
హన్సిక పెళ్లి సందడి 'లవ్ షాదీ డ్రామా' పేరుతో హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే రెండు ఎపిసోడ్లు రిలీజవగా అందులో హల్దీ, మెహందీ ప్లానింగ్‌ను చూపించారు. తాజాగా రిలీజైన మూడో ఎపిసోడ్‌లో హన్సిక, సోహైల్ డ్రెస్సింగ్ సెలక్షన్‌ను, మంగళసూత్రం ఎంపికను చూపించారు. ఇరు కుటుంబాలు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పెళ్లి వేడుకలను షురూ చేశారు. పూజ అనంతరం హన్సిక జంట డ్యాన్సులతో హడావుడి చేసింది.
మరోవైపు కన్యాదాయం చేయనని తల్లి చెప్పడంతో భావోద్వేగానికి లోనైంది హీరోయిన్. ఒకరికి దానమివ్వడానికి నువ్వేం ఒక వస్తువు కాదని, కన్యాదానానికి బదులుగా గోదానం చేస్తానంది. 30 సంవత్సరాలు గుండెలకు హత్తుకుని పెంచుకున్న కూతురిని ఎవరికైనా దానమిచ్చేయాలంటే ఎలా మనసొప్పుతుంది, నువ్వు ఎప్పటికీ పరాయిదానివి కాదు అంటూ ఎమోషనలైంది ఆమె తల్లి. ఆ మాటలు విని హన్సిక కన్నీటిపర్యంతమైంది. నీకింత మంచి ఆలోచన వచ్చినందుకు గర్వంగా ఉంది. నువ్వు కన్యాదానం చేసినా చేయకపోయినా ఈ కన్య నీతోనే ఉంటుంది అంటూ ఏడ్చేసింది హీరోయిన్.
Comments
Please login to add a commentAdd a comment