
హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హన్సిక చెప్పింది. దీంతో హన్సికకు కాబోయే భర్త ఎవరు? ఎలా ఉంటాడు? అనేది అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా తనకు కాబోయే భర్తను ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది హన్సిక.
ఈఫిల్ టవర్(పారిస్)వద్ద అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ .. ‘ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్సిక షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అందులో అతను హన్సికకు ప్రపోజ్ చేయగా.. అందుకు ఆమె అంగీకారం తెలుపుతూ హగ్ చేసుకుంది.ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఈ కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హన్సిక పెళ్లి రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లోని ప్రాచీన ప్యాలెస్‌లో డిసెంబర్ 4న జరగనుంది. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment