Hansika Motwani To Marry Her Business Partner In December - Sakshi
Sakshi News home page

Hansika Motwani : ప్రియుడితో పెళ్లిపీటలు ఎక్కనున్న హన్సిక.. ఆ రోజే డేట్‌ ఫిక్స్‌

Oct 31 2022 3:03 PM | Updated on Oct 31 2022 3:51 PM

Hansika Motwani To Marry Her Business Partner In December - Sakshi

హీరోయిన్‌ హన్సిక మోత్వాని త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నట్లు తెలుస్తోంది. సోహాల్‌ కతూరియా అనే వ్యాపారవేత్తతో చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్న హన్సిక డిసెంబర్‌4న వివాహం చేసుకోనున్నట్లు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్‌ వంటి కార్యక్రమాలకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్‌ మొదలైనట్లు సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది.

రాజస్థాన్‌ జైపూర్‌లోని ముండోటా ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి తంతు జరగనుందట. ఇక హన్సిక ప్రియుడు సోహాల్‌ కతూరియా విషయానికి వస్తే.. ముంబైలోని బడా వ్యాపారవేత్త అని తెలుస్తుంది. చాలాకాలం నుంచి హన్సికకు అతనితో మంచి అనుబంధం ఉందట. అంతేకాకుండా అతని కంపెనీలోనూ హన్సిక షేర్స్‌ ఉన్నట్లు వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఇక కొంతకాలంగా డేటింగ్‌లో మునిగి తేలుతున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్యాలెస్‌లో జరగనున్న పెళ్లి వేడుక కోసం ఇప్పటికే గదులు కూడా బుక్‌ చేసినట్లు సమాచారం. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement