
బిగ్‌బాస్ 7వ సీజన్ ఈ మధ్యనే మొదలైంది. గత సీజన్లతో పోలిస్తే ఉల్టా పుల్టా అని అన్నారు గానీ ఏమంత పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు. మరోవైపు తమిళంలోనే ఈ ఆదివారమే కొత్త సీజన్ షూరు అయింది. ఇప్పుడు ఈ షోపైనే సీరియల్ నటి ఓ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్స్ కాస్త శ్రుతిమించారు. అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!)
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలపై నెటిజన్స్ రెచ్చిపోవడం చాలా సాధరణమైపోయింది. కొందరు దీన్ని పట్టించుకోరు. మరికొందరు మాత్రం ఇచ్చిపడే రీతిలో కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా 'గృహలక్ష‍్మీ' సీరియల్ తులసి అదేనండి కస్తూరి శంకర్.. తాజాగా తమిళ 'బిగ్‌బాస్'పై ట్వీట్ చేసింది. 'ఒక ఇంట్లో చాలామందిని ఉంచి వారి ఆర్టిఫిషియల్(కృత్రిమమైన) ఫీలింగ్స్ చూపించే షోను నేను పట్టించుకోను. నా దగ్గర టీవీ లేదు. నాకంతా టైమ్, ఓపిక, ఇంట్రెస్ట్ కూడా లేవు. కుటుంబం, దాని బాధ్యతలు, వర్క్ నాకు ఉన్నాయి. నేను బిగ్ బాస్ చూడటం లేదు' అని రాసుకొచ్చింది.
ఇక దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్.. "డబ్బుల కోసం షోకి వెళ్లావ్ కదా. మళ్లీ ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్?" అని కామెంట్స్ పెడుతున్నారు. ఒక నెటిజన్ శ్రుతిమించి కామెంట్ చేశాడు. "అవునులే, నీకు గంటకు రూ. ఐదు వేలు వస్తాయ్ కదా" అని అసభ్యకర రీతిలో రాసుకొచ్చాడు. దీన్ని ఏ మాత్రం లైట్ తీసుకోకుండా కౌంటర్ ఇచ్చిన కస్తూరి.. "మీ ఇంట్లో వాళ్లు నిన్ను ఇలానే పెంచారా? నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది" అని సీరియస్ అయింది.
(ఇదీ చదవండి: 'దేవర' నుంచి సర్‌ప్రైజ్.. బాహుబలి, పుష్ప రూట్‌లోనే)
No. I don't care. I am not interested in the artificial problems of a bunch of show people.
— Kasturi (@KasthuriShankar) October 3, 2023
I don't have: TV
I don't have: time , patience, interest.
I have : Family, responsibilities, work.#notwatchingboss
Comments
Please login to add a commentAdd a comment