105 MINUTES Movie
-
మరో ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్టార్ హీరోయిన్ హన్సిక నటించిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ 105 మినిట్స్. ఓకే ఒక్క పాత్రతో సింగిల్ షాట్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను కేవలం ఆరు రోజుల్లోనే పూర్తి చేశారు. హన్సిక ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్రయోగాత్మక సినిమాని రాజు దుస్సా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ హారర్ థ్రిల్లర్ జనవరిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 7 నుంచి ఆహాలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా వెల్లడించింది. Aa Bhayam venukunna Karanam evaru? aa mystery venkunna main person evaru ?Uncover the Fear and Mystery this June 7 on Aha #105MinutesOnAha @ihansika pic.twitter.com/HB1jfqbRYs— ahavideoin (@ahavideoIN) June 5, 2024 -
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం
పెళ్లి తర్వాత డిఫరెంట్ కాన్సెప్టులకే ఓటేస్తోంది హన్సిక. అలా ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్, హారర్ మూవీ 105 మినిట్స్. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమాను బొమ్మక్ శివ నిర్మించారు. ఈ మూవీ అంతా హన్సిక పాత్ర ఒక్కటే ఉండటం విశేషం. ఇందులో 34 నిమిషాల షాట్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేసింది. అలా ఎన్నో పెద్ద సన్నివేశాల్లో కట్ చెప్పకుండా అలవోకగా నటించేసింది. రెండు నెలల తర్వాత ఓటీటీలో ఈ హారర్ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలవగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రెండు నెలల తర్వాత 105 మినిట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. వంద రూపాయలు కడితేనే ఈ సినిమా చూడొచ్చని కండీషన్ పెట్టింది. కథేంటంటే.. జాను (హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది. మార్గమధ్యంలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. భయంగా ఇంటికి చేరగానే భారీ వర్షం కారణంగా కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే ఏవేవో భయంకర శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన శక్తి.. ఇంట్లోకి వచ్చి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలు పెడుతుంది. తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే అనుభవించంటూ మేల్ వాయిస్‌తో భయపెడుతుంది. ఆ అదృశ్య శక్తి మరణానికి, జానుకు సంబంధం ఏంటి? ఆ శక్తి నుంచి జాను తప్పించుకుందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: చిరంజీవి, మోహన్‌బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని.. -
105 Minutes Movie Review: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: 105 మినిట్స్ నటీనటులు:హన్సిక నిర్మాత: బొమ్మక్ శివ దర్శకుడు: రాజుదుస్సా సంగీతం: సామ్ సి. ఎస్ సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిదాపు విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే.. ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. జాను(హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆందోళన చెందిన జాను..భయం భయంతో ఇంట్లోకి వెళ్తుంది. భారీ వర్షం కారణంగా ఇంట్లో కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే కొన్ని భయానక శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన అదృశ్య శక్తి .. ఇంట్లోకి వచ్చి ఇనుప గొలుసుతో జానును బంధించి చిత్ర హింసలు పెడుతుంది.మేల్ వాయిస్‌లో మధ్య మధ్యలో తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే ఇదంతా అనుభవించాలంటూ భయపెడతుంది. ఇంట్లో నుంచి పారిపోయేందుకు జాను ప్రయత్నించినా.. ఆ అదృశ్య శక్తి బయటకు పోనివ్వదు. మరి జాను ఆ అదృశ్య శక్తి నుంచి ఎలా బయటపడుతుంది? ఆ మేల్ వాయిస్ ఎవరిది? తన మరణానికి జాను ఏ విధంగా కారణమైంది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక సినిమా తీయాలంటే నటీనటులు ఎంతో కీలకం. చాలా పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకు డైలాగ్స్ ఉండాలి. పాటలు, కామెడీ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు దర్శకుడు రాజుదుస్సా. ఇలాంటి ప్రయోగం చేసిన దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే. అయితే ఒక్క క్యారెక్టర్‌తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టాలంటే.. బలమైన కథ, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. లేదంటే ప్రేక్షకుడు ఒక్క పాత్రనే చూస్తూ కుర్చిలో కూర్చోలేడు. 105 మినిట్స్‌లో అది మిస్సయింది. కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఒక కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా కథ. చాలా ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. భారీ వర్షం.. ఉరుములు మెరుపులు.. కారులో హీరోయిన్.. సడెన్‌గా ఓ అదృశ్య శక్తి ప్రత్యేక్షం అవ్వడం.. ఇలాంటి భయపెట్టే సన్నివేశాలన్నీ ప్రారంభంలోనే చూపించాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథ ముందుకు సాగదు. జాను కాళ్లకు కట్టిన సంకెళ్లను విడిపించేందుకు ప్రయత్నించడం.. అదృశ్య శక్తి దాన్ని అడ్డుకోవడం.. ఇంటర్వెల్ వరకు ఇదే సీన్ రిపీట్ అవుతుంటుంది. సినిమా మొత్తం హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆత్మ బెదిరించడం.. హీరోయిన్ అక్కడ నుంచి వేరే చోటుకి మారిపోవడం ఇదే జరుగుతుంది. అసలు ఆ ఆత్మ ఎందుకు జానుని వేధిస్తుందో అనేది కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉండడు. హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది? ఆ ఆత్మ నేపథ్యం ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తే బాగుండేది. చివర్లో ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుడే కథను అర్థం చేసుకునేలా చేశారు. సింగిల్ షాట్ మూవీ కాబట్టి ఇతర పాత్రలు, ఎలిమెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉండడు. ఉన్న ఒక్క పాత్ర చుట్టు అయినా ఆసక్తికరమైన సన్నివేశాలు రాస్తే బాగుండేది. కానీ పలు సవాళ్ల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రయోగం అయితే బాగుంది కానీ..అది మాత్ర పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. జాను పాత్రకు హన్సిక పూర్తి న్యాయం చేసింది. ఆమెకు ఇది ఒక డిఫరెంట్ మూవీ. తొలిసారి ఇలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించింది. అయితే అయితే కథలో బలం లేనప్పుడు నటీనటులు ఎంత చక్కటి నటనను కనబర్చిన అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సాకేంతిక పరంగా సినిమా బాగుంది. సామ్ సి. ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కథలో బలం లేకున్నా.. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Bommak Siva: సినిమా అంతా ఒకటే పాత్ర ఉంటుంది
‘‘105 మినిట్స్’ మంచి ప్రయోగాత్మక చిత్రం. సినిమా మొత్తం ఒకటే పాత్ర ఉంటుంది. కానీ, ఇంకో వాయిస్ వినిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ బాలీవుడ్ నటుడి మాటలు వినిపిస్తుంటాయి’’ అని నిర్మాత బొమ్మక్ శివ అన్నారు. హీరోయిన్ హన్సిక లీడ్ రోల్లో రాజు దుస్సా దర్శకత్వం వహించిన చిత్రం ‘105 మినిట్స్’. బొమ్మక్ శివ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. బొమ్మక్ శివ మాట్లాడుతూ– ‘‘నాకు రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్స్ బిజినెస్‌లు ఉన్నాయి. సినిమాపై ఫ్యాషన్‌తో మొదటి ్రపాజెక్టుగా ‘105’ మూవీ తీశాను. రాజు దుస్సా చక్కగా తీశాడు. హన్సికను ఈ మూవీలో కొత్తగా చూస్తారు. మైత్రీ మూవీస్ సంస్థ మా సినిమాని రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
ఏం జరుగుతుందో ఊహించలేరు
‘‘పాటలు, ఫైట్స్, కామెడీ... ఇవేం లేకుండా ఓ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘105 మినిట్స్’. స్క్రీన్‌ప్లేను బేస్ చేసుకుని తీసిన ఈ చిత్రం ఆడియన్స్‌ను మెప్పిస్తుంది’’ అన్నారు దర్శకుడు రాజు దుస్సా. హన్సిక లీడ్ రోల్లో రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం ‘105 మినిట్స్’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకర్ల సమావేశంలో రాజు దుస్సా మాట్లాడుతూ– ‘‘ముందు బాలీవుడ్లో రైటర్‌గా చేశాను. సొంతంగా కథలు రాసుకుని, దర్శకత్వ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ‘105’ మినిట్స్ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ వచ్చింది. సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్ ఇది. ఓ నీడ మాత్రం కనిపిస్తుంది. కనిపించని మనిషి ఒకరు పంచభూతాలను కంట్రోల్ చేస్తూ, ఓ అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా థీమ్. సాధారణంగా కొన్ని సినిమాల్లో నెక్ట్స్ ఏం జరుగుతుంది? అని ప్రేక్షకులు ఊహిస్తుంటారు. చాలెంజ్ చేసి చెబుతున్నాను.. మా సినిమాలో నెక్ట్స్ ఏం జరుగుతుందో కూడా ఊహించలేరు’’ అని చెప్పుకొచ్చారు. -
105 మినిట్స్ మూవీ ట్రైలర్
-
‘105 మినిట్స్’ .. ఓ ప్రయోగం: హన్సిక
‘‘ముప్పై నాలుగు నిమిషాల షాట్‌ని ‘105 మినిట్స్’ సినిమా కోసం సింగిల్ టేక్‌లో చేయడం అనేది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. దాదాపు ఎనిమిది రోజుల రిహార్సల్స్ తర్వాత ఈ షాట్ చేశాం. ఇలాంటి ప్రయోగాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి’’ అని హన్సిక అన్నారు. హన్సిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘105 మినిట్స్’. రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హన్సిక మాట్లాడుతూ – ‘‘పూర్తి స్థాయి ప్రయోగాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులు థియేటర్స్‌లో మా సినిమాను చూసి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సింగిల్ సిట్టింగ్‌లోనే హన్సికగారు ఈ సినిమా కథ ఒప్పుకున్నారు’’ అన్నారు రాజు దుస్సా. ‘‘ఈ సినిమాను ముందు ప్రపంచవ్యాప్తంగా తెలుగులో విడుదల చేస్తాం. ఆ తర్వాత ఇతర భాషల్లో విడుదల చేస్తాం’’ అన్నారు సహనిర్మాత సుమన్.