తమిళనాడు మేకమాంసం వ్యాపారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎకె షాన్‌బాషా, చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో గురువారం ఓ ఫిర్యాదు చేశాడు.
మామూళ్ల కోసం దాడి
తిరువొత్తియూరు: తమిళనాడు మేకమాంసం వ్యాపారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎకె షాన్‌బాషా, చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో గురువారం ఓ ఫిర్యాదు చేశాడు. తమ సంఘంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, కొన్ని వేల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి మేకలను లారీలలో తీసుకువస్తుంటారని తెలిపారు.
చెన్నై శాంతిభద్రత, ట్రాఫిక్ పోలీసులు లారీ డ్రైవర్లను దారిలో అడ్డగించి జరిమానా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.. కొందరిపై దాడికి కూడా పాల్పడుతున్నారని వాపోయూరు. మామూళ్లు కోరుతూ భాష తెలియని ఉత్తరాదికి చెందిన డ్రైవర్, క్లీనర్లను వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.