kasthuri
-
తెలుగువారిపై వివాదాస్పద కామెంట్స్.. కస్తూరికి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!
ప్రముఖ నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో కస్తూరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.ముందస్తు బెయిల్ నిరాకరణ..ఈ కేసులో నటి కస్తూరి ఇప్పటికే మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.క్షమాపణలు చెప్పిన కస్తూరిఅయితే తన వ్యాఖ్యల పట్ల నటి కస్తూరి క్షమాపణలు చెప్పింది. తనకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆరోపించింది. అయినప్పటికీ కస్తూరి వ్యాఖ్యలపై చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.ఇంటికెళ్లిన పోలీసులు..ఆమె కేసులు నమోదు చేసిన పోలీసులు సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్‌ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.అసలేం జరిగిందంటే..హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి తెలుగువారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. -
ఇంటికి తాళం.. పారిపోయిన కస్తూరి
-
పరారీలో తమిళ నటి కస్తూరి
-
పరారీలో సినీ నటి కస్తూరి.. సమన్లు జారీ చేసిన పోలీసులు
చెన్నైలో నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆమె పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తెలుగు గడ్డ తనకు మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెబుతూనే క్షమాపణ కూడా కస్తూరి చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆమె చెప్పింది.కస్తూరి చేసిన వ్యాఖ్యలతో చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్‌ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ.. నటి కస్తూరి తెలుగువారిపై ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. -
Actress Kasthuri: నాకు అండగా తెలుగు వారున్నారు...
-
క్షమాపణ కోరుతూ తెలుగు ప్రజలకు లేఖ రాసిన నటి కస్తూరి
సినీ నటి కస్తూరు తమిళనాడులో ఒక వేదికపై తెలుగు వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయితే, తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదంటూ ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. కానీ, ఆమెపై ఎదురుదాడి ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఎట్టకేలకు తెలుగు ప్రజలకు క్షమాపణ చెబుతూ ఒక లేఖ విడుదల చేసింది.'నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను. నేను నిజమైన జాతీయవాదిని. ప్రాంతాలను విడికొట్టి ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉండడం నా అదృష్టం. నేను నాయకర్ రాజులు, కట్టబొమ్ము నాయక (వీరపాండ్య కట్టబ్రహ్మన) , త్యాగరాజు కీర్తనల గురించి తెలుసుకుంటూ పెరిగాను. తెలుగులో నా సినీ కెరీర్ ఎంతో అద్భుతంగా సాగుతుంది. తెలుగు ప్రజలు నాకు పేరుతో పాటు కీర్తి, ప్రేమ, కుటుంబాన్ని అందించారు. నేను మాట్లాడింది కొందరి వ్యక్తుల గురించి మాత్రమేనని గ్రహించగలరు. తెలుగు సమాజం మొత్తాన్ని ఉద్దేశిస్తూ నేను మాట్లాడలేదు. నా తెలుగు కుటుంబాన్ని బాధపెట్టడం ఉద్దేశ్యం కాదు. అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటనకు నన్ను క్షమించండి. సర్వతోముఖ స్నేహం దృష్ట్యా, నేను 3 నవంబర్ 2024న నా ప్రసంగంలో తెలుగుకు సంబంధించిన అన్ని వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను. ఈ వివాదం వల్ల నేను ఆ ప్రసంగంలో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలు అన్నింటినీ పక్కను నెట్టేసింది. తమిళనాడులోని తెలుగు సోదరులు అందరూ.. పరువు కోసం జరిగే పోరాటంలో తమిళ బ్రాహ్మణులకు మద్దతుగా నిలవాలని నేను కోరుతున్నాను.' అని ఆమె పేర్కొంది.నవంబర్ 3న కస్తూరి తెలుగు వారి గురించి ఇలా వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని కస్తూరు వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. అయితే, ఈ వ్యాఖ్యలు తాను కొందరిని ఉద్దేశించి మాత్రమే చేశానంటూ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తెలుగు ప్రజలందరికి క్షమాపణలు చెబుతూ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంది.My statement. Jai Hind. pic.twitter.com/KSz0BRxz6D— Kasturi (@KasthuriShankar) November 5, 2024 -
తెలుగు వారి గురించి నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు: నటి కస్తూరి
హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇదే వేదికపై ఆమె తెలుగు వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో నివశిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో క్లారిటి ఇస్తూ ఒక పోస్ట్ చేశారు.'నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడాను అంటూ డీఎంకే పార్టీకి చెందిన వారు ఫేక్ ప్రచారాలకు తెరలేపారు. తెలుగు గడ్డ నా మెట్టినిల్లుతో సమానం. తెలుగు ప్రజలందరూ నా కుంటుంబం అనే భావిస్తాను. ఈ విషయం తెలియని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నిన్నటిరోజున నేను చేసిన వ్యాఖ్యలను తమిళ మీడియాలో తప్పుగా వక్రీకరిస్తూ చెబుతున్నారు. ఈ ట్రాప్‌లో తెలుగు మీడియా పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్ర,తెలంగాణ ప్రజలు ఎంతోమంది నాపై ప్రేమ చూపుతున్నారు. దాని నుంచి నన్ను వేరు చేసేందుకే ఈ కుట్రను అమలు చేస్తున్నారు. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.' అని తెలిపింది.సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని కస్తూరు వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించారంటూ తమిళనాట వార్తలు వస్తున్నాయి. -
తెలుగు జాతిపై తమిళ నటి కస్తూరి కాంట్రవర్సీ కామెంట్స్
-
నా అనుమతి లేకుండానే ఆ ఫోటోలు లీక్ చేశారు: కస్తూరి
కస్తూరి శంకర్.. ఒకప్పుడు హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. తమిళ బిగ్‌బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్‌లో మెరిసింది. 50 ఏళ్లు వయసు దాటినా ఆమె అందం చెక్కు చెదురలేదు. ఇప్పటికీ ఆమె నవ్వులో తెలియని మ్యాజిక్ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫోటో షూట్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.2000 సంవత్సరంలో కస్తూరి ఒక డాక్టర్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యూరప్ వెళ్లిపోయింది. ఆ తర్వాత అమెరికాలో కొంత కాలం ఉంది. ఆ సమయంలో రోజుల వ్యవధి ఉన్న తన బాబుతో అమ్మతనాన్ని చాటి చెబుతూ అర్ధనగ్నంగా ఫోటోలు దిగింది. అవి కాస్త నెట్టింట వైరల్ కావడంతో కొందురు ఆమెను విమర్శిస్తే.. మరికొందరు అభినందించారు. తాజాగా కస్తూరి ఆ సందర్భం గురించి ఇలా చెప్పుకొచ్చింది.'ఆ ఫోటో షూట్ నేను చేసింది ఇండియా కోసం కాదు.. అమెరికాలో ఒక మ్యాగ్జైన్ కోసం ఇచ్చాను. అది భారత్‌లో పబ్లీష్ కాకూడదు. కానీ, భారత్‌లో ఉన్న మీడియా వారు సెన్స్ లేకుండా ప్రచురించారు. దేశంలో పేరున్న మీడియా సంస్థనే ముందుగా భారత్‌లో ప్రచురించింది. కనీసం నన్ను కూడా అడగలేదు. ఇక్కడ ఉన్న వారికి నేను ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కొంత కాలం తర్వాత ఒక ఆంగ్ల పత్రిక నన్ను సంప్రదించి ప్రచురించుకుంది. అందరూ దొంగతనంగా ఆ ఫోటోలు వేసుకున్నారు. భారత కల్చర్‌కు ఆ ఫొటోలు పెద్దగా నచ్చవు. అది అమెరికన్ ప్రాజెక్టు. ఒక మహిళ డెలివరీ అయిన తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి. దానిని అవగాహాన కల్పించేందుకే ఆ ప్రాజెక్ట్ చేశాను. మాతృత్వానికి అమెరికా వాళ్లు ఇచ్చే మర్యాద, మనం ఇచ్చే మర్యాద వేరుగా ఉంటుంది. ఆ ఫొటోలు లీక్ కావడం నాకు కూడా చాలా బాధగా అనిపించింది. బిడ్డకు పాలిచ్చే ఫొటోలను ఇక్కడి వారు చూసే విధానం వేరుగా ఉంటుంది. కానీ, అది తప్పని తెలుసుకున్నా. కానీ, ఎవరూ ఊహించని విధంగా భారత్ నుంచి కూడా కొందరు మహిళలు నాకు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. ఎందుకంటే వారు కూడా అమ్మ స్థానం నుంచే వచ్చారు కాబట్టి దాని విలువ తెలుస్తోంది. గ్రామీణ మహిళలు నుంచి కూడా నాకు సపోర్ట్ దక్కింది. కొంత కాలం తర్వాత పెళ్లి అయిన పురుషులు కూడా నాకు అండగా నిలిచారు.' అని కస్తూరి తెలిపింది. -
బెంగళూరు టీమ్‌పై నటి వ్యంగ్య పోస్ట్.. ఆ రెండేళ్లు మర్చిపోయారా? అంటూ సెటైర్లు!
తమిళ నటి కస్తూరి 90వ దశకంలో హీరోయిన్గా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు. సామాజిక, రాజకీయ అంశాల మీద పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఐపీఎల్ టీం బెంగళూరు ఓటమిపై పోస్ట్ పెట్టింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయిన ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రముఖ కోలీవుడ్ నటి కస్తూరి తన ట్విటర్లో ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. చాలా ఏళ్లుగా ఈ విషయం అక్కడి వారికి తెలుసు అంటూ బెంగళూరు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ పిక్‌ను షేర్ చేసింది. అంతే కాకుండా 'ఈసాలా కూడా కప్ ఇల్లా' అంటూ కించపరిచేలా క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.అయితే ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమె చేసిన పోస్టుకు కౌంటర్‌గా కామెంట్స్ పెడుతున్నారు. సీఎస్కే టీమ్‌లా రెండేళ్లు మా టీమ్ బ్యాన్ కాలేదని గుర్తు చేస్తున్నారు. మీ టీమ్ అంతా ఫిక్సింగ్ అంటూ కస్తూరిని ట్రోల్ చేస్తున్నారు. మీ టీమ్ చెన్నై ఫిక్సింగ్ కింగ్స్ అంటూ నెటిజన్స్ పెద్దఎత్తున ఆడేసుకుంటున్నారు.The locals have known for years ....🤭😃#eesala #illa pic.twitter.com/gektBLqkFZ— Kasturi (@KasthuriShankar) May 23, 2024 -
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
-
త్రిషకు మద్దతుగా కస్తూరి.. హీరోయిన్లు వేశ్యలా అంటూ వార్నింగ్
తమిళ నటి కస్తూరి 90వ దశకంలో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. కస్తూరి సినిమాలే కాదు, పలు సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా తన అభిప్రాయాన్ని డైరెక్ట్‌గా చెబుతుంది. అవతల ఉండే వ్యక్తి ఎవరు ఉన్నా సరే.. తరువాత ఏమైనా కానియ్..ఐ డోంట్ కేర్ అనుకునే రకం ఆమె.. ఆమెలో ఉన్న డేరింగ్ తత్వం అది. అన్నాడీఎంకే బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. హీరోయిన్ త్రిషకు. రూ.25 లక్షలు ఇచ్చి రిసార్ట్‌కి రప్పించామని, డ్యాన్సులు చేయించామని నోటికొచ్చిందల్లా వాగాడు.. దీంతో త్రిష కూడా అతనిపై కేసు కూడా పెట్టింది. ఈ అంశంపై హీరో విశాల్ మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజుపై తీవ్రంగా విరుచుక పడిన విషయం తెలిసిందే. తాజాగా నటి కస్తూరి కూడా అతనిపై ఫైర్ అయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగమ్మాయి హాలీవుడ్ సినిమా.. ఆ సాంగ్ స్పెషల్) ఈ మధ్య సినిమా హీరోయిన్లపై విపరీతమైన దూషణలు పెరిగాయి.ఏమాత్రం నిజానిజాలు చూసుకోకుండా నోటికొచ్చింది వాగేస్తున్నారు. నోరు, నాలుకలు ఉంటే సరిపోదు.. మనం ఏం మాట్లాడుతున్నామో అనే బుద్ది కూడా ఉండాలి. కొద్దిరోజుల క్రితం త్రిషపై మన్సూర్ అలీఖాన్ కూడా ఇలాంటి చెత్త వ్యాఖ్యలే చేశాడు.. మళ్లీ ఇప్పుడు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు త్రిషపై నీచమైన కామెంట్లు చేశాడు. ఇలాంటివి సమాజానికి మంచిది కాదు. మీ రాజకీయ పార్టీలోని వ్యక్తులతో సమస్యలు ఉంటే అక్కడ చూసుకోకుండా ఇలా త్రిష పేరును తెరపైకి తీసుకొచ్చి చిల్లర వ్యాఖ్యలు చేయం ఏంటి..? మీలాంటి వారికి మేము ఎలా కనిపిస్తున్నాం..? సినిమా పరిశ్రమకు చెందిన వారందరూ మీ కంటికి వేశ్యల్లా కనిపిస్తున్నారా..? సినిమాలో పనిచేస్తున్న అమ్మాయిలకు అమ్మానాన్నలు ఉంటారనే ఆలోచన కూడా లేకుండా పోయిందా..? కనీసం వారి గురించి అయినా ఆలోచించరా..? ఇక నుంచి నోరు అదుపులో పెట్టుకుని ఆడపిల్లల గురించి కామెంట్లు చేయండి. ఒక అమ్మాయి గురించి ఇలాంటి కామెంట్లు చేసే అధికారం మీకు ఎవడు ఇచ్చాడు..? ఎవరో చెప్పారు చెప్పారంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? మీ వద్ద ఆదారాలు ఉంటే బయట పెట్టండి. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. మీకు ఉన్న గౌరవం పోతుంది. ఇలాంటి వారి వల్ల సమాజం కోసం పనిచేసే రాజకీయ నాయకులకు కూడా చెడ్డపేరు వస్తుంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను కూడా అధిగమించి తమ కుటుంబాల కోసం ఆడపిల్లలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లోకి మహిళలు వచ్చేదే తక్కువ.. పరిశ్రమలో అడుగుపెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ సినిమాల్లోకి వచ్చాక మీలాంటివారు ఇలాంటి ముద్రలు వేస్తుంటే ఎలా..? తమిళనాడులో అందరూ అమ్మగా పిలిచి అభిమానించే నాయకురాలు జయలలిత గారు. ఆమె కూడా నటిగా,మహిళగా, ముఖ్యమంత్రిగా వెలుగొందారనే విషయం మరిచిపోయారా..? ఆమె సారథ్యం వహించిన పార్టీలో ఇలాంటి వ్యక్తికి స్థానం ఇవ్వడం ఏంటి..? ఇప్పుడు జయలలిత ఉండుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా..? ఇలాంటి ఘటనలు తలుచుకుంటే బాధ కలుగుతుంది.' అని కస్తూరి అన్నారు. -
ఆ సినిమాలో ఛాన్స్ కోసం డైరెక్టర్‌కు బికినీ ఫోటోలు పంపిన హీరోయిన్
అన్నమయ్య,పెద్దరికం, భారతీయుడు సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ హీరోయిన్ కస్తూరి.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో మంచి సినిమాలు చేసిన కస్తూరికి భారీ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇండస్ట్రీలో తనకు నచ్చిన విషయంతో పాటు ఏదైనా నచ్చలేదంటే ఓపెన్‌గానే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే గట్స్ ఆమెకు ఉన్నాయి. అలా ఒక్కోసారి ఆమె కామెంట్లు భారీగానే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆమె 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్లో తులసి పాత్రతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఇంటర్వ్యూలో కస్తూరి తన కెరీర్ ప్రారంభం రోజుల్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శంకర్ లాంటి దర్శకుడితో కలసి పనిచేయడం ఎంత అదృష్టమో నాకు ఆ తర్వాత రోజుల్లో తెలిసింది. 'అప్పుడు నాది చిన్న వయసు. కాబట్టి ఏదో సరదాగా చేసేశాను. కమల్ హాసన్ హిట్ సినిమా భారతీయుడులో మొదట హీరోయిన్ ఛాన్స్ నాకే వచ్చింది. ఆ సినిమా విషయంలో సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని డైరెక్టర్‌కి బికినీ ఫోటోలు కూడా పంపించాను. కానీ.. అదే సమయంలో రంగీలా చిత్రం రిలీజ్ కానుంది. ఆ సమయంలో ఎక్కడ చూసిన ఊర్మిళ గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో భారతీయుడు సినిమా మేకర్స్ అటెన్షన్ ఆమె వైపు వెళ్ళింది. చివరికి ఊర్మిళను హీరోయిన్గా ఫైనల్ చేశారు. నాకు మాత్రం కమల్ హాసన్ చెల్లి పాత్ర ఇచ్చి సరిపెట్టేశారు. అలా భారతీయుడికి కుమార్తెగా నటించాను. కొద్దిరోజుల తర్వాత ఏంటి సర్ ఇలా చేశారు..? అని అడిగితే.. సినిమాలో ఇదొక కీలకమైన పాత్ర అని చెప్పడంతో నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను.' అని కస్తూరి తెలిపింది. -
'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!
బిగ్‌బాస్ 7వ సీజన్ ఈ మధ్యనే మొదలైంది. గత సీజన్లతో పోలిస్తే ఉల్టా పుల్టా అని అన్నారు గానీ ఏమంత పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. మరోవైపు తమిళంలోనే ఈ ఆదివారమే కొత్త సీజన్ షూరు అయింది. ఇప్పుడు ఈ షోపైనే సీరియల్ నటి ఓ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్స్ కాస్త శ్రుతిమించారు. అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!) సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలపై నెటిజన్స్ రెచ్చిపోవడం చాలా సాధరణమైపోయింది. కొందరు దీన్ని పట్టించుకోరు. మరికొందరు మాత్రం ఇచ్చిపడే రీతిలో కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా 'గృహలక్ష్మీ' సీరియల్ తులసి అదేనండి కస్తూరి శంకర్.. తాజాగా తమిళ 'బిగ్‌బాస్'పై ట్వీట్ చేసింది. 'ఒక ఇంట్లో చాలామందిని ఉంచి వారి ఆర్టిఫిషియల్(కృత్రిమమైన) ఫీలింగ్స్ చూపించే షోను నేను పట్టించుకోను. నా దగ్గర టీవీ లేదు. నాకంతా టైమ్, ఓపిక, ఇంట్రెస్ట్ కూడా లేవు. కుటుంబం, దాని బాధ్యతలు, వర్క్ నాకు ఉన్నాయి. నేను బిగ్ బాస్ చూడటం లేదు' అని రాసుకొచ్చింది. ఇక దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్.. "డబ్బుల కోసం షోకి వెళ్లావ్ కదా. మళ్లీ ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్?" అని కామెంట్స్ పెడుతున్నారు. ఒక నెటిజన్ శ్రుతిమించి కామెంట్ చేశాడు. "అవునులే, నీకు గంటకు రూ. ఐదు వేలు వస్తాయ్ కదా" అని అసభ్యకర రీతిలో రాసుకొచ్చాడు. దీన్ని ఏ మాత్రం లైట్ తీసుకోకుండా కౌంటర్ ఇచ్చిన కస్తూరి.. "మీ ఇంట్లో వాళ్లు నిన్ను ఇలానే పెంచారా? నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది" అని సీరియస్ అయింది. (ఇదీ చదవండి: 'దేవర' నుంచి సర్ప్రైజ్.. బాహుబలి, పుష్ప రూట్లోనే) No. I don't care. I am not interested in the artificial problems of a bunch of show people. I don't have: TV I don't have: time , patience, interest. I have : Family, responsibilities, work.#notwatchingboss — Kasturi (@KasthuriShankar) October 3, 2023 -
ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ఎంతోమంది మనసు దోచేసిన కస్తూరి.. ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తోంది. తాజాగా నటుడు దుల్కర్ సల్మాన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే తన లైఫ్‌లో కూడా చోటుచేసుకుందని ఓ ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కస్తూరి ఎమోషనల్ అయింది. దుల్కర్ సల్మాన్‌ను అసభ్యంగా టచ్ చేసిన మహిళ గతంలో ఓ అభిమాని ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బందిపడ్డానని నటుడు దుల్కర్ సల్మాన్ ఓపెన్‌గానే తెలిపారు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ తనని ఇబ్బందికరంగా పట్టుకుందని ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ ప్రమోషన్స్ సమయంలో చెప్పారు. కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ తన బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తనతో ఆశ్చర్యపోయానని దుల్కర్ చెప్పాడు. గతంలో ఒక పెద్దావిడ వల్ల తాను ఎంతో ఇబ్బంది పడ్డానని ఆమె తనను అభ్యంతరకరంగా తాకడంతో ఎంతో బాధనిపించిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. టచ్ చేసి అక్కా సారీ.. సారీ అంటే ఎలా ఇలాంటి ఘటనే సీనియర్ నటి కస్తూరి జీవితంలో జరిగిందని తెలిపింది. కోలీవుడ్‌లో స్టార్స్ అసోసియేషన్ ఈవెంట్లో తనపై లైంగిక దాడి జరిగిందని ఇలా చెప్పుకొచ్చింది. ‘‘ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఒక ఈవెంట్‌ను ప్రముఖ సంస్థ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా భారీగా జనం తరలివచ్చారు. ఎవరో నన్ను వెనుక నుంచి నొక్కుతున్నట్లు అనిపించింది. ఇది జరిగినప్పుడు మా నాన్న నాతోనే ఉన్నారు. నేను వెంటనే అతని చెయి పట్టుకుని నా ముందుకు లాగాను. దీంతో వాడు ఆ సమయంలో విపరీతంగా ఏడ్చాడు.. అక్కా సారీ.. సారీ అంటూ గట్టిగా ఏడవడం మెదలుపెట్టాడు. ఇలాంటి చెత్త పనులు చేసి అక్కా అని వేడుకోవడం ఎందుకు' అని నటి కస్తూరి చెప్పింది. కామెంట్ బాక్స్‌లోకి వచ్చి ఇలాంటి కామెంట్లు ఇలాంటి వారి వల్ల ఇండస్ట్రీలో చాలమంది నటీమణులు ఇబ్బందులకు గురైన వారున్నారు. ఇలాంటి ఘటనలపై కొందరు నటీనటులు బహిరంగంగానే ఇప్పుడు చెబుతున్నారని కస్తూరి తెలిపింది. అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కొందరు తమపై సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు చేస్తూ సైబర్ దాడులకు దిగుతుంటారని పేర్కొంది. సోషల్ మీడియాలో చాలామంది తమ వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి గురవుతున్నారు. తమ కోపాన్ని ఎక్కడ బయట పెట్టాలో తెలియడం లేదు. అందుకే కామెంట్ బాక్స్‌లోకి వచ్చి ఇలా రచ్చ సృష్టిస్తున్నారని కస్తూరి చెప్పింది. -
నయనతారకు అలాంటి అర్హతే లేదు: కస్తూరి
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకునే హీరోయిన్లలో ఒకరు. కానీ కెరీర్ ప్రారంభం నుంచి నయనతారపై గాసిప్‌లు, వివాదాలు వచ్చాయి. ప్రేమలు, ప్రేమ వైఫల్యాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. అయితే ఇన్ని సమస్యలు ఎదురైనా తన కెరీర్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అలా 2013 తర్వాత వరుస హిట్లతో తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంది. ఎందరో నటీమణులు వచ్చినా సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదగగలిగింది మాత్రం నయనతార మాత్రమేనని ఆమెకు కితాబు ఉంది. తాజాగ నయనతార గురించి నటి కస్తూరి చెసిన కామెంట్ వైరల్ అవుతుంది. సౌత్ ఇండియాలో నయనతారను లేడీ సూపర్‌స్టార్‌గా అంగీకరించలేమని కస్తూరి చెప్పింది. కోలీవుడ్‌లో రజనీకాంత్ బిగ్గెస్ట్ స్టార్. అజిత్ , విజయ్ , కమల్ హాసన్‌లు ఉన్నప్పటికీ రజనీకాంత్‌ను మాత్రం ఎవరూ భర్తీ చేయలేరని కస్తూరి అన్నారు. నటీమణుల్లో లేడీ సూపర్‌స్టార్ ఎవరు అని అడిగినప్పుడు, కస్తూరి అలనాటి నటీమణులు కెపి సుందరాంబల్, విజయశాంతి పేర్లను ప్రస్తావించింది. ఇంతకుముందు కూడా నయనతార సరోగసీ ద్వారా బిడ్డలను స్వీకరించినందుకు కస్తూరి కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. జనవరి 2022 నుంచి భారతదేశంలో సరోగసీని నిషేధించారని, వైద్యపరంగా ఇది క్షమించరాని నేరమని కస్తూరి ట్వీట్ చేశారు. కానీ ఈ విషయంలో కస్తూరిపై విమర్శలు వచ్చాయి. మరొకరి వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు చొరబడుతున్నారని కస్తూరిని పలువురు ప్రశ్నించారు. అప్పుడు ఈ విషయం కూడా పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు మళ్లీ కస్తూరి వ్యాఖ్యలపై నయనతార ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. (ఇదీ చదవండి: ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్‌కుమార్) -
ఆదిపురుష్.. ప్రభాస్ అసలు రాముడిలానే కనిపించడం లేదే!
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' విడుదలకు సిద్ధమైంది. కానీ, సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ప్రారంభమైన విమర్శలు.. ఇప్పటి వరకు కూడా చల్లారలేదు. ఇంతలో తిరుమలలో హీరోయిన్ కృతీ సనన్‌ను దర్శకుడు ఓం రౌత్ హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఈ వివాదంపై నటి కస్తూరి స్పందిస్తూ ‘ఆదిపురుష్’ పోస్టర్‌పై విమర్శల వర్షం కురిపించింది. ప్రభాస్ లుక్ చూస్తుంటే కర్ణుడు గుర్తుకువస్తున్నారని పేర్కొంది. (ఇదీ చదవండి: నయనతార గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విఘ్నేశ్ శివన్, పిల్లల్ని చూశారా?) శ్రీరాముడితో పాటు ఆయన సోదరుడు లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని దర్శకుడిని తప్పుబట్టింది. మరీ ముఖ్యంగా ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ.. 'టాలీవుడ్లో ఎంతోమంది నటులు శ్రీరాముడి పాత్రల్లో తెరపై అద్భుతంగా కనిపించారు. కానీ, ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా కాకుండా కర్ణుడిగా కనిపిస్తున్నారు' అని ఆమె కామెంట్ చేసింది. కస్తూరి వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కస్తూరి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. (ఇదీ చదవండి: డబ్బులిచ్చి మరీ నన్ను తిట్టిస్తున్నారు.. విజయ్ దేవరకొండ మనిషే చెప్పాడు) -
ఆ విషయంలో జూ. ఎన్టీఆర్, మంచు లక్ష్మిని పోల్చకండి: నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్
భారతీయుడు, అన్నమయ్య వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది నటి కస్తూరి. ఆ తర్వాత నిప్పు రవ్వలో మెరిసిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్ ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ ఇండస్ట్రీలో వివాదంలో నిలిచిన పలు అంశాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడిన తీరును ఇండియన్ నెటిజన్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అమెరికా మీడియా, ఇంటర్య్వూలో ఎన్టీఆర్ అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ వాడిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై కొందరు పాజిటివ్‌గా స్పందించగా.. తెలుగు రాష్ట్రాల నెటిజన్లు ఎన్టీఆర్‌ను ట్రోల్ చేశారు. కొద్ది రోజులు దీనిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీనిపై తాజాగా నటి కస్తూరి స్పందించింది. ఆయన అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడంలో అసలు తప్పేముందంది. నిజానికి అది గర్వించదగ్గ విషయం అంటూ తారక్‌పై ప్రశంసలు కురిపించింది. ‘అమెరికా వాళ్లకి వాళ్ల స్లాంగ్‌లోనే మాట్లాడితేనే అర్థమవుతుంది. మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడారు. ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్. కానీ మన దగ్గర మాత్రం చాలా మంది ఆయనది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు. అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమెరికా వాళ్లకి. వాళ్లలా మాట్లాడితేనే అర్థమవుతుంది. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ అదే నేను తెలుగును తమిళ యాక్సెంట్లో మాట్లాడితే ఎలా ఉంటుంది. వినడానికి ఇబ్బంది ఉంటమే కాదు అసలు అర్థం కూడా కాదు’ అంటూ వివరణ ఇచ్చింది. ఇక మంచు లక్ష్మి ఇక్కడే అమెరికన్ యక్సెంట్ వాడటంపై కూడా ఆమె స్పందించింది. ‘నిజమైన ప్రయత్నానికి.. కావాలని చేసే ఫేక్ అటెంప్ట్‌కి చాలా తేడా ఉంది. హైదరాబాద్‌కి వచ్చి అమెరికన్ యాక్సెంట్ మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారు. ఇక్కడ తెలుగుని స్పష్టంగా తెలుగులోనే మాట్లాడొచ్చు. కానీ తెలుగులో కూడా అక్కడి యాక్సెంట్ కలపడం ఎందుకు. వీరిద్దరికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ విషయంలో వారిద్దరిని(జూనియర్ ఎన్టీర్, మంచు లక్ష్మిని) పోల్చ కూడదు’ అని ఆమె పేర్కొంది. -
అనసూయ ఆంటీ వివాదంపై స్పందించిన కస్తూరి
భారతీయుడు, అన్నమయ్య వంటి సినిమాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్‌లో రాణిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సూపర్ క్రేజ్ దక్కించుకుంటున్న ఆమె తాజాగా అనసూయ ఆంటీ వివాదంపై స్పందించింది. 'చిన్నపాప ఆంటీ అని పిలవడానికి, దున్నపోతులాగా ఉన్న వ్యక్తి వచ్చి మమ్మల్ని ఆంటీ అనడానికి చాలా తేడా ఉంది. అడల్ట్ అయితే మహిళలను ఆంటీ అని పిలవడం కరెక్ట్ కాదు. చిన్నపిల్లలు మాత్రమే ఆంటీ అనడం కరెక్ట్. ఒక హీరోనో, నటుడినో అంకుల్ అని పిలుస్తారా? అనసూయ కంటే రెట్టింపు వయసున్న హీరోలను అంకుల్ అని చూడండి... అనరు కదా! మరి ఆడవాళ్లను మాత్రం ఆంటీ అనడం దేనికి? ఆల్రెడీ ఆంటీ అనే పదానికి డర్టీ మీనింగ్ కూడా వచ్చేసింది. మీకు ఇతరుల మీద గౌరవం లేదంటేనో, మనసులో ఏదో చెడు ఆలోచనలు ఉంటే మాత్రమే ఆంటీ అని పిలుస్తారు. ఈ విషయంలో అనసూయకు నేను మద్దతుగా ఉంటాను' అని పేర్కొంది కస్తూరి. రాజకీయ ఎంట్రీపై స్పందిస్తూ.. 'నేను తమిళనాడు రాజకీయాలపై అనాలసిస్ చేస్తుంటా. తెలుగు రాజకీయాల గురించి తెలియదు. కానీ దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారికి పెద్ద అభిమానిని. తమిళనాడులో దాదాపు అన్ని పార్టీలు నన్ను ఆహ్వానించాయి. కాకపోతే నేను ఉన్నదున్నట్లుగా మాట్లాడతాను. ఒకవేళ ఏదైనా పార్టీలో చేరితే ఆ పార్టీ చేసే తప్పులను వేలెత్తి చూపలేం. ఇప్పుడు ఖుష్బూ పరిస్థితి అలాగే ఉంది. అలాగే పాలిటిక్స్‌లో ఉండాలంటే ఎంతో డబ్బుండాలి. నాదగ్గర అంత లేదు, కాబట్టి రాజకీయాల్లోకి రాలేను' అని తెలిపింది కస్తూరి. చదవండి: ఇద్దరు భార్యలపై చేయి చేసుకున్న యూట్యూబర్ -
బిగ్‌బాస్ షో.. అవి నిజాలే కావు: నటి కస్తూరి
బిగ్‌బాస్ షోకు యమ క్రేజ్ ఉంది కాబట్టే ఈ షో అనేక భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తోంది. ఈ మధ్యే తమిళంలోనూ ఐదో సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 'గృహలక్ష్మీ' సీరియల్ ఫేమ్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి కస్తూరి శంకర్.. తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో ఇప్పటివరకు తాను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని, తనలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ట్వీట్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు చూశామని, మరికొందరు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. 'గతంలో మీరు బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ చివరికి మీకన్నా మిగతావాళ్లే ఎంతో నయం అనిపించింది' అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీనిపై కస్తూరి స్పందిస్తూ.. 'మీరు చూసినదాన్ని బట్టి ఎవ్వరినీ జడ్జ్ చేయకండి.. వారు చూపించేది కచ్చితంగా నిజాలే కానక్కర్లేవు' అని చెప్పుకొచ్చింది. హౌస్‌లో అంతమందికి ఒక్క కుక్కర్లోనే వంట చేశారా? అని ఓ వ్యక్తి అనుమానం వ్యక్తం చేయగా.. మాకు కొంత ఫుడ్ పంపిస్తారని, కాకపోతే కంటెస్టెంట్లు తగ్గేకొద్దీ వంటసరుకుల మోతాదు కూడా తగ్గిపోతూ ఉంటుందని తెలిపింది. అలాగే ఎంతో త్వరగా హౌస్ నుంచి బయటకు వచ్చేసినందుకు ప్రతిరోజు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటానంది కస్తూరి. Raise your hand if you are like me and haven't watched a single episode of #BiggBossTamil5 till date. Hugs ! Consolation hugs to those who never managed to watch a single full episode. #StarVijayTV #companyArtists #100naal_velaivaipputhittam — Kasturi Shankar (@KasthuriShankar) October 16, 2021 Don't judge based on what you get to see- The narrative they show is not necessarily the truth — Kasturi Shankar (@KasthuriShankar) October 16, 2021 I know !!! I thank god everyday that i escaped early and have done genuine work since then ! — Kasturi Shankar (@KasthuriShankar) October 16, 2021 -
ఏపీలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ పురోభివృద్ధి కోసం చేపడుతున్న సంస్కరణలు ప్రశంసనీయమని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కొనియాడారు. సమర్థత గల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. ‘21వ శతాబ్దంలో శక్తిమంతమైన సమాజ నిర్మాణం’ అనే అంశంపై ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ శనివారం దృశ్యమాధ్యమ పద్ధతిలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన ప్రత్యేక విశిష్ట ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించింది. కస్తూరి రంగన్ ముఖ్య ప్రసంగం చేస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తిగా విన్నాను. విద్యాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంస్కరణలు విద్యారంగంలో వినూత్న, ఉన్నత ప్రమాణాలకు బాటలు వేస్తాయి. పాఠశాల స్థాయి, ఉన్నత విద్యాస్థాయిలో ఈ కార్యక్రమాలు అద్భుతంగా అమలు చేయడం ముదావహం. విద్యారంగంపై ఇంత చిత్తశుద్ధితో పనిచేసే సమర్థత గల నాయకుడు ఉండటం గొప్పవిషయం. విద్యాభివృద్ధి పథకాలను రూపొందించడం, వాటిని సమర్థంగా అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగతంగా ఎంతో చిత్తశుద్ధితో కృషి చేయడం ప్రశంసనీయం. నూతన విద్యావిధానంలో సూచించిన మేరకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ అనేక మంచి ఆలోచనలతో కార్యక్రమాలు అమలు చేయడం, అందుకు తగ్గ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇది నాలెడ్జి సొసైటీని మరింతగా ప్రోత్సహిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించగలుగుతుంది. జాతీయ విద్యావిధానం అమలు పరిచే దిశలో ఏపీ అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉంది’ అని ప్రశంసించారు. విద్యారంగానికి రూ.30 వేల కోట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏటా రూ.30 వేల కోట్ల బడ్జెట్‌ను విద్యా రంగానికి కేటాయిస్తున్నామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సారథ్యంలో వినూత్న సంస్కరణలు చేపట్టి విద్యా వ్యవస్థను పటిష్ట పరుస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీఎస్ రావు మాట్లాడుతూ ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రొ వైస్ చాన్సలర్ డి. నారాయణరావు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయలక్ష్మి సక్సేనా, ఎస్ఆర్ఎం రిజిస్ట్రార్ వినాయక్ కల్లూరి, డాక్టర్ రఘునాథన్, ప్రొఫెసర్లు డాక్టర్ రంజిత్ తాషా, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ పంకజ్ పాఠక్, రవ్వా మహేశ్, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, పరిశోధనా రంగ నిపుణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. -
బిగ్‌బాస్ 3.. కంటెస్టెంట్స్ ఎవరంటే?
పెరంబూరు: బిగ్‌బాస్ రియలిటీ గేమ్ షో. ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్న విషయం ఇది. కారణం ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వ్యాఖ్యాత కావడం ఒక అంశం. ఇందులో పాల్గొన్న పోటీదారులు విపరీతంగా పాపులారిటీని తెచ్చుకోవడం, తద్వారా చిత్ర పరిశ్రమలో క్రేజ్ తెచ్చుకోవడం, అవకాశాలు వరించడం వంటివి ముఖ్య అంశాలు. బాలీవుడ్ నుంచి దక్షిణాదికి పాకిన ఈ రియాలిటీ గేమ్ షో తొలిసారిగా 2017లో ప్రారంభం అయ్యింది. విజయ్ టీవీలో ప్రసారం అయ్యే ఈ రియాలిటీ గేమ్ షోకు ప్రేక్షకుల ఆదరణతో విపరీతమైన రేటింగ్ వచ్చింది. ఈ గేమ్‌షోలో 15 మంది సభ్యులు పాల్గొంటారు. వీరికి బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఒకే చోట కలిసి మెలిసి ఉండాలి. ఎవరి పనులు వారే చేసుకుంటూ వంద రోజులు గడపాలి. అలా గడిపిన వారిలో వారి నడతను బట్టి విన్నర్ ఎంపిక ఉంటుంది. అలా గెలిచిన వారికి లక్షల్లో ప్రైజ్‌మనీ ఉంటుంది. అలా 2017, 2018ల్లో నిర్వహించిన ఈ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సూపర్‌హిట్ అవ్వడంతో తాజాగా మూడో సిరీస్‌కు ఏర్పాట్లు రెడీ అయ్యాయి. బిగ్‌బాస్ 3కి నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడం విశేషం. ఎందుకంటే ఇదే బిగ్‌బాస్ రియాలిటీ షోను తెలుగులోనూ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ఒక్కో ఏడాదికి ఒక్కో నటుడు వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నారు. కాగా తమిళంలో బిగ్‌బాస్–3 ప్రసారానికి సమయం దగ్గర పడింది. రేపే అంటే ఆదివారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఇక అసలు విషయానికి వస్తే గత రెండు రియాలిటీ షోల కంటే ఈ సారి ప్రముఖ నటీనటులు ఈ గేమ్ షోలో పాల్గొననున్నారని సమాచారం. ముఖ్యంగా సినిమాల్లో అవకాశం లేని సీనియర్ నటీనటులు ఈ రియాలిటీ షోలో పాల్గొని మళ్లీ సినీ అవకాశాలను పొందాలనుకుంటున్నట్లు టాక్. అయితే ఈ షోలో పాల్గొంటున్న వారిని నిర్వాహకులు ఇప్పటికే ఎంపిక చేశారు. అయితే ఆ వివరాలను రహస్యంగా ఉంచారు. అలాంటిది రియాలిటీ షోలో పాల్గొనేవారు వీరే అంటూ ఒక లిస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అ వివరాలు చూస్తే ఇటీవల తరచూ సినీ, రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్న నటి కస్తూరి, ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సిద్ధహస్తుడైన సీనియర్ నటుడు రాధారవి, నటుడు సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ, నటి విచిత్ర, పూనం బజ్వా, చాందిని, హాస్యనటి మధుమిత, నటుడు మోహన్ వైద్య, శక్తిచరణ్, సంతానబారతీ, శ్రీమాన్, రమేశ్తిలక్, టప్మాష్ మృణాలిని, మోడల్ శ్రీగోపిక, విజయ్ టీవీ రమ్య, గాయకుడు క్రిష్ మొదలగు వారు పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు నటి సాక్షీఅగర్వాల్ పేరు కూడా వినిపించింది. అయితే ఇది అధికారికపూర్వక జాబితా కాదు. అసలు పోటీదారులెవరన్నది రేపు తెలుస్తుంది. -
ఎంజీఆర్ లతను తడిమిన దానికంటే ఘోరంగా ఆడుతున్నారు..
తమిళనాడు, పెరంబూరు: నటి కస్తూరికి దక్షిణ భారత నటీనటుల సంఘం నోటీసులు జారీ చేసింది. నటి కస్తూరి ఇటీవల ప్రతి విషయానికి స్పందిస్తూ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలను పొందుపరుస్తూ వార్తలకెక్కుతోంది. అదే విధంగా ఇటీవల జరిగిన టీ.20 క్రికెట్ క్రీడను తిలకిస్తూ కోల్‌కొత్తా టీమ్ నత్తనడక క్రీడపై ట్విట్టర్లో ఏంటయ్యా పళ్లాండు వాళ్గ చిత్రంలో ఎంజీఆర్ నటి లతను తడిమిన దానికంటే ఘోరంగా ఆడుతున్నారు అని పేర్కొంది. ఇది కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తలు, ఎంజీఆర్ అభిమానులు నటి కస్తూరిని సామాజిక మాధ్యమాల్లో ఏకేస్తున్నారు. ఇక నటి లత కూడా కస్తూరికి సీరియస్‌గా హెచ్చరించారు. ఇలాంటి చీప్ ట్వీట్లతో ప్రచారం పొందాలను చూడడం కంటే మరేదైనా చేసుకోవచ్చుగా అని విమర్శించారు.కాగా నటి కస్తూరి వ్యవహారం గురించి దక్షిణభారత నటీనటులు సంఘం స్పందిస్తూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. అందులో ఎంజీఆర్, నటి లతలపై, ఆమె చేసిన కామెంట్‌కు విరవణ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. నటి కస్తూరి తాను నటి లతపై ఎలాంటి విమర్శలు చేయలేదని, అయినా తన ట్వీట్ ఎవరినైనా బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని మరో ట్వీట్ చేసింది. కాగా నటీనటుల సంఘానికి ఏం వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి. -
అసభ్యంగా మాట్లాడతావా? ఒళ్లు దగ్గర పెట్టుకో..
పెరంబూరు: తనను, ఎంజీఆర్‌ను అసభ్యంగా మాట్లాడతావా? ఒళ్లు దగ్గర పెట్టుకో. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి ఉంటుంది అని సీనియర్ నటి లత, నటి కస్తూరిని హెచ్చరించారు. నటి కస్తూరి ఇటీవల తరచూ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అదేవిధంగా తాజాగా ఎంజీఆర్, లతను కించపరచే విధంగా మాట్లాడింది. ప్రస్తుతం టీ 20 క్రికెట్ క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం చెన్నైలో కోల్కత్తా, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్కత్తా జట్టు మందకొడిగా ఆడుతున్న తీరును ట్విట్టర్లో పేర్కొంటూ ఏంటయ్యా ఇది పళ్లాండు వాళ్గ చిత్రంలో వాద్యియార్ (ఎంజీఆర్) లతను తడిమిన దానికంటే అధికంగా తడుముతున్నారు అని వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేసింది. దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, ఎంజీఆర్ అభిమానులు కస్తూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆమెపై విమర్శల దాడి చేస్తున్నారు. కాగా కస్తూరి ట్వీట్‌పై నటి లత తీవ్రంగానే స్పందించారు. తనను, ఎంజీఆర్‌ను కలుపుతూ అసభ్య వ్యాఖ్యలు చేయడం వేదన కలిగించిందన్నారు. ఇంత అసభ్యంగా ట్వీట్ చేసిన నటి కస్తూరికి అణకువ, నాగరికం అవసరం అని అన్నారు. ఆమె నటించిన దానికంటే ఎక్కువగా తాము నటించలేదని అన్నారు. అప్పటి చిత్రాల్లోని పాటల సన్నివేశాలు ఎంత ఉన్నతంగా ఉండేవన్నది అందరికీ తెలుసన్నారు. నటి కస్తూరి తన ప్రవర్తనను మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని లత హెచ్చరించారు. -
నామం పెట్టారు
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు ఎక్కువగా సంపాదించేసి ట్యాక్స్ ఎగ్గొడతారని అనుకోవడం పొరపాటు. నేనెప్పుడూ నా ట్యాక్స్ ఎగ్గొట్టలేదు’’అన్నారు కస్తూరి. ‘అన్నమయ్య’లో ‘ఏలే ఏలే మరదలా...’ అంటూ నాగార్జునతో స్టెప్పులేసిన కస్తూరి గుర్తుండే ఉంటారు. రీసెంట్గా ట్వీటర్లో ఓ నెటì జన్ ‘మీరు క్రమం తప్పకుండా ట్యాక్స్ పే చేస్తారా అని అడగ్గా– ‘‘కచ్చితంగా పే చేస్తూనే ఉంటాను. నిజానికి నాకే నిర్మాతలు చాలాసార్లు నామం పెట్టారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా షూటింగ్స్ చేస్తూ ఉంటాం. కొన్ని సార్లు సినిమా రిలీజ్ అయ్యాక రెమ్యునరేషన్ ఇస్తాం అంటారు. చివరికి నామం పెడతారు. నాకు చాలా సార్లు జరిగింది. కానీ నేనెప్పుడూ నా ట్యాక్స్ విషయాల్లో నామం పెట్టలేదు’’ అని సమాధానమిచ్చారు కస్తూరి.