నెల రోజులకే ఓటీటీ రానున్న స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్ల‌ర్! | Hansuika Motwani My Name is Shruthi Movie OTT Release Date Goes Viral | Sakshi
Sakshi News home page

ఓటీటీకి మై నేమ్ ఈజ్ శృతి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Sun, Dec 10 2023 1:52 PM | Last Updated on Sun, Dec 10 2023 3:07 PM

Hansuika Motwani My Name is Shruthi Movie OTT Release Date Goes Viral - Sakshi

గతేడాది ప్రియుడిని పెళ్లాడిన దేశముదురు ఫేమ్ హన్సిక మోత్వానీ ఇటీవలే మొదటి వివాహా వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త సోహెల్ కతూరియాతో కలిసి కేక్‌ కట్‌ చేసింది. అయితే పెళ్లయ్యాక పెద్దగా సినిమాల్లో కనిపించని హన్సిక.. ఇటీవలే  మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీతో దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లో కనిపించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

(ఇది చదవండి: ముంబైలో లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. రామ్ చరణ్ ఆస్తులెంతో తెలుసా?)

స్కిన్ మాఫియా అనే కొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతస్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్‌పై క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈనెల 17 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.  అయితే రిలీజ్ తేదీ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజే స్ట్రీమింగ్‌కు వస్తే రిలీజైన నెల రోజులకే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రంలో ముర‌ళీశ‌ర్మ‌, న‌రేన్‌, పూజా రామ‌చంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. 

(ఇది చదవండి: బండ్ల గణేష్‌ డబ్బులు ఎగ్గొట్టాడు.. ఒక మనిషి చెప్పడంతో..: డైరెక్టర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement