‘105 మినిట్స్‌’ .. ఓ ప్రయోగం: హన్సిక | Hansika Talk About 105 Minutes Movie | Sakshi
Sakshi News home page

‘105 మినిట్స్‌’ .. ఓ ప్రయోగం: హన్సిక

Published Sat, Jan 20 2024 10:15 AM | Last Updated on Sat, Jan 20 2024 10:47 AM

Hansika Talk About 105 Minutes Movie - Sakshi

‘‘ముప్పై నాలుగు నిమిషాల షాట్‌ని ‘105 మినిట్స్‌’ సినిమా కోసం సింగిల్‌ టేక్‌లో చేయడం అనేది నాకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌. దాదాపు ఎనిమిది రోజుల రిహార్సల్స్‌ తర్వాత ఈ షాట్‌ చేశాం. ఇలాంటి ప్రయోగాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి’’ అని హన్సిక అన్నారు. హన్సిక లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘105 మినిట్స్‌’. రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్‌ శివ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హన్సిక మాట్లాడుతూ – ‘‘పూర్తి స్థాయి ప్రయోగాత్మక చిత్రం ఇది.  ప్రేక్షకులు థియేటర్స్‌లో మా సినిమాను చూసి, సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సింగిల్‌ సిట్టింగ్‌లోనే హన్సికగారు ఈ సినిమా కథ ఒప్పుకున్నారు’’ అన్నారు రాజు దుస్సా. ‘‘ఈ సినిమాను ముందు ప్రపంచవ్యాప్తంగా తెలుగులో విడుదల చేస్తాం. ఆ తర్వాత ఇతర భాషల్లో విడుదల చేస్తాం’’ అన్నారు సహనిర్మాత సుమన్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement