నా భర్త విడాకులకు కారణం నేను కాదు: హన్సిక ఎమోషనల్ | Actress Hansika Motwani Wedding Ceremony Streaming In OTT | Sakshi
Sakshi News home page

Hansika Motwani: ఆ వార్తలు చూసి ఏడ్చేశా: హన్సిక

Feb 10 2023 9:24 PM | Updated on Feb 10 2023 9:56 PM

Actress Hansika Motwani Wedding Ceremony Streaming In OTT - Sakshi

డిసెంబర్‌ 4, 2022న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన బ్యూటీ హన్సిక మోత్వాని. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన సోహైల్‌ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే తాజాగా వీరి ప్రేమ పెళ్లిని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హన్సిక తన పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో రిలీజ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీత్ చేసింది.

అయితే హన్సిక పెళ్లికి ముందు జరిగిన అనుభవాలను లవ్‌ షాదీ డ్రామాలో వెల్లడించింది. సోహైల్‌ను పెళ్లి చేసుకునే వరకు అత్యంత సీక్రెట్‌గా ఉండేందకు ప్రయత్నించినట్లు తెలిపింది హన్సిక. కానీ మీడియాకు ఎలా లీకవుతున్నాయో అని తీవ్ర అసహనానికి గురైంది. ఇంకా తన జీవితంలో హన్సిక తల్లి ఆమెకు అన్ని విధాలా వెన్నెముకలా నిలిచిందని చెప్పుకొచ్చింది బ్యూటీ. అయితే పెళ్లికి కొన్నిరోజుల ముందే సోహైల్‌కు గతంలోనే వివాహమైందని, అతడు తన భార్య నుంచి విడిపోవడానికి తానే కారణమని ఎన్నో వార్తలు బయటకు వచ్చిన విషయాన్ని హన్సిక ఈ వీడియోలో ప్రస్తావించింది. తన పెళ్లికి ముందు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 

హన్సిక మాట్లాడుతూ.. 'నా పెళ్లి అయ్యే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా. నాకు తెలియకుండానే పెళ్లి వార్తలు బయటకొచ్చాయి. అది నాకు నచ్చలేదు. ఒక సెలబ్రిటీగా నేను చెల్లించుకుంటున్న మూల్యం. సోహైల్‌ గురించి రాసినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా. అలాంటి టైంలో అమ్మ, నా సోదరుడి సలహాతో ఫస్ట్ టైం మా ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశా. సోహైల్‌ పారిస్‌లో ప్రపోజ్‌ చేసిన ఫొటోలు చూసి అందరూ కంగ్రాట్స్ అన్నారు. అప్పుడు నాకెంతో ఆనందంగా అనిపించింది. అన్ని ఓకే అనుకున్నాక తిరిగి షూటింగ్స్‌ కోసం చెన్నై వెళ్లా. అప్పుడే సోహైల్‌కు గతంలోనే పెళ్లి అయ్యిందని వార్తలొచ్చాయి. ఆ పెళ్లిలో నేను పాల్గొన్న ఫొటోలు షేర్‌ చేస్తూ.. సోహైల్‌ తన భార్య నుంచి విడిపోవడానికి నేనే కారణమని రాశారు. నిజంగా ఆతని గతం నాకు తెలుసు. కానీ.. విడాకులతో నాకు సంబంధం లేదు' అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న లవ్‌ షాదీ డ్రామాలో హన్సిక పెళ్లికి ముందు సంఘటనలను చూపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement