బిగ్‌బాస్‌ 3.. కంటెస్టెంట్స్‌ ఎవరంటే? | Kasthuri And Poonam Bajwa May In Tamil Bigg Boss | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ షోలో వీరే?

Published Sat, Jun 22 2019 7:00 AM | Last Updated on Sat, Jun 22 2019 7:00 AM

Kasthuri And Poonam Bajwa May In Tamil Bigg Boss - Sakshi

పెరంబూరు: బిగ్‌బాస్‌ రియలిటీ గేమ్‌ షో. ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్న విషయం ఇది. కారణం ప్రముఖ నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ వ్యాఖ్యాత కావడం ఒక అంశం. ఇందులో పాల్గొన్న పోటీదారులు విపరీతంగా పాపులారిటీని తెచ్చుకోవడం, తద్వారా చిత్ర పరిశ్రమలో క్రేజ్‌ తెచ్చుకోవడం, అవకాశాలు వరించడం వంటివి ముఖ్య అంశాలు. బాలీవుడ్‌ నుంచి దక్షిణాదికి పాకిన ఈ రియాలిటీ గేమ్‌ షో తొలిసారిగా 2017లో ప్రారంభం అయ్యింది. విజయ్‌ టీవీలో ప్రసారం అయ్యే ఈ రియాలిటీ గేమ్‌ షోకు ప్రేక్షకుల ఆదరణతో విపరీతమైన రేటింగ్‌ వచ్చింది. ఈ గేమ్‌షోలో 15 మంది సభ్యులు పాల్గొంటారు. వీరికి బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఒకే చోట కలిసి మెలిసి ఉండాలి. ఎవరి పనులు వారే చేసుకుంటూ వంద రోజులు గడపాలి. అలా గడిపిన వారిలో వారి నడతను బట్టి విన్నర్‌ ఎంపిక ఉంటుంది. అలా గెలిచిన వారికి లక్షల్లో ప్రైజ్‌మనీ ఉంటుంది.

అలా 2017, 2018ల్లో నిర్వహించిన ఈ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో సూపర్‌హిట్‌ అవ్వడంతో తాజాగా మూడో సిరీస్‌కు ఏర్పాట్లు రెడీ అయ్యాయి. బిగ్‌బాస్‌ 3కి నటుడు కమలహాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడం  విశేషం. ఎందుకంటే ఇదే బిగ్‌బాస్‌ రియాలిటీ షోను తెలుగులోనూ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ఒక్కో ఏడాదికి ఒక్కో నటుడు వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నారు. కాగా తమిళంలో బిగ్‌బాస్‌–3 ప్రసారానికి సమయం దగ్గర పడింది. రేపే అంటే ఆదివారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఇక అసలు విషయానికి వస్తే గత రెండు రియాలిటీ షోల కంటే ఈ సారి ప్రముఖ నటీనటులు ఈ గేమ్‌ షోలో పాల్గొననున్నారని సమాచారం. ముఖ్యంగా సినిమాల్లో అవకాశం లేని సీనియర్‌ నటీనటులు ఈ రియాలిటీ షోలో పాల్గొని మళ్లీ సినీ అవకాశాలను పొందాలనుకుంటున్నట్లు టాక్‌. అయితే ఈ షోలో పాల్గొంటున్న వారిని నిర్వాహకులు ఇప్పటికే ఎంపిక చేశారు. 

అయితే ఆ వివరాలను రహస్యంగా ఉంచారు. అలాంటిది రియాలిటీ షోలో పాల్గొనేవారు వీరే అంటూ ఒక లిస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అ వివరాలు చూస్తే ఇటీవల తరచూ సినీ, రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్న నటి కస్తూరి, ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సిద్ధహస్తుడైన సీనియర్‌ నటుడు రాధారవి, నటుడు సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ, నటి విచిత్ర, పూనం బజ్వా, చాందిని, హాస్యనటి మధుమిత, నటుడు మోహన్‌ వైద్య, శక్తిచరణ్, సంతానబారతీ, శ్రీమాన్, రమేశ్‌తిలక్, టప్‌మాష్‌ మృణాలిని, మోడల్‌ శ్రీగోపిక, విజయ్‌ టీవీ రమ్య, గాయకుడు క్రిష్‌ మొదలగు వారు పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు నటి సాక్షీఅగర్వాల్‌ పేరు కూడా వినిపించింది. అయితే ఇది అధికారికపూర్వక జాబితా కాదు. అసలు పోటీదారులెవరన్నది రేపు తెలుస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement