
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలే వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లిని ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే హన్సిక ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది ఈ జంట. హన్సికన తన పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో రిలీజ్ చేయనుంది.
ట్రైలర్ చూస్తే కతురియాతో పెళ్లికి ప్రపోజ్ చేసినప్పుడు ఇన్ని రోజులు తన చుట్టే తిరిగిన ఇతనేనా లైఫ్ పార్టనర్ అని అనిపించిందని హన్సిక అన్నారు. తాను చాలా ఎమోషనల్ పర్సన్ అంటూ ట్రైలర్‌లో చెప్పుకొచ్చారు. అలాగే సోహెల్‌ను పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో హన్సిక చేసిన పోరాటం ఏంటో ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. హన్సిక జీవితంలో ఈ ఎమోషనల్ జర్నీని లవ్ షాదీ డ్రామా పేరుతో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment