చాన్నాళ్లకు తెలుగు మూవీతో రాబోతున్న హన్సిక | Hansika's 'My Name Is Shruthi' Movie Will Release Soon | Sakshi
Sakshi News home page

Hansika: క్రేజీ మూవీ రెడీ చేసిన హీరోయిన్ హన్సిక

Published Fri, Sep 29 2023 5:00 PM | Last Updated on Fri, Sep 29 2023 5:06 PM

Hansika My Name Is Shruthi Movie Release Date - Sakshi

దేశ‌ముదురు సినిమాతో హీరోయిన్‌గా తెలుగులోకి హ‌న్సిక ఎంట్రీ ఇచ్చింది. తక్కువ టైంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మెల్లగా ఈమె ఫేమ్ తగ్గిపోయింది. గతేడాది పెళ్లి చేసుకున్న ఈమె ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. అందులో ఒకటి 'మై నేమ్ ఈజ్ శృతి'. ఈ చిత్రానికి శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకుడు. త్వరలోనే విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!)

తాజాగా ఈ సినిమాలోని 'పోరాటం పోరాటం' అనే లిరికల్ పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు.. ఇప్పటివరకు రాని  ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ మూవీలో ప్రతి సీన్ ఎంతో ఉత్కంఠభరితంగా వుంటుందని, ట్విస్ట్‌లు అందరిని కట్టిపడేస్తాయని అన్నారు. చివరివరకు ఎవరి ఊహకందని కథ ఇదని చెప్పుకొచ్చారు. 

హ‌న్సిక మాట్లాడుతూ.. శృతి అనే అమ్మాయిగా ఈ సినిమాలో క‌నిపిస్తా, త‌న భావాల్ని ధైర్యంగా వెల్ల‌డించే యువ‌తిగా విభిన్నంగా నా పాత్ర‌ ఉంటుంది. ఆద్యంతం మ‌లుపుల‌తో ఆస‌క్తికరంగా సినిమా సాగుతుంది.  క‌థ వింటున్న‌ప్పుడు, ముగింపు వ‌ర‌కు ఏం జ‌రుగుతుంద‌నేది అస్సలు ఊహించ‌లేక‌పోయానని చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: ‘పెదకాపు 1’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement