స్కిన్ మాఫియాపై హన్సిక సినిమా.. అమ్మ నుంచి అలాంటి రియాక్షన్! | Hansika New Movie My Name Is Shruthi Skin Mafia Concept | Sakshi
Sakshi News home page

Hansika: సరికొత్త కాన్సెప్ట్ మూవీతో వస్తున్న హన్సిక

Published Thu, Nov 16 2023 5:03 PM | Last Updated on Thu, Nov 16 2023 5:18 PM

Hansika New Movie My Name Is Shruthi Skin Mafia Concept - Sakshi

'దేశ‌ముదురు' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హ‌న్సిక.. ఆ తర్వాత మన దగ్గర కంటే తమిళంలో యమ క్రేజ్ తెచ్చుకుంది. గతేడాది పెళ్లి చేసుకున్నప్పటికీ పలు భాషల్లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తెలుగు లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మై నేమ్ ఈజ్ శృతి'. నవంబర్ 17న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)

థ్రిల్లర్‌ మూవీస్ చాలా ఎంజాయ్‌ చేస్తున్నా. స్కిన్ మాఫియా గురించి చెప్పే డార్క్ థ్రిల్లర్ మా సినిమా. ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి మూవీ ఇదే. శృతి అనే అమ్మాయి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంటుంది. అనుకోకుండా ఓ ట్రాప్‌లో పడుతుంది. తనకు తానుగా బెయిల్ తెచ్చుకుంటుందా? లేదా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అలానే మూవీలో శృతికి ఓ భయంకరమైన సమస్య ఎదురవుతుంది? దాని నుండి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్.

మా అమ్మ డెర్మటాలజిస్ట్. ఈ సినిమా చేస్తున్నప్పుడు నిజంగానే స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మని అడిగాను. ఎక్కడో ఇలాంటి సంఘటన గురించి చదివానని ఆమె చెప్పింది. ఊహించని ట్విస్ట్‌లతో.. చూస్తున్న ప్రతి ఒక్కరికీ థ్రిల్ ఇస్తుందీ సినిమా. నా కెరీర్‌ విషయంలో ఎప్పుడూ బాధపడలేదు. అవకాశాలు ఉన్నా, లేకున్నా నేనిప్పుడూ ఇలానే ఉన్నా. నటన పరంగా మాత్రం నేనింకా సంతృప్తి చెందలేదనే చెబుతాను.

(ఇదీ చదవండి: హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement