
హీరోయిన్ హన్సిక మోత్వాని వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక ఏడడుగులు వేశారు. జైపూర్‌లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.
అంతేకాదు.. ఎన్జీఓలకు చెందిన పలువురు పేద పిల్లలను, అనాథ పిల్లలను కూడా పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానించారు హన్సిక. అలాగే వివాహం జరుగుతున్న ప్రాంతంలోని చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు ఆదివారం ఆమె విందు ఏర్పాటు చేయించారు. దీనిపై అటు ఫ్యాన్స్, నెటిజన్లు హన్సికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment