50మంది మహిళలపై సైకో అత్యాచారం | Man Molestation On Women In Chennai | Sakshi
Sakshi News home page

50మంది మహిళలపై సైకో అత్యాచారం

Published Sun, Dec 16 2018 5:52 PM | Last Updated on Sun, Dec 16 2018 8:54 PM

Man Molestation On Women In Chennai - Sakshi

సాక్షి, చెన్నై: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న ఉన్మాది అరివలగన్‌ను అంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను బెదిరించి అత్యాచారం చేస్తూ, ఆ దృష్యాలను తన సెల్‌ ఫోన్‌లో అరివలగన్‌ రికార్డు చేసేవాడు.  ఆ వీడియోలతో మహిళలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వాళ్లపై లైంగిక అకృత్యాలకు పాల్పడేవాడు. నేరస్తుడి సెల్‌ ఫోన్‌లో సుమారు 50 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన వీడియోలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.

కొద్దిరోజుల క్రితమే ఓ గృహిణి, ముగ్గురు ఐటీ ఉద్యోగినులు ఫిర్యాదు చేయడంతో ఈ దుర్మార్గుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒంటరి మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఉన్మాది అరివలగన్‌ కోసం ప్రత్యేకంగా గాలింపులు నిర్వహించిన పోలీసులు..  ఎట్టకేలకు అతన్ని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement