నా అనుమతి లేకుండానే ఆ ఫోటోలు లీక్‌ చేశారు: కస్తూరి | Kasthuri Shankar Comments On Her Old Photos | Sakshi
Sakshi News home page

అలాంటి ఫోటో షూట్‌ ఎందుకు చేశానంటే..:కస్తూరి

Published Sun, Jun 23 2024 5:04 PM | Last Updated on Sun, Jun 23 2024 6:53 PM

Kasthuri Shankar Comments On Her Old Photos

కస్తూరి శంకర్‌.. ఒకప్పుడు హీరోయిన్‌గా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తోంది. తమిళ బిగ్‌బాస్‌ షోలోనూ పార్టిసిపేట్‌ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్‌లో మెరిసింది. 50 ఏళ్లు వయసు దాటినా ఆమె అందం చెక్కు చెదురలేదు. ఇప్పటికీ ఆమె నవ్వులో తెలియని మ్యాజిక్‌ ఉంటుంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫోటో షూట్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

2000 సంవత్సరంలో కస్తూరి ఒక డాక్టర్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యూరప్‌ వెళ్లిపోయింది. ఆ తర్వాత అమెరికాలో కొంత కాలం ఉంది. ఆ సమయంలో రోజుల వ్యవధి ఉన్న తన బాబుతో అమ్మతనాన్ని చాటి చెబుతూ అర్ధనగ్నంగా ఫోటోలు దిగింది. అవి కాస్త నెట్టింట వైరల్‌ కావడంతో కొందురు ఆమెను విమర్శిస్తే.. మరికొందరు అభినందించారు. తాజాగా కస్తూరి ఆ సందర్భం గురించి ఇలా చెప్పుకొచ్చింది.

'ఆ ఫోటో షూట్‌ నేను చేసింది ఇండియా కోసం కాదు.. అమెరికాలో ఒక మ్యాగ్జైన్‌ కోసం ఇచ్చాను. అది భారత్‌లో పబ్లీష్‌ కాకూడదు. కానీ, భారత్‌లో ఉన్న మీడియా వారు సెన్స్‌ లేకుండా ప్రచురించారు. దేశంలో పేరున్న మీడియా సంస్థనే ముందుగా భారత్‌లో ప్రచురించింది. కనీసం నన్ను కూడా అడగలేదు. ఇక్కడ ఉన్న వారికి నేను ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కొంత కాలం తర్వాత ఒక ఆంగ్ల పత్రిక నన్ను సంప్రదించి ప్రచురించుకుంది. అందరూ దొంగతనంగా ఆ ఫోటోలు వేసుకున్నారు. 

భారత కల్చర్‌కు ఆ ఫొటోలు పెద్దగా నచ్చవు. అది అమెరికన్‌ ప్రాజెక్టు. ఒక మహిళ డెలివరీ అయిన తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి. దానిని అవగాహాన కల్పించేందుకే ఆ ప్రాజెక్ట్‌ చేశాను.  మాతృత్వానికి అమెరికా వాళ్లు ఇచ్చే మర్యాద, మనం ఇచ్చే మర్యాద వేరుగా ఉంటుంది. ఆ ఫొటోలు లీక్‌ కావడం నాకు కూడా చాలా బాధగా అనిపించింది. బిడ్డకు పాలిచ్చే ఫొటోలను ఇక్కడి వారు చూసే విధానం వేరుగా ఉంటుంది. కానీ, అది తప్పని తెలుసుకున్నా. 

కానీ, ఎవరూ ఊహించని విధంగా భారత్‌ నుంచి కూడా కొందరు మహిళలు నాకు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. ఎందుకంటే వారు కూడా అమ్మ స్థానం నుంచే వచ్చారు కాబట్టి దాని విలువ తెలుస్తోంది. గ్రామీణ మహిళలు నుంచి కూడా నాకు సపోర్ట్‌ దక్కింది. కొంత కాలం తర్వాత పెళ్లి అయిన పురుషులు కూడా నాకు అండగా నిలిచారు.' అని కస్తూరి తెలిపింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement