Hansika Dating Simbhu To Personal Photos Leaked, Know Hansika Controversies - Sakshi
Sakshi News home page

Hansika Motwani Controversies: శింబుతో డేటింగ్.. హన్సిక ప్రైవేట్ ఫోటోలు లీక్..!

Published Fri, Nov 4 2022 9:33 PM | Last Updated on Sat, Nov 5 2022 11:36 AM

Hansika Motwani Dating With Simbhu Photos Leaked In Online - Sakshi

దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్‌ను దక్కించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైకి చెందిన సోహెల్‌ ఖతురియాతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ డిసెంబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌లో వద్ద దిగిన ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా అనుష్క శెట్టి, ఖుష్బు సుందర్‌తో పాటు పరిశ్రమకు చెందిన పలువురు ఆర్టిస్టులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

కానీ నటీనటులు ఏదో ఒక రూమర్లు రావడం సహజం. గతంలో హన్సిక మోత్వాని కోలీవుడ్ హీరో శింబుతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. గతంలో హన్సిక మోత్వాని తన రిలేషన్‌షిప్ గురించి ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఆమె తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ.. 'నా వ్యక్తిగత జీవితం గురించి చాలా పుకార్లు వింటున్నా. కానీ నాకు స్పష్టత ఉంది. అందుకే నేను వాటి మాట్లాడటానికి ఇష్టపడను.' అంటూ పోస్ట్  చేశారు. 

(చదవండి:హన్సిక పెళ్లాడబోయే వ్యక్తి‍కి ఇదివరకే పెళ్లయిందా?)

గతంలో శింబు ఇలా వ్రాశాడు. 'అవును. నేను హన్సికతో డేటింగ్‌లో ఉన్నాను. త్వరలోనే మా పెళ్లిని మా కుటుంబం నిర్ణయిస్తుంది. మీరు మా గోప్యతను గౌరవిస్తారని ఆశిస్తున్నా. హన్సిక మోత్వానిని పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని ఉండాలనుకుంటున్నా. నా తల్లిదండ్రుల అనుమతితో, నేను హన్సిక మోత్వానిని పెళ్లి చేసుకుంటా. అజిత్, షాలిని లాగా మేమిద్దరం సంతోషంగా జీవితాన్ని గడుపుతాము.' అని ఓ ఇంటర్వ్యూలో శింబు తెలిపారు. 

(చదవండి: రిషబ్‌ శెట్టిని కలిసిన లెజెండ్ క్రికెటర్.. సోషల్ మీడియాలో వైరల్)

హన్సిక, శింబు తమ రిలేషన్ గురించి 2013లో అధికారికంగా ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చినా ఆ తర్వాత ఈ జంట విడిపోయినట్లు ప్రకటించారు. వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాన్ని ఎవరూ వెల్లడించలేదు. హన్సిక తన కెరీర్‌లో ఓ వివాదాన్ని ఎదుర్కొన్నారు. 2019లో ఆన్‌లైన్ హ్యాకింగ్‌కు గురయ్యారు.  హన్సిక మోత్వాని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. కానీ ఆ చిత్రాలు వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement