Hansika Motwani Spend Huge Amount For Her Wedding - Sakshi
Sakshi News home page

Hansika Motwani: బాప్‌ రే.. హన్సిక పెళ్లి ఖర్చు అన్ని కోట్లా?

Dec 11 2022 1:31 PM | Updated on Dec 11 2022 2:27 PM

Hansika Motwani Spend Huge Amount For Her Wedding - Sakshi

‘దేశముదురు’ ఫేం హన్సిక మోత్వాని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కతూరియాతో డిసెంబర్‌ 4న హన్సిక పెళ్లి ఘనంగా జరిగింది.జైపూర్‌లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.

బ్యాచిలర్‌ పార్టీ, మెహందీ, హల్డీ, ప్రీవెడ్డింగ్‌, పెళ్లి.. ఇలా ఏ విషయంలో  కూడా తగ్గేదే లే అన్నట్లుగా హన్సిక ఖర్చి చేసిందట. ఇప్పుడు హన్సిక పెళ్లి ఖర్చు నెట్టింట వైరల్‌ అవుతోంది.

బ్యాచిలర్‌ పార్టీ మొదలు పెళ్లి వరకు దాదాపు రూ.20 కోట్ల వరకు హన్సిక ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో పెళ్లి దుస్తులకు కూడా ఎక్కువే ఖర్చు చేశారట. సూఫీ రాత్రి కోసం హన్సిక ధరించిన గోల్డెన్‌ లెహంగా ఒక్కటే దాదాపు రూ.3 లక్షల వరకు ఉంటుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. హాన్సికా పెళ్లి మాత్రం ఘనంగా జరిగింది అనేది వాస్తవం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement