My Name Is Shruti Movie
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శుక్రవారమైతే చాలు ఓటీటీల్లోకి బోలెడన్ని మూవీస్ వచ్చేస్తుంటాయి. భారతీయ భాషా చిత్రాలతో పాటు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ప్రతివారం వీటి కోసం ఎదురుచూసే మూవీ లవర్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ తెలుగు థ్రిల్లర్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: హీరోగా పల్లవి ప్రశాంత్.. లీక్ చేసిన సింగర్ భోలె) హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. 'దేశముదురు' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది గానీ కలిసి రాలేదు. దీంతో తమిళంలో వరస మూవీస్ చేస్తూ అక్కడే సెటిలైపోయింది. ఈ బ్యూటీ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత 'మై నేమ్ ఈజ్ శృతి' అనే తెలుగు సినిమా చేయగా, నవంబరు 17న ఇది థియేటర్లలో రిలీజైంది. అయితే హన్సిక ఫెర్ఫార్మెన్స్ బాగుందని పేరొచ్చినప్పటికీ.. సినిమా సరిగా ఆడలేదు. ఇప్పుడు దాదాపు నెలన్నర తర్వాత సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసే శృతి(హన్సిక).. స్కిన్ మాఫియా వలలో ఎలా పడింది? ఆ మాఫియాను ఎదుర్కొని ఆమె ఎలాంటి పోరాటాన్ని సాగించిందన్నదే ఈ సినిమా కథ. ఈ వీకెండ్ ఏదైనా థ్రిల్లర్ చూడాలనుకుంటే దీన్ని ట్రై చేసేయండి. (ఇదీ చదవండి: విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!) -
నెల రోజులకే ఓటీటీ రానున్న స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్!
గతేడాది ప్రియుడిని పెళ్లాడిన దేశముదురు ఫేమ్ హన్సిక మోత్వానీ ఇటీవలే మొదటి వివాహా వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త సోహెల్ కతూరియాతో కలిసి కేక్ కట్ చేసింది. అయితే పెళ్లయ్యాక పెద్దగా సినిమాల్లో కనిపించని హన్సిక.. ఇటీవలే మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీతో దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్లో కనిపించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ఇది చదవండి: ముంబైలో లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. రామ్ చరణ్ ఆస్తులెంతో తెలుసా?) స్కిన్ మాఫియా అనే కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతస్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్‌పై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈనెల 17 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ తేదీ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజే స్ట్రీమింగ్కు వస్తే రిలీజైన నెల రోజులకే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీశర్మ, నరేన్, పూజా రామచంద్రన్ కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: బండ్ల గణేష్ డబ్బులు ఎగ్గొట్టాడు.. ఒక మనిషి చెప్పడంతో..: డైరెక్టర్) -
నా సినిమా సక్సెస్.. కష్టమంతా మరిచిపోయా: హన్సిక
బబ్లీ బ్యూటీ హన్సిక ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా 'మై నేమ్ ఈజ్ శృతి'. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించగా, బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. స్కిన్ మాఫియా కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించారు. హన్సిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం నిర్మాత, దర్శకుడు ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. ఇది జెన్యూన్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. టాక్, రేటింగ్స్.. మేం పడిన కష్టమంతా మరిచిపోయేలా చేశాయి. ఇలాంటి మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడితో వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది అని హన్సిక చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) -
‘మై నేమ్ ఈజ్ శృతి’ మూవీ రివ్యూ
టైటిల్: మై నేమ్ ఈజ్ శృతి నటీనటులు:హన్సిక, ఆడుక్కాలమ్ నరేన్, రాజా రవీంద్ర, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, తదితరులు నిర్మాత:బురుగు రమ్య ప్రభాకర్ దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్ సంగీతం: మార్క్ కె రాబిన్ ఎడిటర్ : చోటా కే ప్రసాద్ విడుదల తేది: నవంబర్ 17, 2023 కథేంటంటే.. శృతి(హన్సిక) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అమ్మ పెంపకంలో పెరిగి పెద్దదవుతుంది. సోషల్ మీడియా ద్వారా చరణ్(సాయి తేజ)తో ప్రేమలో పడుతుంది. అతన్ని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లిన శృతి..అనుకోకుండా స్కిన్ మాఫీయా ముఠా వలలో చిక్కుకుంటుంది. ఆ ముఠా లీడర్, ఎమ్మెల్యే గురుమూర్తి(నరేన్) చేసే అరచకాలన్నీ శృతికి తెలుస్తాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? శృతిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసు అధికారి రంజిత్(మురళీ శర్మ) ఈ కేసును ఎలా విచారించాడు? స్కిన్ మాఫీయా వెనుక ఉన్నదెవరు? ఎమ్మెల్యే గురుమూర్తికి, స్కిన్ స్పెషలిస్ట్ కిరణ్మయి(ప్రేమ)కు ఉన్న సంబంధం ఏంటి? స్కిన్ మాఫియా ముఠాను అరికట్టేందుకు శృతి చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కొంతమంది డబ్బు కోసం గుండె, కిడ్నీ లాంటి అవయవాలతో ఎలాంటి వ్యాపారం చేస్తారో చాలా సినిమాల్లో చూశాం. అందం కోసం పిండాలను అమ్మేసే మాఫియా ఉందని ‘యశోద’ చిత్రం ద్వారా తెలుసుకున్నాం. కానీ స్కిన్ డ్రాప్టింగ్ మాఫియా నేపథ్యంలో మాత్రం ఇంతవరకు ఏ సినిమా రాలేదు. ఆ సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే `మై నేమ్ ఈజ్ శృతి`. చర్మంతో కూడా వ్యాపారం చేస్తున్నారనే కొత్త అంశాన్ని ప్రేక్షకులను తెలియజేశాడు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికే.. తెరపై అంతే కొత్తగా చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్కిన్ డ్రాప్టింగ్ అంశంతోనే కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. మర్డర్‌ని రివీల్ చేసి చేసి.. అందులోని ట్విస్ట్‌ను సస్పెన్స్‌లో పెట్టాడు. ముందు, వెనుక అంటూ ఫస్టాఫ్ అంతా సస్పెన్స్‌గానే సాగుతుంది. అయితే ప్రతిసారి కథ ముందుకు, వెనక్కు వెళ్లడంతో ప్రేక్షకుడు పూర్తిగా కథలో లీనం కాలేడు. కానీ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని మాత్రం కొనసాగిస్తూ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగించేలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఫస్టాఫ్‌లోని పలు ప్రశ్నలకు సెకండాఫ్‌లో సమాధానం దొరుకుతుంది. స్కిన్ మాఫియాకి, శృతికి ఉన్న సంబంధం, స్కామ్‌ని బయట పెట్టేందుకు శృతి వేసే ప్లాన్.. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు థ్రిలింగ్‌గా ఉంటాయి. అయితే కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా.. సినిమాటిక్‌గా అనిపిస్తాయి. స్కిన్ మాఫియా గురించి మరింత లోతుగా చర్చించి, స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్‌గా తీసుకెళ్తే బాగుండేది. ఎవరెలా చేశారంటే.. శృతి పాత్రకి హన్సిక న్యాయం చేసింది. అమాయకంగా కనిపిస్తూనే..ముఖంతోనే అనేక భావోద్వేగాలను పలికించి ఆకట్టుకుంది. ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్లలో కూడా ఆకట్టుకుంది. విలన్‌గా పూజా రామచంద్రన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. డబ్బుకోసం ఎంతకైనా తెగించే యువతి పాత్ర తనది. ఇక అలనాటి హీరోయిన్ ప్రేమ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న స్కిన్ స్పెషలిస్ట్ కిరణ్మయి పాత్రలో నటించి, మెప్పించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. నరేన్, మురళీ శర్మ, ప్రవీణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
మై నేమ్ ఈజ్ శృతి ఆలోచింపజేస్తుంది
‘‘ప్రేక్షకులు థ్రిల్లర్ చిత్రాలను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. స్కిన్ (చర్మం) మాఫియా ముప్పును చూపించే డార్క్ థ్రిల్లర్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఈ నేపథ్యంలో ఓ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని హీరోయిన్ హన్సిక మోత్వాని అన్నారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక మోత్వాని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హన్సిక మోత్వాని మాట్లాడుతూ.... ► మా అమ్మ డెర్మటాలజిస్ట్(చర్మ వైద్య నిపుణురాలు). ‘మై నేమ్ ఈజ్ శృతి’ సమయంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. ‘ఇలాంటి ఘటన ఎక్కడో జరిగినట్లు చదివాను’ అని చెప్పింది అమ్మ. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్‌లతో చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ మూవీ థ్రిల్ ఇస్తుంది. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. ►ఈ సినిమాలో నా పాత్ర పేరు శృతి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న శృతి స్కిన్ మాఫియా ట్రాప్‌లో పడుతుంది. ఆ మాఫియా నుంచి తను ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రతి కుటుంబాన్ని ఈ చిత్ర కథ కదిలిస్తుంది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. రమ్యగారు ఈ సినిమాని ఎంతో ఫ్యాషన్‌తో తీశారు. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. ►2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా తర్వాత నేను నటించిన తెలుగు చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. అయితే తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉండటం వల్లే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒక నటిగా సంతృప్తి చెందలేదు.. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నాను. వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపిస్తూ పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు అభినందనలు తెలిపాను. -
స్కిన్ మాఫియాపై హన్సిక సినిమా.. అమ్మ నుంచి అలాంటి రియాక్షన్!
'దేశముదురు' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఆ తర్వాత మన దగ్గర కంటే తమిళంలో యమ క్రేజ్ తెచ్చుకుంది. గతేడాది పెళ్లి చేసుకున్నప్పటికీ పలు భాషల్లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తెలుగు లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మై నేమ్ ఈజ్ శృతి'. నవంబర్ 17న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) థ్రిల్లర్ మూవీస్ చాలా ఎంజాయ్ చేస్తున్నా. స్కిన్ మాఫియా గురించి చెప్పే డార్క్ థ్రిల్లర్ మా సినిమా. ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి మూవీ ఇదే. శృతి అనే అమ్మాయి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంటుంది. అనుకోకుండా ఓ ట్రాప్‌లో పడుతుంది. తనకు తానుగా బెయిల్ తెచ్చుకుంటుందా? లేదా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అలానే మూవీలో శృతికి ఓ భయంకరమైన సమస్య ఎదురవుతుంది? దాని నుండి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్. మా అమ్మ డెర్మటాలజిస్ట్. ఈ సినిమా చేస్తున్నప్పుడు నిజంగానే స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మని అడిగాను. ఎక్కడో ఇలాంటి సంఘటన గురించి చదివానని ఆమె చెప్పింది. ఊహించని ట్విస్ట్‌లతో.. చూస్తున్న ప్రతి ఒక్కరికీ థ్రిల్ ఇస్తుందీ సినిమా. నా కెరీర్ విషయంలో ఎప్పుడూ బాధపడలేదు. అవకాశాలు ఉన్నా, లేకున్నా నేనిప్పుడూ ఇలానే ఉన్నా. నటన పరంగా మాత్రం నేనింకా సంతృప్తి చెందలేదనే చెబుతాను. (ఇదీ చదవండి: హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!) -
'పెళ్లి తర్వాత అదొక్కటే మారింది'.. హన్సిక ఆసక్తికర కామెంట్స్!
దేశముదురు భామ, హీరోయిన్ హన్సిక ప్రస్తుతం మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. పెళ్లి తర్వాత సినిమాలతో బిజీ అయిపోయిన ముద్దుగుమ్మ. ఇటీవలే మై 3 అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమీంగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న గార్డియన్, తెలుగులో నటిస్తున్న మై నేమ్ ఈజ్ శృతీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తన ప్రియుడితో పెళ్లి తర్వాత హన్సిక వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా మై నేమ్ ఈజ్ శృతీ ప్రమోషన్లలో పాల్గొన్న హన్సిక పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లి తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులు ఏం రాలేదని చెప్పుకొచ్చింది. హన్సిక మాట్లాడుతూ.. ' సోహైల్‌తో పెళ్లయ్యాకం నా లైఫ్ పెద్దగా ఏం మారలేదు. సినిమా షూటింగ్ సమయంలో క్యారెక్టర్లో ఉంటాను. ఇంటికెళ్లాక నా భర్తతో ఎక్కువ టైం కేటాయిస్తాను. అలాగే పెళ్లి తర్వాత కేవలం నా అడ్రస్ మాత్రమే మారింది. అంతే తప్ప నా ఇంటి పేరులో ఎలాంటి మార్పులేదు. హన్సిక మోత్వానీ అనే గుర్తింపు కోసం చాలా కష్టపడ్డా. అందుకే ఇంటి పేరును అలాగే ఉంచా.' అంటూ వివరించింది. 'మై నేమ్ ఈజ్ శ్రుతి అనే చిత్రం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రంలో మురళీశర్మ, నరేన్, జయప్రకాష్, సీవీఎల్ నరసింహారావు ముఖ్యపాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. -
నా మనసుకు దగ్గరైన కథ ఇది
హన్సిక టైటిల్ రోల్ చేసిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు శ్రీనివాస్ గౌడ్, దర్శకుడు అశోక్ అతిథులుగా హాజరై, ఈ సినిమా హిట్టవ్వాలన్నారు. హన్సిక మాట్లాడుతూ– ‘‘మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ ఫిల్మ్ ఇది. నా మనసుకు దగ్గరైన కథ. దర్శకుడు శ్రీనివాస్‌గారు ఎంతో కష్టపడ్డారు. ప్రభాకర్‌గారు రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు నన్ను మరోసారి ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘నేను కొత్త దర్శకుడిని అయినా కథను నమ్మి, నన్ను ప్రోత్సహించిన హన్సికగారికి, సపోర్ట్ చేసిన ప్రభాకర్‌గారికి, సహకరించిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. శ్రీనివాస్ ఓంకార్. ‘‘ప్రత్యేక శ్రద్ధతో ఈ సినిమా చేసిన హన్సికకు థ్యాంక్స్’’ అన్నారు ప్రభాకర్. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, ఎడిటర్ చోటా కె ప్రసాద్, కెమెరామేన్ కిశోర్, కో ప్రోడ్యూసర్ బండి పవన్ కుమార్, లైన్ ప్రోడ్యూసర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
చాన్నాళ్లకు తెలుగు మూవీతో రాబోతున్న హన్సిక
దేశముదురు సినిమాతో హీరోయిన్గా తెలుగులోకి హన్సిక ఎంట్రీ ఇచ్చింది. తక్కువ టైంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మెల్లగా ఈమె ఫేమ్ తగ్గిపోయింది. గతేడాది పెళ్లి చేసుకున్న ఈమె ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. అందులో ఒకటి 'మై నేమ్ ఈజ్ శృతి'. ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. త్వరలోనే విడుదల కానుంది. (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!) తాజాగా ఈ సినిమాలోని 'పోరాటం పోరాటం' అనే లిరికల్ పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు.. ఇప్పటివరకు రాని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ మూవీలో ప్రతి సీన్ ఎంతో ఉత్కంఠభరితంగా వుంటుందని, ట్విస్ట్‌లు అందరిని కట్టిపడేస్తాయని అన్నారు. చివరివరకు ఎవరి ఊహకందని కథ ఇదని చెప్పుకొచ్చారు. హన్సిక మాట్లాడుతూ.. శృతి అనే అమ్మాయిగా ఈ సినిమాలో కనిపిస్తా, తన భావాల్ని ధైర్యంగా వెల్లడించే యువతిగా విభిన్నంగా నా పాత్ర ఉంటుంది. ఆద్యంతం మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. కథ వింటున్నప్పుడు, ముగింపు వరకు ఏం జరుగుతుందనేది అస్సలు ఊహించలేకపోయానని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ‘పెదకాపు 1’ మూవీ రివ్యూ) -
మారిందేమో నా రాత!
హీరోయిన్ హన్సిక టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్యా ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత.. తప్పే చేసేలాగా ముప్పే వచ్చే నా వెంట..’ అంటూ సాగే టైటిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించిన ఈ పాటను హారిక నారాయణ ఆలపించారు. మార్క్ రాబిన్ సంగీతం అందించారు. హన్సిక మాట్లాడుతూ– ‘‘మై నేమ్ ఈజ్ శృతి’ లాంటి ఇంటెన్స్ స్టోరీని నేనెప్పుడూ చేయలేదు. సినిమాలోని ట్విస్ట్‌లు ఆశ్చర్యపరుస్తాయి’’ అన్నారు. ‘‘త్వరలోనే మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు రమ్యా ప్రభాకర్. ‘మనిషి చర్మం వొలిచి వ్యాపారం చేసే గ్యాంగ్‌తో ఓ యువతి చేసే పోరాటమే మా చిత్రం’’ అని శ్రీనివాస్ ఓంకార్ అన్నారు. -
సినిమా ప్రతి ఒక్కరికీ అవసరం: మంత్రి తలసాని
‘‘సినిమాకు కులం, మతం, ప్రాంతం అనే భావన ఉండదు. సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని పంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ అవసరం’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హన్సిక లీడ్ రోల్లో డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ‘ది హిడెన్ ట్రూత్’ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ‘అఖండ, పుష్ప’ సినిమాల రాకతో ఇండస్ట్రీ కొంత పుంజుకుంది. చిత్ర పరిశ్రమ ఇంకా పుంజుకోవాలని తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచడంతో పాటు 5వ ఆటకు అనుమతి ఇచ్చాం. షూటింగ్‌ల పర్మిషన్ కోసం సింగిల్ విండో విధానాన్ని ఓకే చేశాం. తెలంగాణలో ప్రస్తుతానికి థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పరిస్థితులు ఉధృతంగా ఉంటే ఆంక్షలు విధిస్తాం. త్వరలోనే ఆన్లైన్ పోర్టల్‌ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడతాను. ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రం గొప్ప విజయం సాధించాలి’’ అన్నారు. శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ– ‘‘ శరీర అవయవాల మాఫియా నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్ట్‌తో తీసిన చిత్రమిది. ఇలాంటి మంచి సినిమా తీసే చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘మా చిత్రం చాలా బాగుంటుంది.. అందరూ ఆదరించాలి’’ అన్నారు హన్సిక. ‘‘ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొంది? అన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు ప్రభాకర్ గౌడ్. ఈ చిత్రానికి సహనిర్మాతలు: పవన్‌కుమార్ బండి, ఏజీ ఎలియస్, నాగేందర్ రాజు, లైన్ ప్రొడ్యూసర్: కె. విజయ్‌కుమార్.