పెళ్లి తర్వాత డిఫరెంట్ కాన్సెప్టులకే ఓటేస్తోంది హన్సిక. అలా ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్, హారర్ మూవీ 105 మినిట్స్. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమాను బొమ్మక్ శివ నిర్మించారు. ఈ మూవీ అంతా హన్సిక పాత్ర ఒక్కటే ఉండటం విశేషం. ఇందులో 34 నిమిషాల షాట్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేసింది. అలా ఎన్నో పెద్ద సన్నివేశాల్లో కట్ చెప్పకుండా అలవోకగా నటించేసింది.
రెండు నెలల తర్వాత ఓటీటీలో
ఈ హారర్ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలవగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రెండు నెలల తర్వాత 105 మినిట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. వంద రూపాయలు కడితేనే ఈ సినిమా చూడొచ్చని కండీషన్ పెట్టింది.
కథేంటంటే..
జాను (హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది. మార్గమధ్యంలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. భయంగా ఇంటికి చేరగానే భారీ వర్షం కారణంగా కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే ఏవేవో భయంకర శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన శక్తి.. ఇంట్లోకి వచ్చి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలు పెడుతుంది. తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే అనుభవించంటూ మేల్ వాయిస్‌తో భయపెడుతుంది. ఆ అదృశ్య శక్తి మరణానికి, జానుకు సంబంధం ఏంటి? ఆ శక్తి నుంచి జాను తప్పించుకుందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!
చదవండి: చిరంజీవి, మోహన్‌బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని..
Comments
Please login to add a commentAdd a comment