లులు, పత్రాలు లేకుండానే కొరియర్లో సిటీకి రప్పిస్తున్నారు. ఈ ఔషధాలను మార్కెట్ రేటు కంటే 30 నుంచి 40 శాతం తక్కువ ధరకు అమ్ముతూ రోగులను ఆకర్షిస్తున్నారు. కొన్ని ఆస్పత్రులకు సైతం వీటిని సరఫరా చేస సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా వ్యవహారాలపై ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎస్సై మహ్మద్ ముజఫర్ తన బృందంతో వలపన్నారు. శనివారం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రి వద్ద రమేష్, రాఘవలను పట్టుకున్నారు. వీరి నుంచి స్వాదీనం చేసుకున్న ఔషధాల్లో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, అరిస్టో సహా వివిధ కంపెనీల పేర్లతో ఉన్న వాటితో పాటు ఆస్పత్రులకు సరఫరా అయ్యే ‘నాట్ ఫర్ సేల్’ మందులు కూడా ఉన్నాయి. ఈ ముఠా కొన్ని ఔషధాలను వివిధ వైద్యశాలలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. కేసును మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. -
విజయవాడలో అక్రమ ఔషధాల కలకలం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ నుంచి చెన్నైకి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న మందులను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. మత్తు కలిగించే రూ.4 లక్షల విలువైన టైడాల్ (టెపడడాల్) మందులను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొరియర్ ద్వారా చెన్నైలో 10 మందికి పంపారు. ఈ సమాచారం తెలుసుకున్న చెన్నై పోలీసులు అవి విజయవాడ నుంచి వస్తున్నట్లు నిర్ధారించుకుని ఇక్కడకు వచ్చారు. స్థానిక పోలీసులు, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించారు. నక్కల రోడ్డులోని సత్య డ్రగ్ హౌస్, పుష్పా హోటల్ సెంటర్లోని శ్రీ వెంకటాద్రి ఫార్మాలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చెన్నైకి మందులు సరఫరా చేసినట్లు బిల్లులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు షాపుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నొప్పి నివారణకు వాడే టెపడడాల్ మందులను బిల్లులు లేకుండా చెన్నై తరలించడంతో అక్కడి పోలీసులు పట్టుకున్నారని డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీరామమూర్తి తెలిపారు. -
భారత్‌లోకి అక్రమంగా ఆయుధాలు డ్రగ్స్ సరఫర
-
ఉత్తర కొరియాపై ఒబామా సీరియస్
వాషింగ్టన్: మరోసారి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియాపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉ.కొరియా అణ్వాయుధాల ముప్పును అధ్యక్షుడు ఒబామా సీరియస్‌గా తీసుకున్నారని, అమెరికన్ల భద్రతకుముప్పు వాటిల్లకుండా గట్టి చర్యలు చేపడుతున్నారని వైట్‌హౌస్ పేర్కొంది. దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న ఉ.కొరియాకు వ్యతిరేకంగా చైనా సహా యావత్తు అంతర్జాతీయ సమాజం ఏకమైందని తెలిపింది. భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తున్న ఉ.కొరియాపై మండలి మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశముందని పేర్కొంది. ముందు జాగ్రత్తగా ముగువామ్ దీవుల్లో యాంటీ బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థ ను మోహరించినట్టు ఎర్నెస్ట్ తెలిపారు. అదే సమయంలో నౌకాదళ బలగాన్నీ పెంచుతున్నట్టు వెల్లడించింది. భారత్‌లో అక్రమ డ్రగ్స్ తయారీ: అమెరికా వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోపాటు 21 దేశాలు అక్రమంగా మత్తుమందులను ఉత్పత్తి చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. అఫ్గనిస్తాన్, బహమాస్, మయన్మార్, బొలీవియా, వెనిజులాతోపాటు పలు ఆఫ్రికా, యూరప్ దేశాల పేర్లను ఒబామా ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే.. దీంతో సంబంధం లేకుండా తమ మిత్ర దేశాలైనా బొలీవియా, మయన్మార్, వెనిజులాలకు అమెరికా సాయం అందుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నార్కోటిక్స్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికన్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. -
ఫిలిప్పీన్స్‌ను హడలెత్తిస్తున్న రోడ్రిగో
-
భద్రాద్రిలో ‘ఔషధ’ తనిఖీలు
రూ.2.10 లక్షల విలువైన అక్రమ మందులు సీజ్ భద్రాచలం :భద్రాచలం పట్టణంలో బుధవారం ఔషద నియంత్రణ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొత్తగూడెం, ఖమ్మం అర్భన్, రూరల్ డ్రగ్ ఇన్సిపెక్టర్లు జీ సురేందర్, వీ లక్ష్మీనారాయణ, కె సురేందర్‌ల నేతృత్వంలోని అధికారుల బృందం ముందస్తు సమాచారం మేరకు పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేశారు. ఐటీడీఏ రోడ్‌లోని చంద్రశేఖర్ హోమియో క్లినిక్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన రూ.10 వేల విలువ గల మందులను, రెడ్‌క్రాస్ బిల్డిండ్ ఎదురుగా ఉన్న శ్రీవెంకటరమణ నర్సింగ్ హోమ్‌లో రూ.2 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. వీటి నిల్వలకు ఎటువంటి అనుమతులు లేకపోవటంతో సీజ్ చేశారు. భద్రాచలం పట్టణంలో ఔషద నియంత్రణ అధికారుల తనిఖీలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదుల నేపథ్యంలో సదరు అధికారులు నేరుగా రెండు ఆసుపత్రులను తనిఖీ చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, పట్టణంలోని ఇతర ఆసుపత్రులు, హోల్‌సేల్, రిటైల్ మందుల దుకాణాల జోలికి వెళ్లకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. భద్రాచలం కేంద్రంగా ఉన్న కొన్ని హోల్‌సేల్ దుకాణాలు నాసిరకం మందులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో తిరిగే ఆర్ఎంపీలతో ఒప్పందం కుదుర్చుకున్న కొంతమంది హోల్‌సేల్ మందుల విక్రయ దుకాణదారులు పెద్దఎత్తున నిల్వలు చేసి సరఫరా చేస్తున్నారనే ప్రచారం ఉంది. కానీ ఔషధ నియంత్రణ అధికారులు మాత్రం ఈ దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప, ఔషధ నియంత్రణ అధికారులు మందులు దుకాణాలు, ఆసుపత్రులపై తనిఖీలు చేయాలనే ఆలోచన లేకపోవటం కూడా వారి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. భద్రాచలంలో తనిఖీల కోసమని వచ్చిన ఔషధ నియంత్రణ అధికారులకు పట్టణంలో పేరుమోసిన మందుల విక్రయ దుకాణదారులు రాచ మర్యాదలు చేయటం గమనార్హం. సదరు అధికారులు హోటల్లో అల్పాహారం తీసుకునే సమయంలో కూడా కొంతమంది మందుల దుకాణ యజమానులు వారికి సేవలు చేస్తూ కనిపించారు. తనిఖీల కోసమని వచ్చిన సందర్భంలో ఇలా మందుల దుకాణదారులను వెంట వేసుకొని తిరగటంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికైనా ఔషధ నియంత్రణ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు భద్రాచలం కేంద్రంగా సాగుతున్న అక్రమాలపై దృష్టి సారించాల్సుంది.